లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేరుకోవాలి.

 *లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేరుకోవాలి


*


*: చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన భోజనం అందించాలి*


*: జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్*


పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), మార్చి 01 (ప్రజా అమరావతి):


స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా ఐసిడిఎస్ పరిధిలో కేటాయించిన లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేరుకునేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్ ఆదేశించారు. బుధవారం పుట్టపర్తి కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు (ఎస్డిజి గోల్స్)పై ఐసిడిఎస్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని పూర్తిగా 100 శాతం స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధనకు చర్యలు తీసుకోవాలన్నారు. ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు భోజనం చేసిన తర్వాత అటెండెన్స్ నమోదు చేయడం లేదని, ప్రతి ఒక్కరి అటెండెన్స్ నమోదు ఖచ్చితంగా చేయాలన్నారు. అటెండెన్స్ నమోదులో ఎలాంటి అలసత్వం ఉండరాదన్నారు. ఎప్పటికప్పుడు యాప్ లో అటెండెన్స్ అప్డేట్ చేయాలన్నారు. ఈ విషయమై నిత్యం పర్యవేక్షణ చేయాలన్నారు. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేరుకునేలా పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ సమావేశంలో ఐసిడిఎస్ పిడి లక్ష్మి కుమారి, ఐసిడిఎస్ నోడల్ ఆఫీసర్ గాయత్రి, హిందూపురం ప్రాజెక్టు పరిధిలోని సూపర్వైజర్లు, సిడిపివోలు తదితరులు పాల్గొన్నారు.Comments