అభివృద్ధి పనులను పరుగులు పెట్టించాలి*
*: గడప గడపకు మన ప్రభుత్వం కింద పెండింగ్ ఉన్న పనులను వెంటనే గ్రౌండింగ్ చేయాలి*
*: వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్*
పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), మార్చి 27 (ప్రజా అమరావతి):
జిల్లాలో చేపడుతున్న వివిధ ప్రభుత్వ అభివృద్ధి పనుల్లో పురోగతి చూపించాలని, వేగంగా పనులను చేపట్టి అభివృద్ధిలో జిల్లాను పరుగులు పెట్టించాలని జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం పుట్టపర్తి కలెక్టర్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ భవనాల నిర్మాణం, హౌసింగ్, మనబడి నాడు- నేడు, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు, గడప గడపకు మన ప్రభుత్వం, తదితర అంశాలపై జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో డిఆర్ఓ కొండయ్య, ఆర్డీఓ భాగ్యరేఖ, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అభివృద్ధి పనులపై ప్రతి సోమ, మంగళ వారాల్లో సమీక్ష నిర్వహించుకోవాలన్నారు. పంచాయతీ రాజ్ కింద ఉపాధి హామీలో చేపట్టిన గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ భవనాల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. 57 గ్రామ సచివాలయాలు, 50 రైతు భరోసా కేంద్రాలు, 42 వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్ భవనాలు పూర్తయ్యే దశలో ఉన్నాయని, పిఆర్ డిఈలు ఆయా భవన నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే పూర్తి చేసేలా చూడాలని ఆదేశించారు. ఆయా భవన నిర్మాణాల్లో 74 నిర్మాణాలు ఇంకా మొదలు కాలేదని, వెంటనే పనులు మొదలు పెట్టాలన్నారు.
గడప గడపకు మన ప్రభుత్వంకు సంబంధించి జిల్లాలో 1,382 పనులకు గాను 1,227 పనులు మంజూరు కాగా, 1,099 పనులు గ్రౌండింగ్ చేయడం జరిగిందని, మిగిలిన 128 పనులు త్వరితగతిన గ్రౌండింగ్ చేయాలన్నారు. ప్రతిష్టాత్మకంగా గడపగడపకు మన ప్రభుత్వం పనులు చేపట్టాలన్నారు. అర్బన్ ప్రాంతాల్లో ఎక్కువ పనులు పెండింగ్ ఉన్నాయని, వచ్చే గురువారం నాటికి పనుల్లో పురోగతి తీసుకురావాలన్నారు. మనబడి నాడు - నేడు కింద పాఠశాలల్లో చేపట్టిన పనుల్లో 334 ప్రజలకు సంబంధించి ఫోటో క్యాప్చర్ చేయలేదని, ఫోటో క్యాప్చర్ పూర్తి చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. ఆయా పనులకు సంబంధించి మెటీరియల్, లేబర్ చార్జీల బిల్లులు సకాలంలో అప్లోడ్ చేసేలా సంబంధిత ఎంఈవోలు, హెచ్ఎంలు దృష్టి సారించాలన్నారు. కన్సిస్టెంట్ రిథమ్స్ లో భాగంగా క్షేత్రస్థాయిలో పాఠశాలలను తనిఖీ చేయడం లేదని, కేటాయించిన లక్ష్యం మేరకు మహిళా పోలీసులు, ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ లు పాఠశాలలను తనిఖీ చేయాలని, ఈ మేరకు ఎంపీడీవోలు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని, పాఠశాలల తనిఖీ అనంతరం వివరాలను అప్లోడ్ చేయాలన్నారు. పెండింగ్ ఉన్న చిన్న పిల్లలు, గర్భవతుల ఆధార్ అప్డేషన్ చేయాలని, వారికి సంబంధించి డేటా అప్డేషన్ 100 శాతం తీసుకురావాలని, జిల్లాలో 75 ఆధార్ స్పెషల్ క్యాంపులను మంగళ, బుధవారాల్లో నిర్వహించడం జరుగుతుందని, వాలంటీర్లకు అవగాహన కల్పించి వారి ద్వారా ఆధార్ అప్డేషన్ పూర్తిస్థాయిలో చేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయాల పరిధిలో జగనన్న తోడు, అమ్మఒడి, వైఎస్సార్ చేయూత, వైఎస్ఆర్ కాపు నేస్తం, నేతన్న నేస్తం, తదితర పథకాలకు సంబంధించి డిజిటల్ అక్నాలెడ్జ్మెంట్ కార్డుల మంజూరు పెండింగ్ ఉన్నాయని, ఈ విషయమై ఎంపీడీవోలు దృష్టి పెట్టాలన్నారు.
హిందూపురం అర్బన్, కదిరి అర్బన్, మడకశిర అర్బన్, అమ్మడగురు, గోరంట్ల, పలు మండలాలు వెనకబడి ఉన్నాయి. సంబంధిత ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అధిగమించాలని తెలిపారు.కోర్టు కేసులకు సంబంధించి సకాలంలో కౌంటర్ దాఖలు చేయాలని, కేసుల వారీగా నిత్యం పరిశీలన చేసుకోవాలని డివిజనల్ అధికారులు, తహసిల్దార్లకు సూచించారు. తల్లిదండ్రుల పట్ల పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలని, ఎవరైనా తల్లిదండ్రులను పట్టించుకోవడంలేదని ఫిర్యాదు వస్తే 2007 యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలకు సూచించారు. హౌసింగ్ సంబంధించి జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని నిర్దేశిత సమయంలోగా పూర్తిగా చేరుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, మహిళా పోలీసులు, పాఠశాలలను తనిఖీలు చేసి నివేదికలు పొందుపరచాలని తెలిపారు, ఫీవర్ సర్వే, ఏపీ సేవా సర్వీస్, సేవలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి తెలిపారు. ఈనెల 29వ తేదీన ఐరిష్ ద్వారా ఆధార్ సెంటర్ కలెక్టర్ లో ఏర్పాటు చేయుచున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరు ఆధార్ కార్డుతో అప్డేట్ చేసుకోవాలని తెలిపారు
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సిపిఓ విజయ్ కుమార్, హౌసింగ్ పిడి చంద్రమౌళి రెడ్డి, డ్వామా పిడి రామాంజనేయులు, పిఆర్ ఎస్ఈ గోపాల్ రెడ్డి, డిసిఓ కృష్ణా నాయక్, డిఆర్డీఏ పిడి నరసయ్య, ఇంచార్జి డిఈఓ మీనాక్షి, డిఎంహెచ్ఓ డా. కృష్ణారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment