ఆరోగ్య శ్రీ రిఫరల్, సేవలు కూడా ఫ్యామిలీ డాక్టర్‌ విధుల్లో భాగం కావాలన్న సీఎం.*వైద్య ఆరోగ్యశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.*


*మార్చి 15న ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను ప్రారంభించనున్న సీఎం.*

*ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. వైద్య ఆరోగ్యశాఖపై సమీక్షలో నిర్ణయం.*  


*క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ఫేజ్ ౩లో మిగిలిన వారికి వైఎస్‌ఆర్‌ కంటివెలుగును ప్రారంభించిన సీఎం.*

*35,41,151మంది అవ్వాతాతలకు పరీక్షలు.* *దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా 376 టీమ్స్‌ఏర్పాటు.*అమరావతి (ప్రజా అమరావతి);

*వైద్య ఆరోగ్య శాఖపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.*

మార్చి 15 నుంచి ఫ్యామిలీడాక్టర్‌ కాన్సెప్ట్‌ పూర్తి స్థాయిలో అమలు.

అదేరోజు ఒక విలేజ్‌క్లినిక్‌ వద్ద ప్రారంభించేందుకు అధికారుల ఏర్పాట్లు.

ఫ్యామిలీ డాక్టర్‌ పైలట్‌ ప్రాజెక్టులో ఇప్పటివరకూ 45,90,086 మందికి ఆరోగ్య సేవలు. 

ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు ఫ్యామిలీ డాక్టర్‌కాన్సెప్ట్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి సర్వం సిద్ధంగా ఉందని తెలిపిన అధికారులు.

1,149 పీహెచ్‌సీల్లో పూర్తిస్థాయిలో వైద్యుల నియమాకాలను పూర్తిచేశామన్న అధికారులు.

దీర్ఘకాలిక సెలవుల సమయంలో సేవలకు అంతరాయం లేకుండా ముఖ్యమంత్రిగారు ఇచ్చిన ఆదేశాలమేరకు సీహెచ్‌సీల్లో ఉన్న వైద్యులను ఇక్కడ వినియోగించుకుంటామని, దీనికోసం అదనపు నియామకాలకు కూడా చేశామని తెలిపిన అధికారులు.

ప్రతి జిల్లాకు నలుగురు అదనపు వైద్యులను దీనికోసం నియమించుకున్నామని తెలిపిన అధికారులు. 

ఇతర స్వల్పకాలిక సమయాల్లో కూడా వైద్యసేవలకు అంతరాయం లేకుండా ప్రతి 6–7 పీహెచ్‌సీలకూ ఒక డాక్టర్‌ను అదనంగా నియమించుకున్నామని, ఇలా రాష్ట్రవ్యాప్తంగా 175 మందిని రిజర్వ్‌లో పెట్టుకున్నామని తెలిపిన అధికారులు.

10,032 విలేజ్‌హెల్త్‌ క్లినిక్స్‌లో ప్రతి క్లినిక్‌కూ ఒక ఏఎన్‌ఎం చొప్పున ఉంటారు. వీరితో పాటు ఒక సీహెచ్‌ఓ,  3–4 మంది ఆశా కార్యకర్తలు ఉంటారు.

విలేజ్‌హెల్త్‌క్లినిక్స్, అలాగే 104లలో ఉంచే మందుల సంఖ్యను కూడా పెంచామని తెలిపిన అధికారులు.

సీఎం ఆదేశాల మేరకు అవసరమైన అన్నిరకాలు మందులు ఉండాలన్న లక్ష్యంతో ఇదివరకు ఇస్తున్న 67 రకాల మందులను 105కు పెంచామని తెలిపిన అధికారులు.

అలాగే 14 రకాల డయాగ్నోస్టిక్‌ కిట్లను కూడా విలేజ్‌క్లినిక్స్‌కు అందుబాటులో పెట్టామని తెలిపిన అధికారులు.

మందులకు, డయాగ్నోస్టిక్‌.. తదితర వాటి సరఫరాకు అంతరాయం లేకుండా వాటిని స్టాకులో కూడా ఉంచుతున్నామని తెలిపిన అధికారులు.

రోగులకు అదించే సేవలను రియల్‌టైంలో నమోదు చేయడానికి టూల్స్‌ను ఏర్పాటు చేశామన్న అధికారులు.

పీహెచ్‌సీలను, 104 అంబులెన్స్‌లను అనుసంధానం చేస్తూ మ్యాపింగ్‌కూడా పూర్తిచేశామన్న అధికారులు.

ఇప్పటికే 676 వాహనాలు (104) సేవలు అందిస్తుండగా, కొత్తగా వచ్చే 234 వాటితో కలిపి ఫ్యామిలీ డాక్టర్‌కాన్సెప్ట్‌ అమలుకోసం 910 వాహనాలు (104)లను వినియోగించనున్నట్టు తెలిపిన అధికారులు.

అలాగే ప్రతిజిల్లాకు బ్యాక్‌అప్‌ కింద మరో 104 వాహనాన్నికూడా రిజర్వ్‌లో ఉంచుతున్నామని తెలిపిన అధికారులు.


ఉదయం 9 గంటలనుంచి 4 గంటలవరకూ విలేజ్‌క్లినిక్‌లో అందుబాటులో ఫ్యామిలీ డాక్టర్‌.

జనరల్‌ఓపీ, నాన్‌కమ్యూనికబుల్‌ డిసీజ్‌ మేనేజ్‌మెంట్, గర్భవతుల ఆరోగ్య రక్షణ, అంగన్‌వాడీల సందర్శన, అందులో పిల్లల ఆరోగ్యంపై పరిశీలన, స్కూళ్ల సందర్శన, అందులోని పిల్లల ఆరోగ్యంపై పరిశీలన, రక్తహీనత నివారణపై దృష్టి, మంచానికే పరిమితమైన పేషెంట్ల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి, వారి ఇళ్లకే వెళ్లి సేవలు అందించడం, పంచాయతీ కార్యదర్శితో కలిసి.. గ్రామంలో పారిశుద్ధ్యంపై పర్యవేక్షణ.. ఈ విధులన్నింటినీ కూడా ఫ్యామిలీ డాక్టర్‌ నిర్వర్తిస్తారు.

డిస్ట్రిక్‌హబ్స్‌లో ఉండే స్పెషలిస్టు డాక్టర్ల ద్వారా టెలిమెడిసన్‌ పద్ధతుల్లోకూడా వీరికి సేవలందించేలా చూస్తారు.

హైపర్‌టెన్షన్, డయాబెటీస్‌లాంటి నాన్‌కమ్యూనికబుల్‌డిసీజ్‌లతో బాధపడుతున్న వారి డేటా కూడా ఫ్యామిలీ డాక్టర్‌కు అందుబాటులో ఉంటుంది. 

ఫాలోఅప్‌ ట్రీట్‌మెంట్‌కోసం ఈ డేటాను వినియోగిస్తారు.


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:*

ఆరోగ్య శ్రీ రిఫరల్, సేవలు కూడా ఫ్యామిలీ డాక్టర్‌  విధుల్లో భాగం కావాలన్న సీఎం.

ఆరోగ్య శ్రీ సేవలపై ఎలాంటి ఫిర్యాదులున్నా చేయడానికి ఆరోగ్య శ్రీ కార్డులపై ఫిర్యాదు నంబర్‌ ఉంచాలన్న సీఎం.

ఎవరైనా లంచాలు అడిగినా ఈ నంబర్‌కు చేయాలంటూ కార్డుపై ముద్రించాలన్న సీఎం.

ఎనీమియా కేసులను సంపూర్ణ పోషణ ప్లస్‌తో అనుసంధానం చేయాలన్న సీఎం. 

పోషణ ప్లస్‌ద్వారా వారికి పౌష్టికాహారం అందించేలా చూడ్డం, అది అందుతుందా? లేదా? అన్న పర్యవేక్షణ కూడా చేయాలన్న సీఎం.


మూడో విడతలో మిగిలిన వారికి  వైఎస్‌ఆర్‌ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం.

క్షేత్రస్థాయిలో పరీక్షలకోసం కార్యాచరణ సిద్ధం.

సచివాలయాల వారీగా మ్యాపింగ్‌.

అలాగే దంతపరీక్షలు నిర్వహించడంపైనా దృష్టిపెట్టాలన్న సీఎం. 

దీనికోసం కార్యాచరణ సిద్ధంచేయాలన్న సీఎం. 


*వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు పై సీఎంకు వివరాలందించిన అధికారులు.*


రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా సమగ్రమైన కంటి చికిత్సను ఉచితంగా అందించే కార్యక్రమంలో భాగంగా 2019 అక్టోబరు 10న వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.

80 శాతానికి పైగా కేసుల్లో అంధత్వ సమస్యలను చికిత్స ద్వారా నివారించడంతో పాటు నయం చేయడం సాధ్యం.

ఈ నేపధ్యంలో డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు ద్వారా అంధత్వ సమస్యలను నివారించడమే ప్రభుత్వ లక్ష్యం.


ఈ కార్యక్రమంలో భాగంగా అత్యాధునిక కంటి చికిత్సలను నిర్ధేశించుకున్న లక్ష్యం మేరకు  దశల వారీగా ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వం.

ఇందులో భాగంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌ సెంటర్లు, సచివాలయాలు, పాఠశాలల్లో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించడంతో పాటు కంటి శస్త్ర చికిత్సలను ప్రభుత్వ మరియు గుర్తింపు పొందిన కంటి ఆసుపత్రుల్లో  ఉచితంగా అందిస్తున్న ప్రభుత్వం. 

అవసరమైన మేరకు ఉచితంగా కళ్లద్దాలు, మందులు కూడా అందించిన ప్రభుత్వం.


గ్లూకోమా, డయాబెటిక్‌ రెటీనోపతితో పాటు ఇతర కంటి సమస్యలతో బాధపడుతున్నవారికి అత్యాధునిక కంటి వైద్యాన్ని ఉచితంగా వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందిస్తున్న ప్రభుత్వం. 

ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కంటి వైద్య నిపుణులు, ఇతర సిబ్బందికి అవసరమైన శిక్షణ కోసం ఎల్‌ వి ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌ను భాగస్వామిగా చేసుకున్న ప్రభుత్వం.


*వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు ద్వారా...*

డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు ఫేజ్‌ –1, ఫేజ్‌ –2 ద్వారా ఇప్పటికే 60,393 పాఠశాలల్లో 66,17,613 మంది విద్యార్ధులకు స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహణ.

వీరిలో 1,58,227 మంది విద్యార్ధులకు కళ్లద్దాలు అందజేయడంతో పాటు 310 మందికి శస్త్ర చికిత్సలు నిర్వహించామన్న అధికారులు. 


ఫేజ్‌ –3లో భాగంగా అవ్వాతాతలకు కంటి వెలుగు కార్యక్రమాన్ని 60 సంవత్సరాలు దాటిన 24,65,300 మందికి ఇప్పటికే స్క్రీనింగ్‌ పరీక్షలు పూర్తి.

వీరిలో సుమారు 8 లక్షల మందికి పైగా కళ్లద్దాలు అందించారు.  మరో 4,70,034 మందికి కంటి శుక్లం శస్త్రచికిత్సలు నిర్వహించామని తెలిపిన అధికారులు.   

ఈ నేపధ్యంలో మూడో విడతలో మిగిలిన వారికి వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం శ్రీ వైయస్.జగన్‌ క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు.

గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ఈ కంటి స్క్రీనింగ్‌ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 60 యేళ్లు పైబడిన మరో 35,42,151 మందికి కంటి పరీక్షలు నిర్వహిస్తారు. దీనికోసం 26 జిల్లాల్లో మైక్రో యాక్షన్‌ ప్లాన్‌లు తయారు చేసి... 376 బృందాలతో స్క్రీనింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఈ యేడాది ఆగష్టులోగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నారు. 


*వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడు పైనా సీఎం సమీక్ష.*

రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న మెడికల్‌కాలేజీల్లో పనులు కొనసాగుతున్నాయని తెలిపిన అధికారులు.

విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కాలేజీల్లో 2023–24 విద్యాసంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నామని తెలిపిన అధికారులు.

విజయనగరం మెడికల్‌ కాలేజీకి ఇప్పటికే అనుమతులు ఇచ్చారని, మిగతా కాలేజీలకూ అనుమతులు రానున్నాయని తెలిపిన అధికారులు.


సీఎం ఆదేశాల మేరకు 108 పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నామని తెలిపిన అధికారులు. 

క్రమం తప్పకుండా రివ్యూ చేసి, కండిషన్‌లో లేనివాటిని తీసివేస్తున్నామని తెలిపిన అధికారులు.

ఇలా తీసివేసిన వాటి స్థానంలో కొత్తవాటిని పెడుతున్నామని తెలిపిన అధికారులు.

కొత్తగా 146 వాహనాలను (108) కొనుగోలు చేస్తున్నామన్న అధికారులు.ఈ సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టి కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ జె నివాస్, ఆరోగ్యశ్రీ సీఈఓ ఎం ఎన్‌ హరీందిర ప్రసాద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌ రెడ్డి, డ్రగ్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ రవిశంకర్‌  ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Comments