మంచినీటితో వ్యాపారం తగదు.

 


*మంచినీటితో వ్యాపారం తగదు**నీటి మీటర్లతో ప్రజలపై భారం ఘోరం*


*విజయవాడలో నీటి మీటర్ల బిగింపుపై మల్లాది విష్ణు బుకాయింపు*


*నగరపాలక సంస్థ కౌన్సిల్ వేదికగా సిపిఎం కార్పొరేటర్ రాజీనామాకు విష్ణు సవాల్*


*నీటి మీటర్లపై ఏ రకమైన సవాల్ నైనా ఎదుర్కోవటానికి సిపిఎం సిధ్ధం*


*ప్రభుత్వ విధానంపై ప్రత్యక్ష పోరాటానికి రెడీ*


*విజయవాడ మధురానగర్ లో నీటి మీటర్ల పెట్టిన విషయంపై వాస్తవాన్ని గుర్తించి మల్లాది విష్ణు ప్రజలకు క్షమాపణ చెప్పాలి*


*పెట్టిన మీటర్లు తొలగించాలి, భవిష్యత్తులో మీటర్లు పెట్టబోమని ప్రభుత్వం తరఫున ప్రకటించాలి*


*లేనియెడల నీటి మీటర్ల  ప్రత్యక్ష పరిశీలనకు సిపిఎం సిద్ధం*


*మల్లాది విష్ణు, మేయర్, ప్రజా ప్రతినిధులు ఈ సవాలును స్వీకరించి తేదీ, సమయం ప్రకటించండి*

విజయవాడ (ప్రజా అమరావతి);


 నేడు విజయవాడ సిపిఎం కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు డి. కాశీనాథ్, సిపిఎం ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ బోయి సత్యబాబు మాట్లాడారు.

నేతలు మాట్లాడుతూ....


 విజయవాడలోనూ, రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో అభివృద్ధి కార్యక్రమాలు స్తంభించాయి. పన్నుల భారాలు తప్ప పనులు లేవు


 ఇంటి పన్ను పెంపు, చెత్త పన్ను, నీటి మీటర్లు తదితర రూపాలలో వైసిపి ప్రభుత్వం భారాలు మోపుతోంది


 కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు లోబడి అమృత్ పథకం పేరుతో విజయవాడలో మధురానగర్, పసుపు తోటలో 900 గృహాలకు నీటి మీటర్లు బిగించారు


 మరో 25 వేల మీటర్లు నగరంలో బిగించడానికి ఏర్పాట్లు చేశారు. కాంట్రాక్ట్ అప్పగించారు. దశలవారీగా నగరవ్యాప్తంగా ప్రతి ఇంటికి నీటిమీటర్ బిగించడానికి, రాష్ట్రంలో 33 పట్టణాలు, నగరాల్లో  నీటి మీటర్ల పేరుతో నీటి వ్యాపారం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి 


ఈ వాస్తవాన్ని వైసిపి శాసనసభ్యుడు మల్లాది విష్ణు మరుగుపరుస్తూ సిపిఎంపై విజయవాడ నగరపాలక సంస్థ వేదికలో సవాళ్లు విసరడం శోచనీయం

 

నీటి మీటర్లు బిగించలేదని పచ్చి అబద్ధాలు చెబుతూ, బకాయిస్తూ నీటి మీటర్లపై సిపిఎం కార్పొరేటర్ రాజీనామాలు చేయాలని విష్ణు సవాళ్లు విసరడం హాస్యాస్పదం


 సిపిఎం నీటి మీటర్ల పై ఏ రకమైన సవాలు నైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉంది


నీటి మీటర్లు బిగించిన విషయాన్ని, 24 గంటల నీటి పథకంతో నీటి వ్యాపారాన్ని, ప్రభుత్వ బండారాన్ని రుజువు చేస్తాం 


 గత రెండు నెలలుగా ఆందోళన చేస్తున్నాం, నీటి మీటర్ల విషయం ఆధారాలతో సహా మీడియా ప్రజల ముందు ఉంచింది 


అయినా అవాస్తవాలు వల్లె వేస్తూ, ప్రజలను తప్పుదారి పట్టించడానికి వైసిపి ప్రజాప్రతినిదులు ప్రయత్నించడం తగదు 


ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని మల్లాది విష్ణు నగర ప్రజలకు క్షమాపణ చెప్పాలి 


తన నియోజకవర్గంలో పెట్టిన నీటి మీటర్లు తొలగింపుకు చర్యలు చేపట్టాలి


 విజయవాడ నగరంలోను నీటి మీటర్లు భవిష్యత్తులో పెట్టబోమని అధికారయుతంగా ప్రకటించాలి


 శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రం లో నీటి మీటర్లు పెట్టబోమని ముఖ్యమంత్రితో ప్రకటన చేయించాలి


 15వ తేదీ లోపల మీరు స్పందించండి. నీటి మీటర్ల అంశాన్ని ప్రత్యక్షంగా పరిశీలించడానికి, రుజువు చేయడానికి, చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం


తేదీ, సమయం మీరు ప్రకటించండి. లేని ఎడల మేమే తేదీ ప్రకటిస్తాం. నీటి మీటర్లను చూపిస్తాం. మీ కళ్ళు తెరిపిస్తాం, నీటి మీటర్ల అంశంపై ప్రత్యక్ష పోరాటానికి సిపిఎం, ప్రజలు సిద్ధంగా ఉన్నారు.


నగరపాలక సంస్థ  బడ్జెట్ సమావేశాన్ని ముఖ్యమంత్రికి భజన చేసే సమావేశంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మార్చటం సిగ్గుచేటు 


బడ్జెట్ పై ప్రజాభిప్రాయాన్ని, ప్రతిపక్షాల సూచనలను పరిగణన లోకి తీసుకోకుండా ఏకపక్షంగా, నిరంకుశంగా ఆమోదించారు


 స్థానిక సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం దిగజార్చింది, స్థానిక సంస్థల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించి తన ఖజానాలో వేసుకుంటున్నది.


ప్రభుత్వం ఇవ్వవలసిన గ్రాంట్లు ఇవ్వకపోయినా నగరంలోని ప్రజా ప్రతినిధులు మిన్నకుండిపోవడం సిగ్గుచేటు


విజయవాడ నగరానికి రావాల్సి నిధులు రాబట్టకుండా వైసిపి ప్రజాప్రతినిధులు సిపిఎం పైన, ప్రతిపక్షాల పైన సవాళ్లు విసరడం హాస్యాస్పదం. విజయవాడ నగరాలలో రెండేళ్లలో ఇంటి పన్నులను 100 కోట్ల నుండి 200 కోట్లకు పెంచారు


 మంచినీటి పన్నులను 29 కోట్ల నుండి 49 కోట్లకు భారం పెంచారు


 ఇంపాక్ట్ ఫీజు పేరుతో 10 కోట్లు భారం మోపుతున్నారు


 స్విమ్మింగ్ పూల్సు, పార్కులు, పార్కింగ్ స్థలాలు దేనిని వదిలిపెట్టకుండా ప్రజలపై తీవ్రమైన భారాలు వేస్తున్నారు


 చెత్త పన్ను పేరుతో సంవత్సరానికి అదనంగా 15 కోట్లు రాబట్టడానికి ప్రతిపాదనలు పెట్టారు 


 రెవిన్యూ ఆదాయం పేరుతో భారాలు 502 కోట్ల నుండి 859 కోట్లకు పెంచారు 


 అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయి, కనీసం టెండర్లు వేయటానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం గమనార్హం


 మురికివాడలు, కాలనీల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారు. ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కేటాయించలేదు


 రాష్ట్రంలో గత నాలుగేళ్ల వైసిపి పాలనలో, విజయవాడలో రెండేళ్ల కార్పొరేషన్ పాలనలో నగరాన్ని పూర్తిగా దిగజార్చారు. అధోగతి పాలు చేశారు 


ఈ అన్ని అంశాలపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం


 ఇప్పటికైనా నీటి మీటర్ల పై గతంలో ఇచ్చిన హామీకి కట్టుబడి, పెట్టిన మీటర్లు తొలగించాలి. మీటర్లు పెట్టే ప్రక్రియ ఆపాలి 


గత రెండు దశాబ్దాలుగా విజయవాడలో సిపిఎం, ప్రజలు పోరాడి మీటర్లను అడ్డుకున్నారు. ఇప్పుడు పోరాటం కొనసాగిస్తాం. నీటి మీటర్లను అడ్డుకుంటాం ప్రతిఘటిస్తాం. పాలకులకు బుద్ధి చెప్తాం.

 

Comments