సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలి.

 *సమన్వయంతో కలిసికట్టుగా పనిచేయాలి*



*యువగళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు* 

 

*వచ్చే ఎన్నికల్లో విజయం టీడీపీదే*


*టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు*


గుంటూరు, (ప్రజా అమరావతి): నియోజకవర్గ పరిశీలకులు కార్యకర్తలు, నేతలతో సమన్వయంతో కలిసికట్టుగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపుకు పాటుపడాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ టీడీపీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకుల సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ నియోజక వర్గాల్లో పార్టీని బలోపేతం చేయడంపై నియోజకవర్గ పరిశీలకులు ప్రధాన దృష్టిపెట్టాలి. ఇదేంఖర్మ- మన రాష్ట్రానికి కార్యక్రమంతో పాటు ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల నిర్వహణపై, కుటుంబసాధికార సారథుల పనితీరుపై పరిశీలకులు దృష్టిపెట్టాలి.కుటుంబ సాధికార సారథుల పని కేవలం 20శాతంమాత్రమే పూర్తైంది. మిగిలిన 80శాతాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేయాలి. 2024 ఎన్నికల్లో విజయం సాధించాలంటే అన్ని నియోజకవర్గాల్లో ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి. సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కోవడానికి టీడీపీ సర్వసన్నద్ధంగా ఉంది. ఆ సంకేతమే ప్రజల్లోకి బలంగా వెళ్లేలా పరిశీలకులు, రాష్ట్రస్థాయినేతలు పనిచేయాలి. రాష్ట్రంలో జరుగుతున్న రాక్షసపాలనను అంతమొందించాలంటే పార్టీనేతలు, కార్యకర్తలు సమన్వయంతో, కలిసికట్టుగా పనిచేయాలి. లోకేశ్ యువగళం పాదయాత్రతో ప్రజలకు బాగాదగ్గరయ్యారు. ముఖ్యంగా రైతులు, యువత, విద్యార్థులు, మహిళల సమస్యలపై నిత్యం ప్రజలతో మమేకమవుతున్నారు.యువగళం పాదయాత్రకు ప్రజలనుంచి అనూహ్యస్పందన వస్తోంది. దాన్నికూడా జనంలోకి తీసుకెళ్లేలా  నేతలు, కార్యకర్తలు, నియోజకవర్గ పరిశీలకులు సమన్వయంతో పనిచేయాలని అచెన్నాయుడు సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, నక్కా ఆనందబాబు, మాజీ మంత్రులు బండారు సత్యనారాయణ, కె.ఎస్ జవహర్, ప్రత్తిపాటి పుల్లారావు, పీతల సుజాత, ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు, టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్ , మాజీ ఎమ్మెల్యే డా. అప్పల నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Comments