*కువైట్ లో చనిపోయిన హసనాపురం మౌలాలి కుటుంబ సభ్యులకు రూ.51,41,008ల చెక్కు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు*
పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా), ఏప్రిల్ 24 (ప్రజా అమరావతి):
జిల్లాలోని ఎన్ పి కుంట మండల కేంద్రానికి చెందిన హసనాపురం మౌలాలి 05-05-2017 తేదీన కువైట్లో ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఎంబసీ ఆఫ్ ఇండియా సెక్రెటరీ వారు చనిపోయిన హసనాపురం మౌలాలి కుటుంబ సభ్యులకు 51,41,008 రూపాయల పరిహారం మంజూరు చేశారు. ఈ మేరకు సోమవారం పుట్టపర్తి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కువైట్ లో చనిపోయిన మౌలాలి కుటుంబ సభ్యులైన తండ్రి భాష హసనాపురంకి జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు చేతుల మీదుగా పరిహారం సొమ్ము 51,41,008 రూపాయల చెక్ ను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కొండయ్య, ఆర్డీవో భాగ్య రేఖ, తహసిల్దార్ అనుపమ పాల్గొన్నారు.
addComments
Post a Comment