జగనన్న వసతి దీవెన


అమరావతి (ప్రజా అమరావతి);


*జగనన్న వసతి దీవెన*


*నేడు (26.04.2023) రాష్ట్రవ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ. 912.71 కోట్లు బటన్‌ నొక్కి జమ చేయనున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌*


*అనంతపురం జిల్లా నార్పలలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి ఆర్ధిక సాయాన్ని విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌*


*నేడు జమ చేస్తున్న రూ. 912.71 కోట్లతో కలిపి జగనన్న వసతి దీవెన ద్వారా ఇప్పటివరకు 25,17,245 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ. 4,275.76 కోట్లు జమ చేసిన శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం*


*గత ప్రభుత్వంలో అరకొరగా ఫీజు రీఇంబర్స్‌మెంట్, అదీ కొద్దిమందికే, 2017 సంవత్సరం నుండి పెట్టిన బకాయిలు రూ. 1,778 కోట్లతో కలిపి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన క్రింద ఇప్పటివరకు శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 14,223.60 కోట్లు*.


*జగనన్న వసతి దీవెన*


ఉన్నత చదువులు చదివే పేద విద్యార్ధులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్ధులకు రూ. 10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్ధులకు రూ. 15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ. 20 వేల చొప్పున ఆర్ధిక సాయం, కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి, వారి తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి రెండు దఫాల్లో నేరుగా జమ చేస్తున్న శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.


*జగనన్న విద్యా దీవెన*


నిరుపేద విద్యార్ధులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే అర్హులైన పేద విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం



పేదరికం కారణంగా ఏ విద్యార్ధి ఉన్నత చదువులకు దూరం కాకూడదు. చదువుల ఖర్చుతో తల్లిదండ్రులు అప్పులపాలు కాకూడదన్న సమున్నత లక్ష్యంతో... ఒకవైపు పేద విద్యార్ధుల చదువులకయ్యే ఫీజు ఖర్చులను పూర్తిగా భరించడంతో పాటు మరొకవైపు భోజన, వసతి ఖర్చులకు కూడా వారు ఇబ్బంది పడకూడదనే మంచి ఉద్దేశ్యంతో శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందిస్తున్న కానుక జగనన్న వసతి దీవెన.


*శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో...*


పేద విద్యార్ధులు ఉన్నత చదువులు అభ్యసించేందుకు జగనన్న విద్యా దీవెన క్రింద పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్, జగనన్న వసతి దీవెన క్రింద ప్రతి విద్యార్ధికి భోజన, వసతి ఖర్చుల కోసం ఏడాదికి మరో రూ. 20,000 వరకు కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి ఆర్ధిక సాయం


కాలేజీల్లో జవాబుదారీతనం పెరిగేలా, తల్లులకు ప్రశ్నించే హక్కు కల్పిస్తూ, తల్లుల సాధికారతకు పట్టం కడుతూ ఆర్ధిక సాయం నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ


*గత ప్రభుత్వంలో...*


ఉన్నత చదువులు చదివే పేద విద్యార్ధులకు భోజన, వసతి ఖర్చుల సంగతి దేవుడెరుగు. పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ ఇవ్వాలనే ఆలోచన కూడా చేయలేదు. అరకొరగా ఇచ్చిన ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ కూడా సంవత్సరాల తరబడి జాప్యంతో, భారీగా బకాయిలు పెట్టిన పరిస్ధితి


2017–18, 2018–19 సంవత్సరాలకైతే ఏకంగా రూ. 1,778 కోట్ల ఫీజు రీఇంబర్స్‌మెంట్‌ కాలేజీలకు బకాయిలు పెట్టిన దుస్ధితి


*శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంలో ఉన్నత విద్యకు ప్రోత్సాహం*


జాబ్‌ ఓరియెంటెడ్‌ కరిక్యులమ్‌తో ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు కరిక్యులమ్‌లో మార్పులు చేసి నాలుగేళ్ళ ఆనర్స్‌ కోర్సులు, విద్యార్ధులలో నైపుణ్యాలను పెంచి వారు వెంటనే ఉపాధి పొందేలా 30 శాతం నైపుణ్యాభివృద్ధి కోర్సులు


కరిక్యులమ్‌లో భాగంగా ఆన్‌లైన్‌ వర్టికల్స్, దీనివల్ల విద్యార్ధులు తాము చదువుతున్న కోర్సులతో పాటు తమకు అవసరమైన ఇతర నైపుణ్యాలు ఆన్‌లైన్‌లో నేర్చుకునే వెసులుబాటు


కరిక్యులమ్‌లో 10 నెలల కంపల్సరీ ఇంటర్న్‌షిప్‌ పెట్టడం ద్వారా విద్యార్ధులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్న శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం


40 నైపుణ్యాలలో 1.62 లక్షల మంది విద్యార్ధులకు శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం, దేశంలో ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో 2 లక్షల కంటే ఎక్కువ సర్టిఫికేషన్స్‌ సాధించిన ఏకైక రాష్ట్రం మనదే


*సత్ఫలితాలిస్తున్న శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ సంస్కరణలు*


ఇంటర్‌ పాస్‌ అయి పై చదువులకు దూరమైన విద్యార్ధుల సంఖ్య 2018–19లో 81,813 కాగా శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యాదీవెన, వసతిదీవెన కారణంగా ఈ సంఖ్య గణనీయంగా తగ్గి 2022–23 నాటికి కేవలం 22,387 కి చేరింది. 2022–23 నాటికి ఇంటర్‌ పాసై పై చదువులకు పోలేని విద్యార్ధుల జాతీయ సగటు 27 శాతం కాగా, మన రాష్ట్రంలో ఇది కేవలం 6.62 శాతం మాత్రమే


2018–19 సంవత్సరంలో 32.4 గా ఉన్న స్ధూల నమోదు నిష్పత్తి (జీఈఆర్‌), రాబోయే రోజుల్లో జీఈఆర్‌ శాతం 70కి తీసుకువెళ్ళేలా చర్యలు, 2018–19 లో సగటున ప్రతి 100 మంది బాలురకు 81 మంది బాలికలు కళాశాలల్లో చేరితే 2020–21 నాటికి ఈ సగటు 94కు పెరిగింది


2018–19లో 37,000 గా ఉన్న క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ కూడా గణనీయంగా పెరిగి 2021–22 నాటికి 85,000 కు చేరడం విశేషం


*డిజిటల్‌ విద్య దిశగా అడుగులు*


8 వ తరగతి విద్యార్ధులకు బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ఉచిత ట్యాబ్‌లు, నాడు నేడు ద్వారా ఇప్పటికే అభివృద్ది చేసిన పాఠశాలల్లో 6 వ తరగతి పైన ప్రతి క్లాస్‌ రూమ్‌లో ఉండేలా 30,213 ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్, 10,038 ఫౌండేషన్, ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూళ్ళలో స్మార్ట్‌ టీవీలు, ప్రభుత్వ బడులు కార్పొరేట్‌ బడులతో పోటీ పడడం కాదు, కార్పొరేట్‌ బడులే ప్రభుత్వ బడులతో పోటీపడాలి అన్న లక్ష్యంతో విద్యావ్యవస్ధలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిన శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం


అధికారంలోకి వచ్చిన ఈ 46 నెలల కాలంలో కేవలం విద్యారంగ సంస్కరణలపై శ్రీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేసిన వ్యయం అక్షరాలా రూ. 58,555.07 కోట్లు.

Comments