*రీ సర్వే ప్రక్రియ వేగవంతం చేయాలి: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. జవహర్ రెడ్డి*
*మొదటి ఫేజ్ కింద రీ సర్వే ప్రక్రియ పూర్తి అయిన వాటికి రాళ్ళు నాటే కార్యక్రమాన్ని ఈ నెల ఆఖరి లోపు పూర్తి చేయాలి*
*గృహ నిర్మాణంలో రోజు వారీగా స్టేజి పురోగతి ఉండాలి:కలెక్టర్*
పుట్టపర్తి, ఏప్రిల్20 (ప్రజా అమరావతి): రీసర్వే వేగవంతం చేయాలని, జాతీయ రహదారుల భూసేకరణ, గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని, స్పందన గ్రీవెన్స్ లను నాణ్యతతో పరిష్కరించాలని, పర్యాటక శాఖకు చెందిన భూమి అలియనేషన్ త్వరితగతిన చేయాలని, వ్యవసాయ మరియు అనుబంధ శాఖలు, పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలు మెరుగైన సేవలు ప్రజలకు అందించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
పుట్టపర్తి కలెక్టరేట్లోని స్పందన వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు, జాయింట్ కలెక్టర్ టీఎస్.చేతన్, డిఆర్ఓ కొండయ్య, సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు హాజరయ్యారు.
గురువారం రీ సర్వే, ఇంటి స్థలాలు, హౌసింగ్, పర్యాటక శాఖ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖల అంశాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంబంధిత కార్యదర్శులతో వర్చువల్ విధానంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్షించగా
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో సమావేశమై జిల్లాలో చేపడుతున్న జగనన్న భూహక్కు - భూ రక్ష రీసర్వే లో రెండవ ఫేజ్ గ్రౌండ్ ట్రూతింగ్, గ్రౌండ్ వ్యాలిడేషన్, వెక్టరైజేషన్ డి ఎల్ ఆర్ పబ్లిష్ చేయడం హక్కు పత్రాలు అందజేయడం వంటివి సకాలంలో పూర్తి అయ్యేలా ప్రణాళికా బద్ధంగా పనిచేయాలని సూచించారు. మొదటి ఫేజ్ కింద రీ సర్వే ప్రక్రియ పూర్తి అయిన వాటికి రాళ్ళు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలనీ రాళ్ళు తగినన్ని అందుబాటులోకి వస్తాయని ఈ నెల లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలనీ సూచించారు.
ఈ కార్యక్రమంలో సిపిఓ విజయ్ కుమార్
హౌసింగ్ పిడి చంద్రమౌళి రెడ్డి, సర్వే ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి రామకృష్ణ, డ్వామా పిడి రామాంజనేయులు, పీఆర్ ఎస్ఈ గోపాల్ రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, పట్టుపరిశ్రమ శాఖ జెడి పద్మమ్మ, కదిరి ఆర్డీఓ రాఘవేంద్ర, డిసిఓ కృష్ణనాయక్, ఏపిఎంఐపి పిడి సుదర్శన్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రషిద్ ఖాన్, డీపీఓ విజయ్ కుమార్, డిఆర్డిఏ పిడి నరసయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment