మచిలీపట్నం ఏప్రిల్ 20 (ప్రజా అమరావతి);
జిల్లాలో వై. ఎస్.ఆర్. జగనన్న ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అధికారులను ఆదేశించారు.
గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజితా సింగ్, డిఆర్ఓ ఎం. వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, ఆర్డీవోలు, క్షేత్రస్థాయి అధికారులతో పేదలందరికీ ఇళ్లు,రీ సర్వే, జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమాలపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు.
పునాది స్థాయి(బి. ఎల్) ఆపై స్థాయిల్లో ఉన్న 30వేల గృహాల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం రోజుకు 945 గృహాలను దశల వారీ పూర్తి చేసే విధంగా లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు.
జిల్లాలో గన్నవరం, ఉంగుటూరు, ఉయ్యూరు, చల్లపల్లి మండలాల్లో పురోగతి చాలా వెనుకబడి ఉందని తెలుపుతూ ఆ ప్రాంతాల్లో సంయుక్త కలెక్టర్, సంబంధిత ఆర్డీవోలు క్షేత్ర పర్యటనలు చేసి వాస్తవ విషయాలను తెలుసుకొని పురోగతి సాధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
సంబంధిత ఆర్డీవోలు, ఎంపీడీవోలు, తహసీల్దారులు, గృహ నిర్మాణ సంస్థఅధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి నిర్ణీత లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు.
గృహాల నిర్మాణానికి అవసరమైన సిమెంటు ఇనుము, ఇసుక తదితర సామాగ్రి తో పాటు బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయం అందించేందుకు అన్ని విధాల తోడ్పడాలన్నారు.
జిల్లాలో రి సర్వే కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలన్నారు. జిల్లాలోని సర్వేయర్ల నందరిని ఇందుకోసం వినియోగించుకోవాలని, ఏ ఒక్క రోవర్ను ఖాళీగా ఉంచకుండా అన్నింటిని సద్వినియోగం చేసుకోవాలని, వేసవి ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 6 గంటలకు రీ సర్వే కార్యక్రమం మొదలయ్యే విధంగా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమం లో పరిష్కరించిన ప్రజల అర్జీలు సంతృప్తికరంగా ఉన్నాయా లేదా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఒకవేళ ఏదైనా అసంతృప్తి ఉంటే సంబంధిత అర్జీదారులను ఎందుకో విచారించి విశ్లేషించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వ ప్రతిష్టను మరింత మెరుగుపరిచే విధంగా విధానం అనుసరించాలన్నారు.
క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ అంశాల పైన అభిప్రాయాలను తెలియజేయాలన్నారు.
పరిష్కరించిన అర్జీలు మళ్లీ వస్తూ ఉంటే సంబంధిత జిల్లా అధికారులు వాటిపైన ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాల్సి ఉంటుందన్నారు.
గడువు దాటి అర్జీలు పరిష్కారం కాకుండా ఉండడానికి వీలు లేదన్నారు.
ప్రజల అర్జీలను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
ఈ టెలికాన్ఫరెన్స్లో మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీవోలు తహసిల్దార్లు పాల్గొన్నారు
addComments
Post a Comment