రక్తహీనత నివారణకు పటిష్టమైన చర్యలు

 ఎపి వైద్య ఆరోగ్యశాఖ



రక్తహీనత నివారణకు పటిష్టమైన చర్యలు 


ఎస్డిజి లక్ష్య సాధనపై సమన్వయ సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎంటి క్రిష్ణబాబు


అమరావతి (ప్రజా అమరావతి):

స్థిరమైన 

అభివృద్ధి  లక్ష్యాల సాధన (సస్టెయినబుల్ డెవలెప్మెంట్ గోల్స్  -SDG ) కు సంబంధించి  వైద్య ఆరోగ్య , మహిళా శిశు సంక్షేమ, పాఠశాల విద్యా ,  గ్రామ వార్డు సచివాలయాల ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం సోమవారం నాడు మంగళగిరిలోని ఎపిఐఐసి బిల్డింగ్ ఆరోఫ్లోర్ కాన్ఫరెన్స్ హాల్లో వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణ బాబు ఆధ్వర్యంలో జరిగింది. మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముద్దాడ రవిచంద్ర, పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, సెర్ప్ సీఇవో ఎం.డి.ఇంతియాజ్ పాల్గొన్నారు.    ఈ సమావేశంలో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టర్లు వర్చువల్ గా పాల్గొన్నారు.


*ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎం.టి. క్రిష్ణ బాబు ఏమన్నారంటే....*

‘‘కౌమార బాల బాలికలు , గర్భిణులు, పాలిచ్చే తల్లులలో రక్తహీనత నివారణకు చర్యలు తీసుకుంటున్నాం

స్కూలు హెల్త్ అంబాసిడర్ల వ్యవస్థ ను బలోపేతం చేయాలి

విటమిన్ సి , విటమిన్ బి12 కలిసిఉన్న 

ఐరన్ ఫోలిక్ యాసిడ్(IFA)  గమ్మీస్ ను అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం జిల్లాల్లో ఒక్కో మండలాన్ని ఎంపికచేసి పంపిణీ చేయాలి

ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ స్కూళ్లలో కూడా దీన్ని మూడు నెలల పాటు అమలు చేసి , అమలు తీరును అంచనా వేయాలి. 

అనీమియాకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ సేకరించిన సమాచారాన్ని మహిళా శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని అంగన్వాడీ సెంటర్లతో అనుసంధానించాలి. జగనన్న పోషణ కిట్లను సమర్ధవంతంగా పంపిణీ చేయాలి. దేశంలోనే కౌమార బాల బాలికల్లో రక్తహీనత నిర్ధారణ పరీక్షలను ప్రతి మూ

డు నెలలకోసారి నిర్వహిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే... ఎఎన్ఎం, ఆశాల ద్వారా ప్రతి గురువారం ఐఎఫ్ఎ సప్లిమెంట్ ట్యాబ్లెట్లను రక్త హీనత వున్న కౌమార బాల బాలికలకు ప్రతి రోజూ రెండు  ట్యాబ్లెట్ల (బ్లూ రంగు)ను మధ్యాహ్న భోజనం తరువాత ఇస్తున్నారు. ఇలా మూడు నెలల పాటు ఇస్తారు.  5..9 సంవత్సరాల మధ్య వయస్కులైన బాలబాలికలకు రక్తహీనత నివారణ కోసం గులాబి (పింక్) రంగు ట్యబ్లెట్లను మధ్యాహ్న భోజనం తరువాత  ఒక ట్యాబ్లెట్ వంతున ఇస్తున్నారు.  రక్త హీనత ఎక్కువగా వున్న కౌమార బాల బాలికల వివరాలను ఫ్యామిలీ డాక్టర్ విధానంలో పనిచేస్తున్న వైద్యాధికారికి చికిత్స నిమిత్తం రిఫర్ చేస్తారు.  ఐఎఫ్ ఎ ట్యాబ్లెట్లు అవకముందే వైద్య ఆరోగ్యశాఖకు మధ్యాహ్న భోజన పథకం (MDM) యాప్ ద్వారా సమాచారం అందచేస్తారు.  స్వేచ్ఛ (swetcha) కార్యక్రమం కింద శానిటరీ న్యాప్కిన్స్ పై కూడా చర్చించారు. బాల బాలికలకు శానిటరీ న్యాప్కిన్స్ కొనుగోలుకు సంబంధించిన నిధులను వైద్య ఆరోగ్యశాఖ పాఠశాల విద్యా శాఖకు అందచేస్తుంది. ప్రతి నెలా తప్పనిసరిగా గర్భిణులకు హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.  తద్వారా రక్తహీనత కలిగిన గర్భిణుల సమాచారాన్ని అంగన్వాడీ కేంద్రాలకు అందచేస్తారు.  ఈ సమాచారం ఆధారంగా వారికి పౌష్టికాహారాన్ని అందచేస్తారు. రక్తహీనత వున్న గర్భిణులకు మధ్యాహ్న భోజనం తరువాత వేసుకునే లా రెండు ఐఎఫ్ఎ ట్యాబ్లెట్ల అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందచేస్తారు.  ఈ వివరాలను వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ్ యాప్ లో నమోదు చేస్తారు.  ఐఎఫ్ఎ ట్యాబ్లెట్లను 50 శాతం మేర వినియోగించిన వెంటనే అంగన్వాడీ వర్కర్లు వైద్యాధికారికి, ఎఎన్ఎంకు స్టాక్ అలెర్ట్ ఇండెంట్ ను అందచేస్తారు.  ఐఎఫ్ఎ ట్యాబ్లెట్లను బఫర్ స్టాక్ పెడుతున్నాం. రక్తహీనత తీవ్రంగా, మధ్యస్థంగా వున్న గర్భిణుల వివరాలను ఫ్యామిలీ డాక్టర్ కు అందచేయటం ద్వారా మెరుగైన చికిత్సను అందిస్తారు. ఇందుకు సంబంధించి ఫాలో అప్ చికిత్సను ఎఎన్ఎం పర్యవేక్షిస్తారు.  రిప్రొడక్టివ్ చైల్డ్ హెల్త్ (ఆర్ సి హెచ్) డేటాకు ఆధార్ నెంబర్ను అనుసంధానించేందుకు చర్యలు తీసుకుంటారు. పౌష్టికాహారం కోసం అంగన్వాడీ కేంద్రాలకు వెళ్ళలేకపోయిన గర్భిణులకు ఇంటికి తీసుకెళ్లే ఆహార పదార్ధాలతో పాటు ఐఎఫ్ఎ ట్యాబ్లెట్లను అందచేస్తారు. స్కూల్కు వెళ్ళని కౌమార బాల బాలికలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఐఎఫ్ఎ ట్యాబ్లెట్లను అందచేస్తారు.  3, 6 నెలల మధ్య పిల్లలకు ఎఎన్ఎంలు వారి వారి తల్లులకు ఐఎఫ్ఎ సిరప్ ను అందచేసి, వినియోగించేందుకు తగిన సూచనలిస్తారు..్


Comments