*- ప్రతి ఇంటికీ ఒక విజన్ ను రూపొందించే పనిలో చంద్రబాబు
*
*- ఆర్ధిక అసమానతలను తగ్గించేందుకు ప్రణాళికలు*
*- ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు*
*- గుడివాడలో ఇంటింటికీ తెలుగుదేశం నిర్వహిస్తున్నాం*
*- మీడియాతో టీడీపీ సీనియర్ నేత వెనిగండ్ల రాము*
గుడివాడ, ఏప్రిల్ 3 (ప్రజా అమరావతి): రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఒక విజన్ ను రూపొందించే పనిలో నారా చంద్రబాబునాయుడు నిమగ్నమై ఉన్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వెనిగండ్ల రాము తెలిపారు. కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్డులో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గుడివాడలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఏ వార్డులో పర్యటించిన వేలాదిగా ప్రజలు తరలివస్తున్నారని తెలిపారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడమే లక్ష్యంగా ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర సంపద దోపిడీకి గురైందని, రాష్ట్రాన్ని కాపాడేందుకు చంద్రబాబు పోరాటం చేస్తున్నారన్నారు. ముఖ్యంగా ఆర్ధిక అసమానతలను తగ్గించే విధానానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని చెప్పారు. ప్రతి ఇంటికీ ఒక విజన్ ను రూపొందించడం ద్వారా పేదప్రజల జీవితాల్లో సమూల మార్పులను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీనికనుగుణంగా అవసరమైన ప్రణాళికలను చంద్రబాబు సిద్ధం చేస్తున్నారన్నారు. ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి, అసహనంతో ఉన్నారని గుర్తుచేశారు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం ద్వారా ఎన్టీఆర్, చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. గుడివాడ నియోజకవర్గంలో అభివృద్ధి కన్పించడం లేదన్నారు. టీడీపీ శ్రేణులతో కలిసి నియోజకవర్గంలో విస్తృతంగా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాగే సేవా కార్యక్రమాల ద్వారా కూడా అన్నివర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామన్నారు. 2024 ఎన్నికల్లో గుడివాడను గెల్చుకోవడమే తన లక్ష్యమన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్తా సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కోట శ్రీరంజని, వార్డు ప్రముఖులు కోట శ్రీనివాస్ (బొంబాయి శ్రీను), చిగురుపాటి విలియమ్స్, ఎస్ రాజశేఖర్, గూడపాటి రాజశేఖర్, వీరిశెట్టి రవితేజ, ప్రగడ మాణిక్యం, వంగలపూడి శ్రీను, ఏ రమణ, వంగలపూడి చిన అప్పారావు, జక్కుల సంతోష్, చాపరాల శివప్రసాద్, వీ శ్రీనివాస్, ఎస్ శ్రీనివాస్, టీడీపీ ప్రముఖులు తులసి, గుత్తా చంటి, అడుసుమిల్లి లక్ష్మణరావు, అట్లూరి వేణుగోపాల్, అమర్ బాబు, సోని, నందకిషోర్, గడ్డం ప్రకాష్ దాస్, మేరుగు మోజెస్, మిక్కిలినేని రమేష్, సూరపనేని రాజా తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment