జీవో- 1 ను హైకోర్టు రద్దు చేయడం జగన్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది.

 *- జీవో- 1 ను హైకోర్టు రద్దు చేయడం జగన్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది


*

 *- కావాలనే దేశంలో ఎక్కడా లేని జీవో-1 తీసుకొచ్చారు*

 *- టిడిపి అధినేత చంద్రబాబుపైనే ప్రయోగించారు*

 *- టిడిపి కార్యకర్తలపైనా కేసులు పెట్టారు*

 *- చంద్రబాబు పర్యటనలో చైతన్య రథాన్ని కూడా లాక్కెళ్లారు*

 *- టిడిపికి పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఈ నిర్ణయాలు*

 *- ప్రాథమిక హక్కులను కాలరాయడం మానుకోవాలి*

 *- రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన టిడిపి నేత వెనిగండ్ల రాము*గుడివాడ, మే 12 (ప్రజా అమరావతి): రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా తెచ్చిన జీవో నెంబర్- 1ను ఏపీ హైకోర్టు రద్దు చేయడం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని తెలుగుదేశం పార్టీ నేత వెనిగండ్ల రాము అన్నారు. శుక్రవారం కృష్ణాజిల్లా గుడివాడలో ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వం కావాలనే దేశంలో ఎక్కడా లేనివిధంగా జీవో-1 ను తీసుకురావడం జరిగిందన్నారు.

బ్రిటిష్ కాలం నాటి జీవోలతో ప్రతిపక్షాలను అడ్డుకునే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారన్నారు. దీన్ని టిడిపి అధినేత చంద్రబాబుపైనే ప్రయోగించారన్నారు. జగన్ ప్రభుత్వ అరాచకాలు పరాకాష్టకు చేరుకున్నాయని జీవో-1 పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ప్రతిపక్షాలపై కక్ష సాధించడం కోసం తీసుకొచ్చిన ఈ జీఓను అడ్డుపెట్టుకుని టిడిపి కార్యకర్తలపైనా కేసులు పెట్టారన్నారు. చంద్రబాబు పర్యటనలో చైతన్య రథాన్ని కూడా పోలీసులు లాక్కెళ్లారని తెలిపారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో అభద్రతాభావం పెరిగిపోయిందని, టిడిపికి పెరుగుతున్న మద్దతును చూసి ఓర్వలేక జగన్ రెడ్డి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. జీవో -1ను తీసుకురావడం భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను రాయడమేనని అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను నిషేధించే అధికారం ఏ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఇచ్చిన జీవో- ను హైకోర్టు రద్దు చేయడం ద్వారా రాష్ట్రంలో ప్రతిపక్షాలను ఆనగదొక్కేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్ర బట్టబయలైందన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుందన్నారు. ఇకనైనా జీవోల పేరుతో ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాసే చర్యలను మానుకోవాలని, ప్రజా వ్యతిరేక విధానాలకు స్వస్తి చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనిగండ్ల హెచ్చరించారు.

Comments