అర్హతే ప్రామాణికంగా నవరత్నాలురాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): అర్హతే ప్రామాణికంగా నవరత్నాలు


పేదలందరికీ ఇళ్ల పథకం కింద తిగిరిపల్లి దివ్య తల్లి తిగిరిపల్లి సంధ్యకు తాళ్ళపూడి మండలం పెదేవం గ్రామంలో సెంటున్నర ఇంటి స్థలం ఇవ్వడం జరిగిందని జిల్లా ఇంచార్జి మంత్రి సిహెచ్. ఎస్. వేణుగోపాల్ కృష్ణ, హోం మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.


సోమవారం మధ్యాహ్నం కలెక్టర్ సమక్షంలో మంత్రుల చేతుల మీదుగా టి. సంధ్య కు ఇంటి పట్టా అందచేశారు. ఈ సందర్భంగా మంత్రి సి హెచ్.శ్రీనివాస వేణుగోపాల్ కృష్ణ మాట్లాడుతూ, నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు 90 రోజుల కార్యక్రమం లో భాగంగా ఇంటి స్థలం కోసం ధరఖాస్తు వారికి ఆమేరకు ఉచితంగా ఇళ్ళ పట్టాలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి కొవ్వూరు పర్యటన లో తన ప్రసంగంతో ఆకట్టుకున్న కుమారి దివ్య తన తల్లి పేరున ఇంటి స్థలం లేదని, తన తల్లి చెవిటి మూగతనం కలిగినట్లు పేర్కొనడం జరిగిందన్నారు. ఆమేరకు సిఎం ఇచ్చిన హామీ మేరకు దివ్య తల్లి సంధ్య కి పెదేవం గ్రామంలో సెంటున్నర ఇంటి స్థలం ఇచ్చినట్లు తెలిపారు.


హోం శాఖ తానేటి వనిత కుమారి టి. దివ్య ను అభినందిస్తూ, రాష్ట్రంలో అర్హులకు అన్ని సంక్షేమ పథకాలను చేర్చాలన్నది జగనన్న ఉద్దేశ్యం అన్నారు. అర్హత ఉంటే తప్పనిసరిగా ఇంటి స్థలం ఇవ్వాలని సిఎం ఆదేశించడం జరిగిందన్నారు. ఆమేరకు అర్హత ను పరిగణన లోకి తీసుకుని ఐదు రోజుల్లో ఇంటి పట్టా ఇవ్వడం జరిగిందన్నారు.


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెద్దేవం గ్రామంలో ని వైయస్ఆర్ జగనన్న కాలనీలో సర్వే నంబర్ 392 / 8 బి 1 నందు ప్లాట్ నంబర్ 20 ను కేటాయించినట్లు తెలిపారు. సంబంధిత నివేసిత ఇంటి పట్టా పత్రాలను అందజేశారు. సహాయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Comments