ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్


ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్


నెల్లూరు, మే 11 (ప్రజా అమరావతి): 

రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి  నేడు కావలిలో పర్యటించనున్న  నేపథ్యంలో  గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ శ్రీ యం. హరి నారాయణన్,  కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీ తలసీల రఘురాంతో కలిసి బహిరంగ సభ ప్రదేశాన్ని సందర్శించి  ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. సీటింగ్ ఏర్పాట్లు, విఐపి గ్యాలరీలు, పార్కింగ్, భద్రతాపరమైన ఏర్పాట్లను పరిశీలించారు. 


జిల్లా కలెక్టర్ వెంట అడిషనల్ ఎస్పి  హిమవతి, నుడా వైస్ ఛైర్మన్  టి. బాపిరెడ్డి,  కావలి ఆర్డీవో శీనా నాయక్, ఆర్ అండ్ బి ఎస్ఈ శ్రీ గంగాధర్, డిపిఓ సుస్మిత తదితర అధికారులు పాల్గొన్నారు.


Comments