మండల ప్రత్యేక అధికార్ల ఆధ్వర్యంలో ఒకే చోట స్పందన - కలెక్టర్ కె. మాధవీలతరాజమహేంద్రవరం (ప్రజా అమరావతి): సోమవారం స్పందనకు వొచ్చిన 109 అర్జీలు


మండల ప్రత్యేక అధికార్ల ఆధ్వర్యంలో ఒకే చోట స్పందన


- కలెక్టర్ కె. మాధవీలత మండల అధికారులందరూ మండల కేంద్రంలో విధిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత స్పష్టం చేశారు.


సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లో స్పందన అర్జీలను స్వీకరించే క్రమంలో డివిజన్, మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారుల హాజరును జాయింట్ కలెక్టర్, కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీల స్వీకరించి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవడం జరగాలని స్పష్టం చేశారని అన్నారు. ఆ దిశలో జిల్లాలో ప్రతి డివిజన్, మండల పరిధిలోని అధికారులు, ఆయా మండలాల ప్రత్యేక అధికారులు ద్వారా నేరుగా ప్రజల నుంచి ఒకే చోట ఉండి అర్జిలను స్వీకరించాల్సి ఉంటుందన్నారు. ఆమేరకు ప్రత్యేక అధికారులు ముందస్తుగా మండల అధికారులకి సూచనలు జారీ చేసి, ప్రజలకు తగిన సమాచారం ముందస్తుగా చేరవేసి, అధికారులు ప్రజా సమస్యల పరిష్కారం చేయనున్నట్లు తెలియ పరచడం ముఖ్యం అన్నారు. మండల ప్రత్యేక అధికారులు మండలాల్లో హాజరై, తదుపరి జిల్లా స్థాయి అధికారి కలెక్టరేట్ కు హాజరు కావాలని మాధవీలత తెలిపారు. తహశీల్దార్, మండల అభివృద్ధి అధికారి సమన్వయంతో పనిచేయాలని, స్పందనకు హాజరు కానీ అధికారుల ద్వారా వివరణ తీసుకోవాలని ముందస్తుగా పత్రికల ద్వారా ప్రజలకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈరోజు స్పందన లో రెవెన్యూ , భూ అక్రమణ సమస్య, దివ్యంగుల ద్రువపత్రము, పెన్షన్, సివిల్ తగాదాలు, కొంతమూరు ప్రాంతంలో చెరువు త్రవ్వకం, తదితర మొత్తం 109 అర్జీలు  రాగా వాటిలో 86 ఆన్లైన్,   23 ఇతర ఆఫ్ లైన్ ఫిర్యాదులు నమోదు చెయ్యడం జరిగింది.


కలెక్టర్, జేసీ లు స్పందన అర్జీల ఆన్లైన్ నమోదు పరిశీలన:


కలెక్టరేట్ లో నమోదు చేస్తున్న ఆన్లైన్ ప్రక్రియను కలెక్టర్ మాధవీలత, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ లు వ్యక్తిగతంగా పరిశీలించారు. ప్రతీ ఒక్క ధరకాస్తు ఆన్లైన్ లో నమోదు చేసి, వాటి వివరాలు సంభందిత సచివాలయ కార్యదర్శి కి పంపాలని సూచించారు. ఈ విధానంలో చేస్తున్న ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇందుకోసం ఒక ఉద్యోగికి బాధ్యత పెట్టాలని, సంబంధిత సిబ్బంది క్షేత్ర స్థాయి అధికారులు తో సమన్వయం చేసుకోవడం ముఖ్యం అని ఆదేశించారు.
ఈ  జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్,జిల్లా రెవెన్యూ అధికారి జీ.నరసింహులు, టూరిజం ఆర్ డి వి..స్వామీ నాయుడు  తో పాటు స్పందన కార్యక్రమంలో జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారుల ప్రతినిధులు, తదితరులు హాజరయ్యారు.Comments