రెవెన్యూ సమస్యలపై వచ్చే ధరఖాస్తులను సత్వరం పరిశీలించి నిర్ధేశించిన గడువులోగా పరిష్కరించాలి.


నెల్లూరు (ప్రజా అమరావతి);



వివిధ రెవెన్యూ  సమస్యలపై వచ్చే ధరఖాస్తులను సత్వరం పరిశీలించి నిర్ధేశించిన గడువులోగా పరిష్కరించాల



ని జిల్లా కలెక్టర్ శ్రీ  యం. హరి నారాయణన్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. 


మంగళవారం సాయంత్రం  కలెక్టరేట్ లోని తన ఛాంబర్ నుండి జిల్లా కలెక్టర్ శ్రీ హరి నారాయణన్  వీడియో కన్ఫెరెన్స్ ద్వారా  రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసిల్ధార్లతో సమావేశమై జిల్లా లో జరుగుచున్న రీసర్వే అమలు తీరు, పురోగతి, మ్యుటేషన్,  స్పందన, ఏపీ సేవా డ్యాష్ బోర్డు ద్వారా వచ్చే అర్జీల పరిష్కార పురోగతి,  హౌసింగ్ ఈ.కె.వై.సి, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్స్ జారీ,  భూ మార్పిడి, ఇరిగేషన్ ప్రొజెక్ట్స్ కు సంబంధించి   రెవెన్యూ పరంగా జారీ చేయాల్సిన సర్టిఫికెట్స్ జారీ తదితర అంశాలపై సమీక్షించి పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు.  ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వివిధ రెవెన్యూ  సమస్యలపై వచ్చే ధరఖాస్తులను పరిశీలించి నిర్ధేశించిన గడువులోగా పరిష్కరించి ప్రజలకు సత్వరం న్యాయం జరిగేలా రెవెన్యూ అధికారులు శ్రద్ద వహించాలన్నారు. జిల్లాలో చేపడుతున్న రీ సర్వే పనులను పకడ్బందీగా, శాస్త్రీయంగా, ప్రణాళికాబద్ధంగా, పారదర్శకంగా, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రీ సర్వే పనులకు సంబంధించి స్టోన్స్  నాటే ప్రక్రియను నిర్ధేశించిన గడువులోగా పూర్తిచేయాలన్నారు. ప్రధానంగా రీసర్వేపై ఆర్డీవోలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని  తెలిపారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చేపడుతున్న రీసర్వేలు ఎంతో ఉపయోగకరం అన్నారు. భూముల సర్వే కోసం స్పందనలో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని.. అందులో ఎలాంటి తాత్సారం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భూమి మీద ఉన్న వాస్తవాలకు అద్దం పట్టేలా  భూ రికార్డులను తీర్చిదిద్దాలన్నారు. స్పందనలో రెవెన్యూ శాఖకు సంబంధించి  వచ్చే  అర్జీలపై రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి   సత్వరం నిర్ధిష్ట గడువులోగా  పరిష్కరించేలా  చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్  స్పష్టం చేశారు. రెవెన్యూ సేవలు  ప్రజలకు త్వరితగతిన అందేలా  కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. 


ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ లోని ఎస్ఆర్. శంకరన్ హాల్  నుండి  జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్. కూర్మనాథ్, కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీమతి శోభిక,  జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి వెంకట నారాయణమ్మ, కావాలి, ఆత్మకూరు ఆర్.డి.ఓ లు  శ్రీ శీనా నాయక్, శ్రీమతి కరుణా కుమారి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఎడి శ్రీ హనుమాన్ ప్రసాద్, మండలాల నుండి తహసిల్ధార్లు పాల్గొన్నారు.  


Comments