ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ శ్రీ జస్టిస్ ఆకుల వెంకట శేష సాయికుటుంబసభ్యులతో కలిసి అమ్మవారి నీ దర్శించుకున్నారు.


శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి (ప్రజా అమరావతి):

      శ్రీ అమ్మవారి ఆలయమునకు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ శ్రీ జస్టిస్ ఆకుల వెంకట శేష సాయి  కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారి


దర్శనార్థం విచ్చేయగా ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు  మరియు ఆలయ కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ  ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు. వీరితో పాటుగా  హైకోర్టు న్యాయమూర్తి శ్రీమతి జస్టిస్ వి. సుజాత  ఆలయమునకు విచ్చేశారు.

అనంతరం వీరికి ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ , ఆలయ కార్యనిర్వాహణాధికారి  శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము, చిత్రపటం అందజేసినారు. ఈ కార్యక్రమంలో హై కోర్ట్ రిజిస్ట్రార్ జనరల్ లక్ష్మణ రావు , రిజిస్ట్రార్ రామకృష్ణ , ట్రస్ట్ బోర్డు చైర్మన్ తో పాటుగా ట్రస్ట్ బోర్డు సభ్యులు కట్టా సత్తయ్య, బచ్చు మాధవీ కృష్ణ, అనుమోలు ఉదయలక్ష్మి  ఉన్నారు.

Comments