మంగళగిరి (ప్రజా అమరావతి)!
" బాల్య వివాహాలు రహిత రాష్ట్రాన్ని నిర్మిద్దాం"
బాలల హక్కుల పరిరక్షణలో చైల్డ్ లైన్ 1098 సేవలు బేష్. "
రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్ పర్సన్ కేసలి. అప్పారావు . .
ఆపదలో ఉన్న బాలల రక్షణ కొరకు దేశవ్యాప్తంగా పనిచేస్తున్న చైల్డ్ లైన్-1098 సేవలు బేష్ అని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్పర్సన్ మరియు సభ్యులు అన్నారు. మంగళగిరి రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ లో వివిధ జిల్లాలలో పనిచేస్తున్న చైల్డ్ లైన్ కోఆర్డినేటర్లు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా చైర్పర్సన్ మరియు సభ్యులును గౌరవంగా కలవడం జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణ కొరకు కమిషన్ తరపున అందిస్తున్న సేవలకు చైల్డ్ లైన్ కోఆర్డినేటర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చైల్డ్ లైన్ వారిచే రూపొందించబడిన బాలల భద్రత - అందరి బాధ్యత అనే గోడ పత్రిక ను ఆవిష్కరించటం జరిగింది. ఈ సందర్భంగా బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు చైర్ పర్సన్ కేసలి అప్పారావు మాట్లాడుతూ బాల్య వివాహాలు సమాజానికి చేటు అని బాలికల ఎదుగుదలకు అభివృద్ధికి ఆటంకమని బాల్య వివాహాలు లేని సమాజ నిర్మాణానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని తెలిపారు. బాల్య వివాహాలు చేస్తే పోలీస్ కేసులు నమోదు చేయాలని తెలిపారు. సచివాలయం సిబ్బంది బాగా సహకరిస్తున్నారని తెలిపారు. అలాగే చైల్డ్ లైన్ 1098 ద్వారా బాల్య వివాహాల నిలుపుదల లో బాలలు తో పనిచేస్తున్న వివిధ సంస్థలు,సంఘాలు అందరూ ప్రభుత్వ శాఖల సమన్వయంతో చక్కని కృషి జరుగుతుందని అభినందించారు .ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు రాజేంద్రప్రసాద్ , శ్రీమతి పద్మావతి సెక్రెటరీ శ్రీనివాస్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment