చదివే వయస్సులో వున్న పిల్లలను బడికి పంపే కార్యక్రమాన్ని సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరూ చేపట్టాలి.


నెల్లూరు (ప్రజా అమరావతి);


చదివే వయస్సులో వున్న పిల్లలను బడికి పంపే  కార్యక్రమాన్ని సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరూ చేపట్టాల


ని జిల్లా కలెక్టర్  యం. హరి నారాయణన్  పేర్కొన్నారు. 


సోమవారం ఉదయం ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా  కార్మిక శాఖ , స్త్రీ  శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ర్యాలీని  కలెక్టరేట్ నుండి  జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్  జెండా ఊపి  ప్రారంభించారు.  


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,  సామాజిక బాధ్యతతో  చదివే వయస్సులో వున్న పిల్లలను బడికి పంపే కార్యక్రమాన్ని  చేపట్టాలన్నారు.   విద్య ద్వారానే సాధికారత సాధ్యమౌతుందన్న విషయాన్ని  గుర్తించి  బడి ఈడు పిల్లలందరిని  పని కోసం ఉపయోగించకుండా  చదివించాలన్న లక్ష్యంతో  ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో  ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని  నిర్వహించుకుంటున్నట్లు  కలెక్టర్  తెలిపారు. అందులో భాగంగా  ఈ రోజు  కలెక్టరేట్ నుండి గాంధీ బొమ్మ  వరకు  ర్యాలీని నిర్వహించుకోవడం జరుగుచున్నదన్నారు.  జిల్లాలో వున్న ప్రతి పౌరుడు బడి ఈడు   పిల్లలను పని కోసం ఉపయోగించకుండా  బడికి పంపే కార్యక్రమాన్ని చేపట్టాలని కలెక్టర్ పిలుపు నిచ్చారు. బడి ఈడు   పిల్లలను పని కోసం ఉపయోగిస్తే  చట్ట పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. 


కార్మిక శాఖ  డిప్యూటీ కమీషనర్ శ్రీ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ,  కార్మిక శాఖ , స్త్రీ  శిశు సంక్షేమ శాఖ,  చైల్డ్ వెల్ఫేర్ సొసైటీ, వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో  ఈ నెల 1వ తేదీ నుండి ఈ నెలాఖరు వరకు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై  అవగాహన  కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 1వ తేదీ నుండి బడి ఈడు పిల్లలను పనిలో ఉపయోగిస్తున్న  10 మంది పై కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.


ఈ సందర్భంగా  చైల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో  బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై ప్రచురించిన వాల్ పోస్టర్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.


పిల్లలు పనిలో కాకుండా బడిలో వుండాలి, పిల్లలు బడికి - పెద్దలు పనికి,  పిల్లలు చదువుకోవడానికి, ఆడుకోవడానికి ఒక్క అవకాశం కల్పించండి, పిల్లల చదువే - ప్రగతికి ముద్దు, పిల్లల హక్కులను కాపాడండి - వారి భవిష్యత్తు కు బంగారు బాట వెయ్యండి వంటి నినాదాలు చేస్తూ ఈ ర్యాలీ  కలెక్టర్ కార్యాలయం నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకు  నిర్వహించగా,  ఈ ర్యాలీ లో కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ ఎం. వెంకటేశ్వర రావు, అసిస్టెంట్ కమీషనర్ గౌస్ బాషా,   ఐసీడీఎస్ పిడి సౌజన్య, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ సురేష్,  చైల్డ్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు, చైతన్య జ్యోతి వెల్ఫేర్ సొసైటీ సభ్యులు,  కార్మిక శాఖ, ఐసీడీఎస్ సిబ్బంది,  విద్యార్థినీ విద్యార్థులు   పాల్గొన్నారు.

Comments