ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి.*ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి.*ఎంఎస్‌ఎంఈల క్లైములను త్వరగా పరిష్కరించాలి.


* జిల్లాలో  9 క్లెయిములకు రూ.58,69,702 /- 

ప్రోత్సాహం..


-ఇండస్ట్రియల్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశంలో పేర్కొన్న జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున.


విశాఖపట్నం, జూన్ 23 (ప్రజా అమరావతి): జిల్లాలో ఎంఎస్‌ఎంఈల క్లైములను త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ డా.ఎ.మల్లిఖార్జున సూచించారు. శుక్రవారం ఉదయం ఇండస్ట్రియల్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ (డీఐఈపీసీ) సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించబడినది. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎంఎస్‌ఎంఈల క్లైములను పెండింగ్ లేకుండా త్వరగా పరిష్కారం చూపేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని, జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే దిశగా ఔత్సాహిక పారిశ్రామివేత్తలకు ప్రోత్సాహం అందివ్వాలన్నారు. 


జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సింగిల్‌ విండో పోర్టల్‌కు 70 దరఖాస్తులు రాగా 33 దరఖాస్తులను 

ఆమోదించామన్నారు. ఇండస్ట్రియల్ డెవలెప్మెంట్ పాలసీ 2015-20 మరియు 2020-23 క్రింద 9 క్లెయిములకు గాను  రూ.58,69,702/-  ప్రోత్సాహం మంజూరు చేయడమైన దన్నారు. నిర్ణీత సమయంలో పరిశ్రమలు స్ధాపించలేని ఎస్సి, ఎస్టి యూనిట్ల వారికి జి.ఓ ఎమ్ఎస్ 7 ప్రకారం భూమి కేటాయింపు చర్యలను వేగవంతం చేయాలని పరిశ్రమలు జోనల్ మేనేజర్ కు తెలిపారు.

ఆటోనగర్ లో 55 పరిశ్రమలకు మంచినీటి సరఫరా జరిగినదని, మిగిలిన 70 మందికి కూడా త్వరగా అందించాలని జివిఎంసి అధికారులను ఆదేశించారు. 

అదేవిధంగా ఆటో నగర్ లో  ప్రతిరోజు గార్బేజ్ రవాణా కు సంబంధించి సమస్యను ఐలా సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, కలెక్టర్ గార్బేజ్ కలెక్షన్ పనులు అవసరమైన చార్జీలతో జీవీఎంసీ నిర్వహించాలని అన్నారు . ఆటోనగర్ లో ROB నిర్మాణానికి ఫైనాన్స్ డిపార్ట్మెంటు క్లియరెన్సు ఇవ్వటం జరిగిందని, రూ.27.10 కోట్లు మంజూరు జరిగినట్లు తెలిపారు. ఈ నెల చివరకు టెండర్ పనులు తుది దశకు చేరుకుంటాయని పేర్కొన్నారు . PMEGP పథకం క్రింద పరిశ్రమల స్ధాపనకు ముందుకు వచ్చేవారికి ఋణాలు అందించి  బ్యాంకర్లు చర్యలు చేపట్టాలని కోరారు. 


విశాఖపట్నం ఆటోనగర్ స్మాల్ స్కేల్ వెల్ఫేర్ అసోసియేషన్ కు నూతనంగా ఎన్నికైన సభ్యులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో  జిల్లా పరిశ్రమల శాఖ అధికారి సి.హెచ్.గణపతి, ఏపీఐఐసీ డిప్యూటి జెడ్ఎం త్రినాధ్ ఐలా  కమీషనర్ సూర్యనారాయణ,, వాస్వా  ( VASWA ) ప్రెసిడెంట్ పాండు రంగ ప్రసాద్ , వైస్ ప్రెసిడెంట్ వి.శ్రీనివాసరావు , సెక్రటరీ పి వి రామ ప్రసాద్ , ఏపీ ట్రాన్స్కో, జీవీఎంసీ, వ్యవసాయ, మత్స్య శాఖ, అగ్ని మాపక, టౌన్ ప్లానింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు , పరిశ్రమల అసోసియేషన్  సభ్యులు,  తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. Comments