2024లో వచ్చేది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వమే.

 *- 2024లో వచ్చేది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వమే


 *- ఎన్నారైలు ఎంతో చైతన్యవంతంగా ఉన్నారు* 

 *- ఏపీ రాజకీయాల్లోనూ చురుకైన పాత్ర పోషిస్తున్నారు* 

 *- గివింగ్ బ్యాక్ ది సొసైటీపై పొలిటికల్ డిస్కషన్ జరిగింది*

 *- చంద్రబాబు దృష్టికి కూడా తీసుకువెళ్ళి చర్చిస్తాం* 

 *- ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కోరతాం* 

 *- ఈ విధమైన మెకానిజాన్ని డెవలప్ చేస్తే ఏపీకి ఉపయోగం*

 *- స్పష్టం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్నారై వెనిగండ్ల* 

*- తానా వేదికలపై ఘన సత్కారాన్ని అందుకున్న వెనిగండ్ల* 



ఫిలడెల్ఫియా (అమెరికా), జూలై 10 (ప్రజా అమరావతి): 2024లో వచ్చేది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వమేనని కృష్ణాజిల్లా గుడివాడ తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్నారై వెనిగండ్ల రాము చెప్పారు. అమెరికాలో జరిగిన 23వ తానా మహాసభలు - 2023లో పాల్గొన్న ఆయన తానా వేదికలపై, ప్రముఖ మీడియా ఛానల్స్లోనూ పలు అంశాలపై మాట్లాడారు. తానా వేదికలపై ఘన సన్మానాన్ని అందుకున్నారు. అనంతరం వెనిగండ్ల మాట్లాడుతూ గివింగ్ బ్యాక్ ది సొసైటీ, దీనిపై ప్రభుత్వం ఎటువంటి రూల్స్ ను రూపొందించాలి అనే అంశంపై పొలిటికల్ డిస్కషన్ జరిగిందని తెలిపారు. ఎన్నారైలు ఎంతో చైతన్యవంతంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా ఏపీ రాజకీయాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ చురుకైన పాత్ర పోషిస్తున్నారని గుర్తుచేశారు. ఎన్నారైలంతా తమ స్వగ్రామాలను బాగు చేసుకుందామనే ఉద్ధేశ్యంతో ఉన్నారన్నారు. ఇంటిపేరు మాదిరిగా ఊరిపేరు కూడా ఎంతో అవసరమని, అటువంటి మన ఊరి పేరును గర్వంగా చెప్పుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉందని తెలిపారు. గివింగ్ బ్యాక్ ది సొసైటీ అనే అంశంపై ఎన్నారైలంతా చక్కగా స్పందించి తమ అభిప్రాయాలను కూలంకుషంగా తెలియజేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ తమ స్వగ్రామాలకు చేయగల్గినంత చేద్దామని పిలుపునిచ్చామన్నారు. స్కూల్స్, రోడ్లు వంటివి నిర్మించగల్గిన వారు వాటిపై దృష్టి పెట్టాలని, పది మందిని చదివించగల్గిన వారు చదివించాలని, ఇంటి పరిసర ప్రాంతాలను బాగు చేసుకోవడం వంటి వాటిపైనా దృష్టి పెట్టాలని ఎన్నారైలు నిర్ణయించారన్నారు. ప్రభుత్వం కూడా కొన్ని పాలసీలను తీసుకువస్తే ప్రయోజనం ఉంటుందని ఎన్నారైలు భావించారన్నారు. "గో ఫండ్ మీ" కాన్సెప్ట్ ద్వారా ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎన్నారైలు చాలా యాక్టివ్ గా పనిచేస్తూ ఫండ్ రైజ్ చేస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి చేయాలనే ఉద్ధేశ్యం ఎన్నారైల్లో ఉన్నట్టుగా కన్పిస్తుందన్నారు. ఈ విధంగా ఒక మెకానిజాన్ని డెవలప్ చేస్తే ఆంధ్రప్రదేశ్ కు ఎంతగానో ఉపయోగం ఉంటుందన్నారు. దీన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు దృష్టికి కూడా తీసుకువెళ్ళి చర్చించడం జరుగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని కోరతామని వెనిగండ్ల తెలిపారు.

Comments