ముఖ్యమంత్రి శ్రమిస్తున్న తీరును డైరీ రూపంలో తెలియజేసే ప్రక్రియ ఒక మంచి పరిణామం.



దిల్లీ

6 జూలై, (ప్రజా అమరావతి);


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ది కోసం, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి శ్రమిస్తున్న తీరును డైరీ రూపంలో తెలియజేసే ప్రక్రియ ఒక మంచి పరిణామం


అని మాజీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు, ఏపి భవన్ రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్ అన్నారు.


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జాతీయ మీడియా, అంతరాష్ట్ర వ్యవహారాల  సలహాదారు కార్యాలయం  ప్రచురించిన "ప్రతిదినం ప్రజాహితం" వికాస వార్షిక - 4 వ సంవత్సరం ముఖ్యమంత్రి రోజువారి కార్యక్రమలను తెలియజేసే దినచర్య డైరీ ని నేడు దిల్లీ ఆంధ్ర ప్రదేశ్ భవన్ లోని తన కార్యాలయంలో ఆదిత్యనాథ్ దాస్ విడుదల చేశారు.


ఈ సందర్భంగా ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి రోజువారీ అధికారిక కార్యక్రమాలను సేకరించి ఒక క్రమ పద్ధతిలో, సంకలనం చేసిన విధానం,  జాతీయ మీడియా సలహాదారు కార్యాలయం దానిని డైరీ రూపంలో ప్రచురించడం అభినందనీయం అని ఆదిత్యనాథ్ దాస్ అన్నారు. 


తన కార్యాలయ రోజువారీ కార్యక్రమాలతో పాటు ముఖ్యమంత్రి దినచర్యను కూడా అనుసరిస్తూ ఒక బాధ్యతగా తీసుకుని, గత నాలుగు సంవత్సరాలుగా ఈ డైరీ ని  రూపొందించడం జరుగుతున్నది అని జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ తెలిపారు.  ఈ సందర్భంగా ఈ డైరీ ముద్రణకు సహకరించిన సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. పుస్తక రచయిత  పాలెపు రాజశేఖర్ ను సలహాదారులు అభినందించారు.


కార్యక్రమంలో జాతీయ మీడియా సలహాదారు కార్యాలయ మీడియా కో ఆర్డినేటర్ బి. ఎస్. రామకృష్ణ, ఎపిఆర్వో కే. గురవయ్య పాల్గొన్నారు.


Comments