మచిలీపట్నం: జులై 12 (ప్రజా అమరావతి);
పాడి రైతుల అభ్యున్నతి కోసం జగనన్న పాల వెల్లువ !!
---- జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు.
సహకార డైరీ రంగాన్ని బలోపేతం చేసేందుకు తద్వారా మహిళల ఆర్థిక పరిపుష్టికి కృషి చేసేందుకు జగనన్న పాల వెల్లువ ఎంతో దోహదపడుతుందని కృష్ణా జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అన్నారు.
బుధవారం మధ్యాహ్నం మచిలీపట్నం కలెక్టరేట్‌లోని స్పందన సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ జగనన్న పాలవెల్లువపై జిల్లా పశుసంవర్థక సంయుక్త సంచాలకులు ఎం.దినకర్ శామ్యూల్, డి ఆర్ డి ఏ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రసాద్, జిల్లా సహకార బ్యాంక్ అధికారి ఫణి కుమార్ తదితర శాఖల అధికారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు మాట్లాడుతూ,పాల వెల్లువ కార్యక్రమంనకు ప్రారంభం నుండీ మంచి స్పందన వచ్చిందన్నారు. జగనన్న పాల వెల్లువ పధకం ద్వారా కలిగే ప్రయోజనాలను మహిళా పాడి రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగేలా సమావేశాలు ఏర్పాటుచేసి వివరించాలన్నారు. కృష్ణా జిల్లాలో పాలు ఇచ్చే పశువుల సంఖ్య 2 లక్షల 70 వేల 565 ఉన్నాయన్నారు, అలాగే పాల సేకరణ కేంద్రాలు జిల్లాలో 422 ఉండగా అత్యధిక శాతం మంది పాడి రైతులు విజయ డైరీకు పాలు విక్రయిస్తున్నారన్నారు. అమూల్ పాల సేకరణ కేంద్రాల జిల్లాలో 580 ఏర్పాటు చేయాలని ఉద్దేశించగా, కేవలం బాపులపాడు మండలంలో 10 గ్రామాలలో అమూల్ పాల కేంద్రాలు ఉన్నట్లు తెలిపారు. కృష్ణాజిల్లాలో 8 మండలాల్లో 69 పాల సేకరణ కేంద్రాలు గుర్తించి, రోజుకు 6200 లీటర్ల పాలను సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. అమూల్‌కు మిగతా సంస్థలకు మధ్య తేడా ఏమిటీ అనేది అందరం గుర్తుపెట్టుకోవాలని, పాల నుంచి చాక్లెట్లు తయారుచేసే వ్యవస్థ అమూల్‌కు ఉందని పాల ప్రాసెసింగ్‌లో దేశంలోనే మొదటి స్థానం అమూల్ సంస్థదే అన్నారు ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉన్న సంస్థ అమూల్. దీనికి యజమానులు అంటూ ఎవరూ ఉండరని , పాలుపోసేవారే యజమానులని. అంతేకాకుండా మిగిలినవారితో పోల్చితే.. అమూల్ సంస్థ పాలకు ధర అధికంగా ఇస్తుందన్నారు. అమూల్ సంస్థలో వాటాదారులంతా అంతా పాడిరైతులే ఉంటారన్నారు లాభాపేక్ష అనేది అమూల్‌కు లేదని, సంస్థ గడించే లాభాలన్నీ సంవత్సరానికి ఒకసారి తిరిగి పాడి రైతులకు ఇచ్చే గొప్ప ప్రక్రియ అమూల్ సంస్థ లోనే ఉందన్నారు
అధిక ధరలు చెల్లించడంతో పాటు పాల బిల్లులను కూడా కేవలం 10 రోజుల్లోనే పాడి రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం వల్ల అందరికీ ఆర్థికంగా మరింత ప్రయోజనం ఉందన్నారు. సంవత్సరంలో కనీసం 182 రోజులు పాలుపోసిన మహిళా పాడిరైతులకు అమూల్ ద్వారా ఏడాది చివర్లో ప్రతి లీటర్‌పై 50 పైసలు బోనస్‌గా చెల్లిస్తున్నారని కలెక్టర్ వివరించారు. అంతేకాకుండా తమ పాడి రైతులకు నాణ్యమైన దాణాను కూడా తక్కువ ధరకే సరఫరా చేయడం గమనార్హం అన్నారు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ ఆసరా, చేయూత వంటి పథకాలను అందిపుచ్చుకుంటూ ఆదాయాన్ని పెంచుకునే మార్గల్లో భాగంగా మహిళలు పాడి పశువులను కొనుగోలు చేసుకోవాలని కలెక్టర్ అన్నారు.
అందుబాటులో ఉన్న జాతులు(బ్రీడ్స్) పర్యావరణ కారకాల కారణంగా ఆంధ్రప్రదేశ్ భారత దేశంలో అత్యుత్తమ నాణ్యమైన పాలను ఉత్పత్తి చేస్తోందన్నారు. కానీ ఈ నాణ్యమైన పాలకు మంచి ధర మాత్రం లభించడం లేదన్నారు. జగనన్న పాలవెల్లువ ప్రారంభానికి ముందు ఏజెంట్లు మధ్యవర్తులు, ప్రైవేటు వ్యక్తులు పాల రైతులను దోపిడీ చేసేవారన్నారు. ఎక్కడైతే సహకార రంగం బలంగా ఉంటుందో అక్కడ పాల ఉత్పత్తులకు అధిక ఆదాయం వస్తుందన్నారు. దీనికోసం ప్రభుత్వం సహకార డైరీ రంగాన్ని బలోపేతం చేసి తద్వారా మహిళా పాడి రైతులకు ఆర్థిక పరిపుష్టి కల్పించేందుకు జగనన్న పాలవెల్లువ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిందన్నారు. మహిళ పాడి రైతుల ప్రయోజనం కోసం చేపట్టిన సహకార డెయిరీ రంగం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. గ్రామాల్లో పాడి రైతులకు మేలు చేసే సహకార సంస్థ తిరిగి బలోపేతం చేసేందుకు జగనన్న పాలవెల్లువ ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ పథకంలో భాగంగా ఎలాంటి ష్యూరిటీలు లేకుండా మహిళ పాడి రైతులకు రూ.30 వేల వర్కింగ్ క్యాపిటల్ అందిస్తామన్నారు. ఎలాంటి ష్యూరిటీలు లేకుండా పాలు పోసే రైతులకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ద్వారా పాడి పశువులు కొనుగోలుకు రూ.1 లక్ష రూపాయలకు పైబడే బ్యాంకుల ద్వారా రుణాలు అందిస్తామన్నారు. పాడి రైతులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను అందుబాటులోకి తీసుకు వస్తున్నారన్నారు. జగనన్న పాల వెల్లువ కార్యక్రమానికి సంబంధించి జిల్లాస్థాయి పర్యవేక్షణ యంత్రాంగం బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్లు, మహిళా డైరీ అసోసియేషన్ సెంటర్లు మహిళా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ఏర్పాటు అంశాలను వివరించారు. శ్రీనిధి, చేయూత లబ్ధిదారులను పాడి పశువులను కొనేలా ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. జగనన్న పాలవెల్లువకు సంబంధించి ఎపిడిడిసిఎఫ్, పశుసంవర్థక శాఖ, సెర్ప్, పంచాయతీరాజ్, డిఆర్‌డిఎ, సహకార శాఖ, జిల్లా యంత్రాంగం, అమూల్ సాంకేతిక విభాగం సమన్వయంతో పని చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేలా చూడాలన్నారు.
addComments
Post a Comment