ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకారం అందించండి.*ఆంధ్రప్రదేశ్  అభివృద్ధికి సహకారం అందించండి**వియత్నాంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పర్యటన*


*దక్షిణ కొరియాలో ముగిసిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విజిట్*


అమరావతి, జూలై ,21 (ప్రజా అమరావతి): ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వియత్నాంలో పర్యటిస్తున్నారు.  శుక్రవారంతో దక్షిణ కొరియాలో మంత్రి బుగ్గన పర్యటన ముగిసింది.  హనోయిలో వియత్నం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైస్ ప్రెసిడెంట్ న్గుయెన్ క్వాంగ్ విన్ తో  ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్  సమావేశం నిర్వహించారు. వృత్తివిద్య, పెట్టుబడుల ప్రోత్సాహంపై క్వాంగ్ విన్ తో మంత్రి బుగ్గన చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ కు అవసరమైన సహకారం అందించాలని  ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ క్వాంగ్ విన్ ను కోరారు. ఈ కార్యక్రమంలో   నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ డాక్టర్ వినోద్ కుమార్ తదితరులు మంత్రితో పాటు పాల్గొన్నారు.

Comments