*తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి*
తిరుపతి, జులై 13 (ప్రజా అమరావతి): తిరుమల తిరుపతి రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం ఉదయం శ్రీవారి దర్శన అనంతరం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం ఆలయానికి కుటుంబ సమేతంగా చేరుకున్న కేంద్ర రోడ్ రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి గారికి, టి టి డి ఛైర్మెన్ వై వి సుబ్బారెడ్డి, టి టి డి జె ఈ ఓ వీరబ్రహ్మo, తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి, ఆలయ సూరింటెండెంట్ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.
కేంద్ర మంత్రి ముందుగా అమ్మవారి ఆలయ ధ్వజ స్తంభమునకు మొక్కిన అనంతరం శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం పలకగా టి టి డి ఛైర్మెన్ తీర్థ ప్రసాదాలు అందించారు.
addComments
Post a Comment