ఇరిగేషన్ రంగాన్ని హత్య చేసింది సిఎం.*సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా పాతపట్నం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పర్యటన*


*కొత్తూరులో నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో ప్రసంగం:-*

పాతపట్నం (ప్రజా అమరావతి)!

కొత్తూరు సభ నుంచి చెపుతున్నా...తెలుగు దేశం పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరు.

ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. జగన్ ఓటమి ఖాయం అయ్యింది

వంశధార పనులు తెలుగు దేశం హయాంలోనే జరిగాయి. నిర్వాసిత కుటుంబానికి 5 లక్షలు ఇచ్చిన ప్రభుత్వం మాది.

జగన్ 2013 చట్టం ప్రకారం ప్యాకేజ్ ఇస్తాను అన్నాడు...ఎకరాకు జగన్ 19 లక్షలు ఇస్తాను అన్నాడు...ఇచ్చాడా...ఆర్ అండ్ ఆర్ 12 లక్షలు ఇవ్వాలి ఇచ్చాడా?

ప్రాజెక్టుల వల్ల లాభం పొందిన వారు ఎంత ఆనందంగా ఉంటారో...భూములు ఇచ్చినవారు అంతే ఆనందంగా ఉండాలి అనేది నా ఆలోచన

అధికారంలోకి వచ్చిన తరువాత వంశధార ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకుంటాం

నాలుగున్నరేళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు...ఒక్క కాలువ పూర్తి చెయ్యలేదు.

నేను సవాల్ విసురుతున్నా....మా హయాంలో ఖర్చు...మీ హయాంలో ఖర్చు పై మీదగ్గర సమాధానం ఉందా?

తెలుగు దేశం ప్రభుత్వం వచ్చిన తరవాత వంశధార నాగావళి ప్రాజెక్టుల అనుసంధానం పూర్తి చేస్తా.

రాష్ట్రంలో ఒక్క వర్గమైనా ఆనందంగా ఉన్నారా...నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా....టీడీపీ హయాంలో కరెంట్ చార్జీలు పెరగలేదు. మళ్లీ టీడీపీ వచ్చిన తరువాత కరెంట్ చార్జీలు పెంచను....కరెంట్ చార్జీలు తగ్గించి భారం లేకుండా చేస్తా.

సోలార్, హైడల్, విండ్ విద్యుత్ ద్వారా రెండు రూపాయలకే యూనిట్ విద్యుత్ వస్తుంది. అప్పుడు ధరలు పెంచాల్సిన అవసరం ఉండదు.

జగన్ వచ్చిన తరువాత ఒక్క ఉద్యోగం వచ్చిందా....ఒక్క డిఎస్సి ఇచ్చాడా...ఒక్క పరిశ్రమ తెచ్చాడా

తెలుగు దేశం వస్తే...పెట్టుబడులు వస్తాయి...పరిశ్రమలు వస్తాయి. యువగళం కింద 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. నిరుద్యోగులకు రూ. 3 వేల యువగళం బృతి ఇస్తా.

రాష్ట్రంలో యవత నాకు మద్దతు ఇవ్వండి...మీ భవిష్యత్ నాకు వదిలేయండి.

నేను జగన్ ను సైకో అన్నాను. ఎందుకు అన్నానో తెలుసా....కారణం మీరు తెలుసుకోవాలి.

ఈ సైకో ముఖ్యమంత్రి బాబాయిని చంపి నారసుర రక్త చరిత్ర అన్నాడు. 

కోడికత్తి డ్రామాలు ఆడాడు.కత్తి గుచ్చిన కుర్రాడు 6 ఏళ్లుగా జైలులో ఉన్నాడు. అతన్ని కూడా చంపేసి..అదీ నేను చేశాను అంటాడు.

నేను చిత్తూరుజిల్లాలో పర్యటనకు వెళితే నాపై హత్యాయత్నం చేసి నా పైనే హత్యాయత్నం కేసు పెట్టారు. 

అంటే నేను కేసులకు భయపడి ఇంట్లో ఉండాలా....సమస్యే లేదు...నేను పోరాడుతా. ప్రజల చైతన్యంతో ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలి.

ఒక చెంపమీద కొడితే ఇంకో చెంప చూపించేందుకు నేను సిద్దంగా లేను.

పోలీసుల వైసీపీ నేతలు చేస్తున్న నేరాల్లో భాగస్వాములు కావొద్దు. 

నేను పోలీసులను గౌరవిస్తా.....నాడు ఈ పోలీసులు సమర్థవంతంగా పనిచేశారు. ఇప్పుడు ఆ పోలీసులే అక్రమ కేసులు పెడుతున్నారు. ప్రజలను వేధిస్తున్నారు.

నాడు ముద్దులు పెట్టిన జగన్....ముద్దులు పెట్టిన జగన్ ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు.

మన అచ్చెన్నాయుడును ఎంత దారుణంగా అరెస్టు చేశారో చూశారు కదా. ఇదీ జగన తీరు.

అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ రైతును ఆదుకుంటా....అన్నదాత పథకం కింద రైతుకు రూ. 20 వేల ఇచ్చే బాధ్యత నాది.

ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లి కి వందనం కింద రూ. 15 వేలు ఇస్తా.

ఆడబిడ్డ నిధ కింద ప్రతి మహిళకు రూ.1500 ఇస్తా. ధరలు పెరిగాయి....అందుకే ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తా. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తా.

ఆడబిడ్డలను అన్ని రకాలుగా పైకి తెచ్చే బాధ్యత నాది. వారికి చేయూతనిస్తా.

గిరిజనులకు నాడు 18 ప్రత్యేక పథకాలు తీసుకువచ్చాను. ఐదేళ్లలో 15 వేల కోట్లు గిరిజనుల కోసం ఖర్చు పెట్టాను.

ఏకలవ్య స్కూల్ తెచ్చాను, 95 కోట్లతో సెల్ టవర్లు ఏర్పాటు చేశాం, బెస్ట్ అవెయిలబుల్ స్కూళ్ల పథకం ఇచ్చాం, గోరుముద్దపథకం ఇచ్చా....నాడు ఉన్న పథకాలు అన్నీ ఇప్పుడు రద్దు అయ్యాయి. జగన్ ఒక్క పథకం కూడా గిరిజనుల కోసం అమలు చేయడం లేదు.

రాష్ట్రంలో జగన్ హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తున్నాడు...అలాంటి వారిని భూ స్థాపితం చేస్తా.

రాష్ట్రంలో ఇప్పుడు గంజాయి బ్యాచ్ వచ్చింది. జిల్లా అంతా గంజాయి దొరుకుతుంది. సిఎం ఎప్పుడైనా సమీక్ష చేశాడా.

ఇరిగేషన్ రంగాన్ని హత్య చేసింది సిఎం.


పోలవరం ప్రాజెక్టును చంపేసింది ఈ ముఖ్యమంత్రి

యువత భవిష్యత్ ను చంపేసింది ఈ ముఖ్యమంత్రి

వ్యవసాయాన్ని చంపేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి

రాష్ట్ర భవిష్యత్ ను హత్య చేసింది ఈ ముఖ్యమంత్రి

అలాంటి ముఖ్యమంత్రి నాపై హత్యాయత్నం కేసు పెడతావా?

ప్రజలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చిన సిఎం నాపై హత్యాయత్నం కేసు పెడతాడా?

సాగునీటి ప్రాజెక్టులపై మంచి సక్సెస్ అయ్యింది.

రాష్ట్రం బాగుపడాలి అంటే

సైకో పోవాలి...సైకిల్ రావాలి

Comments