అన్ని పాఠశాలల్లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ బృందాలను ఏర్పాటు చేయాలి.



*అన్ని పాఠశాలల్లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ బృందాలను  ఏర్పాటు చేయాలి


*

పాఠశాల విద్యాశాఖ కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్.

అమరావతి (ప్రజా అమరావతి);

రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ బృందాలను  ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ శ్రీ ఎస్.సురేష్ కుమార్  అన్నారు.  గురువారం సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో జరిగిన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 26 జిల్లాల కార్యవర్గాలని వెంటనే ఏర్పాటు చేసి సంస్థను బలోపేతం చేయాలని కోరారు. ఉన్నత విద్యలోనూ, ప్రొఫెషనల్ కోర్సుల్లోనూ, మెడికల్ కాలేజీల్లో రిజర్వేషన్ సదుపాయం కల్పిస్తూ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. 

భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ కార్యక్రమాలకు నిధులను అవసరమైన మేరకు మంజూరు చేస్తామన్నారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కో ఆర్డినేషన్ శ్రీమతి పి.పార్వతి  మాట్లాడుతూ కళాశాలల్లో కూడా భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణాధికారులు పాల్గొని జిల్లా పరిషత్ నిధులను సంస్థ అభివృద్ధికి  కేటాయిస్తామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా. బి.ప్రతాప్ రెడ్డి , అడల్ట్ రిసోర్సు కమీషనర్ శ్రీ నారా ప్రకాశ్ రావు , రాష్ట్ర కార్యదర్శి శ్రీ కె.వి.రమణ , రాష్ట్ర కోశాధికారి ఎన్.శ్రీనివాసరావు , రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 70 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. 


Comments