ప్రజాప్రతినిధుల ముసుగులో విచ్చలవిడిగా ఇసుకదోపిడీ జరుగుతోంది.కొత్తపేట నియోజకవర్గం  జోన్నాడ (ప్రజా అమరావతి);
కొత్తపేట వెళుతూ జొన్నాడ లో ఇసుక డంపింగ్ ప్రాంతాన్ని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  పరిశీలించారు. ఇసుక తవ్వకాలపై అక్రమాలను ప్రశ్నించారు. ఎటువంటి పత్రాలు లేకుండా ఇసుక తవ్వకాలు, అమ్మకాలు జరుగుతున్న విధానాన్ని, ఇసుక మాఫియా ఆగడాలపై  ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ ప్రాంతం లో వైసీపీ నేతల ఇసుక దోపిడీ పై ప్రజలు  చంద్రబాబు నాయుడుకు వివరించారు. ఇసుక తవ్వకాలు ఎవరు చేస్తున్నారు, ప్రభుత్వం కాంట్రాక్టర్లతో చేసుకున్న ఒప్పందాలు, తవ్వకాలు, అమ్మకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.

 మీడియా తో మాట్లాడుతూ

•“ రాష్ట్రవ్యాప్తంగా ఇసుకదోపిడీ ఏస్థాయిలో జరుగుతోందో చెప్పడానికి జొన్నాడ ఇసుక రీచే నిదర్శనం. రెడ్ హ్యాండెడ్ గా ఇసుక దొంగలు దొరికారు. ఇదంతా చూశాక ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. 

• ప్రజాప్రతినిధుల ముసుగులో విచ్చలవిడిగా ఇసుకదోపిడీ జరుగుతోంది.


కొండల్ని తలపించేలా ఇసుక గుట్టలు కనిపిస్తున్నాయి. తాడి నాగమోహ న్  రెడ్డి .. ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి బినామీ. రోజుకి 400 లారీలు ఈ రీచ్ నుంచి  బయటకు వెళ్తున్నాయి. ఏ లారీకీ ఎలాంటి అనుమతులు లేవు. ఒక్కో లారీ 25టన్నుల చొప్పున లెక్కేసినా, రోజుకి 10 వేల టన్నుల ఇసుక ఈ ఒక్క రీచ్ నుంచే తరలిపోతోంది. ఒక్కో టన్నుకి  ఇక్కడ రూ.625 లు వసూలు చేస్తున్నారు. 10 వేల టన్నులకు రూ.625 చొప్పున ఒక్క రోజుకి రూ.62,50,000లు వంతున సంవత్సరానికి రూ.228కోట్ల ఆదాయం ఈ  ఎమ్మెల్యేకి వస్తోంది. ఈ ఒక్క ఇసుక ర్యాంప్ నుంచే ఏడాది కి రూ.228కోట్లు వస్తే, ఈనియోజకవర్గంలో 4 ర్యాంపులు ఉన్నాయి. 

• ఇక్కడ 25టన్నులు ఇసుక నింపిన లారీలను వేరేప్రాంతాలకు తీసుకెళ్లి, అక్కడ ఇదే ఇసుకను డిమాండ్ ను బట్టి అధికధరకు అమ్ముతున్నారు. 

• పైకి జేపీ వెంచర్స్ సంస్థ ముసుగేశారు. ఇసుక దోపిడీ అంతా ఈప్రభుత్వమే  చేస్తోంది. సైకో ముఖ్యమంత్రి ఈ అడ్డగోలు దోపిడీపై ఏం సమాధానం చెబుతాడు? ప్రజల సంపదను, పేదవాళ్ల పొట్టగొట్టి తన ఎమ్మెల్యేలు, మంత్రులు దోచేస్తుంటే, ముఖ్యమంత్రికి సిగ్గూ..ఎగ్గూ లేదు. 

• గోదావరి నది నుంచి గతంలో పేదలు, మత్స్యకారులు మాత్రమే ఇసుక తవ్వేవారు. ఆ ఇసుకను సాధారణ ధరకు వాళ్లు అమ్ముకుంటూ జీవనో పాధి పొందేవారు. అలా బతికే వేలాది కుటుంబాల పొట్టగొట్టారు. 

• నూతన ఇసుక పాలసీ అని చెప్పిన ఈ ముఖ్యమంత్రి నిర్మాణరంగాన్నే నిర్వీర్యం చేశాడు. భవన నిర్మాణ కార్మికుల జీవితాలు రోడ్డున పడేశాడు. సిమెంట్, ఇనుము ధరలు పెంచేయడంతో పేదలు, మధ్యతరగతి వారు ఇళ్లు కట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది. 

• టీడీపీప్రభుత్వంలో ఇసుకను ఉచితంగా అందించాం. ఇసుక లభించే ప్రాంతాలకు దగ్గరుండే గ్రామాలప్రజలు తమకు కావాల్సినంత ఇసుక ఊరికే తీసుకెళ్లేలా చేశాం.  ఆ అవకాశం ఇప్పుడుందా అని ప్రశ్నిస్తున్నా. ఇసుక మాఫియా దెబ్బకు సాధారణ ప్రజలకు  ఇసుక దొరకని పరిస్థితి. ఇసుక రీచ్ లలోకి ఎవరినీ రానీయకుండా కాపలా పెట్టారు. ఎవరైనా వస్తే వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు. 

• ప్రజలు భయపడితే భయపెట్టి, దొరికింది దొరికినట్టు దోచేసుకోవాలను కుంటున్నారా? ప్రజల్ని నిలువునా దోచేస్తూ, రాక్షసుల కంటే దారుణంగా వారిని పీక్కుతింటున్నారు. ఒక్క ఇసుక ర్యాంప్ నుంచే రూ.228కోట్లు దోచేస్తున్నారంటే, రాష్ట్రంలో మొత్తం ఎన్ని ఇసుక రీచ్ లు ఉన్నాయి.. ఎంత దోచేస్తున్నారు? నెలకు రూ.20కోట్లు తాడేపల్లి కొంపకు కప్పం కట్టలేదని ఇటీవలే పశ్చిమగోదావరి జిల్లాలో ఒక ఎన్నారైని బలవంతం చేయడంతో అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

• జేపీ వెంచర్స్ సంస్థకు ఎలాంటి కాంట్రాక్ట్ లేదు. వారి పేరుతో వీళ్లే దోచుకుం టున్నారు. అధికారం ఉందని ఇష్టమొచ్చినట్టు చేస్తారా?

• రాష్ట్రంలోజరిగే ఇసుక దోపిడీపై సైకో ముఖ్యమంత్రి 24 గంటల్లో సమాధానం చెప్పాలి. తక్షణమే వాస్తవాలతో శ్వేతపత్రం విడుదలచేయాలి. జేపీ వెంచర్స్ సంస్థతో చేసుకున్న ఒప్పందం అమల్లో ఉంటే ఆ వివరాలు కూడా బయట పెట్టాలి. ముఖ్యమంత్రి, అతని అనుమాయులు బందిపోట్ల కంటే దారుణం గా తయారై, ఎక్కడికక్కడ ప్రకృతి వనరులు దోచుకుంటూ ప్రజల్ని పీక్కు తింటున్నారు. 

• తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని ఇసుక రీచ్ లనుంచి భారీస్థాయిలో ఇసుక తరలిపోతోంది. వేల లారీల్లో ఇసుక ఇతరప్రాంతాలకు తరలిస్తున్నా రు. ఇక్కడుండే వారికి మాత్రం ఇసుక దొరకడంలేదు.” అని చంద్రబాబు నాయుడు మండి పడ్డారు.

Comments