ఇన్ని పథకాలు, ఇన్ని డబ్బులు ఇస్తున్న జగనన్నను మరువ వద్దు.


కృత్తివెన్ను(పల్లెపాలెం): ఆగస్టు 1 (ప్రజా అమరావతి);


*ఇన్ని పథకాలు, ఇన్ని డబ్బులు ఇస్తున్న జగనన్నను మరువ వద్దు


*


*గడపగడపలో లబ్ధిదారులతో మంత్రి జోగి*


గతంలో ఇన్ని సంక్షేమ పథకాలు ఎవరు అమలు చేయలేదని, ఇన్ని డబ్బులు ఎవరు ఇవ్వలేదని, ఎంతో మంచి చేస్తున్న జగనన్నను మరువద్దని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ లబ్ధిదారులను కోరారు.


కృత్తివెన్ను మండలం పల్లిపాలెం గ్రామంలో మంగళవారం మంత్రి స్థానిక ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, సచివాలయ సిబ్బందితో కలిసి, గడపగడప కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లి, వారు వివిధ పథకాల కింద పొందిన లబ్ధి వివరిస్తూ జగనన్న సంక్షేమం బుక్లెట్ అందజేశారు.


ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులను వృద్ధులను పలకరించి వారి యోగక్షేమాలు అడిగి  పిల్లల చదువుల గురించి ఆరా తీశారు. ప్రతినెల పింఛన్లు అందుతున్నాయా అడిగి తెలుసుకున్నారు. మహిళలకు డ్వాక్రా డబ్బులు అందాయా చేయూత ఆసరా డబ్బులు వచ్చాయా ఆరా తీశారు.


80 ఏళ్ల పైబడి న తమ్ము గోగులమ్మ ను మంత్రి పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు గత మూడేళ్లుగా వృద్ధురాలికి 82,000 రూపాయల పింఛను లబ్ధి  చేకూరిందని మంత్రి వివరించి, జగనన్నను దీవించాలని కోరారు. జగనన్న సంక్షేమం బుక్లెట్ మంత్రి అందజేశారు.

గ్రామంలో అంగన్వాడి, ఎంపీపీ స్కూలు సందర్శించిన మంత్రి విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. అమ్మఒడి డబ్బులు ఎవరు వేస్తున్నారని ప్రశ్నించగా జగన్ మావయ్య అంటూ చిన్నారులు బదులిచ్చారు. మధ్యాహ్నం భోజనంలో ఏమేమి పెడుతున్నారని అడిగి తెలుసుకున్నారు. చదువే ఆస్తి, బాగా చదవండి, రూపాయి ఖర్చు లేకుండా అమెరికా అయినా జగన్ మామయ్య పంపించి చదివిస్తారని చిన్నారులలో భరోసా నింపారు. గ్రామంలో అంగన్వాడి భవనం నిర్మించాలని, ఎంపీపీ స్కూలు ఎదుట రోడ్డు అభివృద్ధి చేయాలని గ్రామస్తులు కోరారు.


లబ్ధిదారు అద్దంకి కుటుంబరావు తన కుమార్తె హేమమాలిని అంగవైకల్యం కలిగి ఉందని, వికలాంగ పింఛన్ మంజూరు కాలేదని తెలుపగా మంత్రి సమస్యలు అడిగి తెలుసుకుని పింఛను మంజూరుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సచివాలయ సిబ్బందిని మంత్రి ఆదేశించారు.


మరో మహిళా లబ్ధిదారు తమ్ము దుర్గా కుమారి వివిధ పథకాల కింద మొత్తం రు.5.35 లక్షల లబ్ది లబ్ధి చేకూరిందని మంత్రి తెలిపారు. లబ్ధిదారు తన తల్లి పేరుపాలెం లో ఉంటుందని ఈ సందర్భంగా మంత్రికి తెలుపగా చిన్న గొల్లపాలెం శివారు ఏటి మొండి నుండి పేరుపాలెంకు త్వరలో బ్రిడ్జి నిర్మిస్తామని మంత్రి తెలియజేశారు.


గ్రామంలో మూడో వార్డులో రు.3.50 లక్షల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్డు మంత్రి ప్రారంభించారు.


ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోనసాని గరుడ ప్రసాద్ మార్కెట్ యార్డ్ చైర్మన్ కొల్లాటి బాలగంగాధర్ రావు, జెడ్పీటిసి మైల రత్న కుమారి,మండల పార్టీ నాయకులు వై. వెంకట్ రాజు, సర్పంచ్ కొల్లాటి రాజు ఎంపీటీసీ కొల్లాటి కృష్ణ, సచివాలయ కన్వీనర్ కొక్కిలిగడ్డ బాబ్జీ,ఎంపీడీవో పిచ్చి బాబు తాసిల్దారు రామకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

Comments