తమ నేరాల్లో పోలీసులను కూడా వైసీపీ నేతలు భాగస్వాములు చేస్తున్నారు.

 నెల్లూరు (ప్రజా అమరావతి);


*జగన్ వైజాగ్ వెళితే అక్కడ టీడీపీ మెజారిటీ మూడు రెట్లు పెరుగుతుంది;- నెల్లూరు రూరల్ నియోజకవర్గ  నేతలు కార్యకర్తల సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు*


సమావేశంలో చంద్రబాబు నాయుడు ప్రసంగం:-

వైసీపీ ప్రభుత్వంలో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్దభేరి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నాను.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన మన పై తప్పుడు కేసులు పెడుతున్నారు. దాడులు చేస్తున్నారు

అయితే ప్రజాస్వామ్యంలో ఈతరహా రాజకీయాలకు ప్రజల మద్దతు ఉండదు. అందుకే అంగళ్లు, పుంగనూరులో ప్రజా తిరుగుబాబు మొదలైంది.

తమ నేరాల్లో పోలీసులను కూడా వైసీపీ నేతలు భాగస్వాములు చేస్తున్నారు.


తమ నేరాల్లో పోలీసులను, వ్యక్తులను భాగం చేయడం ద్వారా వారిని తమ ఆధీనంలో పెట్టుకుని పనిచేస్తారు. దీని వల్ల వారి జీవితం నాశనం అవుతుంది.

పోలీసు అధికారులు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించవద్దు. అవసరం అయితే ఉన్నతాధికారుల అదేశాలతో విభేదించండి.

నెల్లూరు రూరల్ టీడీపీ కి బలమైన నియోజకవర్గం. వచ్చే ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గంలో టీడీపీ గెలవాలి.

వైసీపీ చేసే అరాచకాలకు కాలం చెల్లింది. వచ్చే ఎన్నికల్లోపులివెందుల కూడా గెలవబోతున్నాం. అంటే 175 గెలిచే అవకాశం ఉంది.

సైకో పోవాలి అని మనం పోస్టర్ వేస్తే....సైకో అనే పదం కనపడకుండా అధికారులు స్టిక్కర్ వేశారు.  

జగన్ నిర్ణయాలు సైకో తరహా నిర్ణయాలు. 

జగన్ వైజాగ్ వస్తాను అంటే విశాఖ ప్రజలు వణికిపోతున్నారు. జగన్ లాంటి ఐరన్ లెగ్ వద్దు అని విశాఖ ప్రజలు అనుకుంటున్నారు.

జగన్ రుషికొండకు కాదు...ఇడుపుల పాయకు పోతే దరిద్రం పోతుంది.

జగన్ విశాఖ వెళితే అక్కడి వాతావరణం పొల్యూట్ అవుతుంది.

జగన్ విశాఖ వెళితే ఉత్తరాంధ్రలో టీడీపీ మెజారిటీ రెండు మూడింతలు పెరుగుతుంది.

•కార్యక్రమం వద్ద టీడీపీ నేతలు కోంటరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పి.నారాయణ, ఆనం రాంనారాయణ రెడ్డి, బీదా రవిచంద్రతో పాటు జిల్లా ముఖ్యనేతలు చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికారు.

Comments