రైతు భరోసా కేంద్రాలతో పిఏసిఎస్లు,రైతు ఉత్పత్తి దారుల సంఘాల అనుసంధానం.

 రైతు భరోసా కేంద్రాలతో పిఏసిఎస్లు,రైతు ఉత్పత్తి దారుల సంఘాల అనుసంధానం


పై సిఎస్ సమీక్ష

అమరావతి,3 ఆగష్టు (ప్రజా అమరావతి):రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలతో ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు,రైతు ఉత్పత్తి దారుల సంఘాల అనుసంధానంపై గురువారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన డా.కెఎస్.జవహర్ రెడ్డి వ్యవసాయ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ గ్రామ స్థాయిలో రైతులకు అవసరమైన వివిధ సేవలన్నీఒకేచోట అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.ఆయా రైతు భరోసా కేంద్రాలతో ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలను,రైతు ఉత్పత్తి దారుల సంఘాలను అనుసంధానించడం ద్వారా రైతులకు మరిన్ని ప్రయోజనాలను అందించాలనే ప్రయత్నం చేస్తోందని తెలిపారు.ఇందుకు సంబంధించి ఏవిధంగా మూడిటిని అనుసంధానం చేయాలనే దానిపై ఆయన అధికారులతో సమీంచారు.రైతులు ఉత్పత్తి చేసే వివిధ రకాల ఉత్పత్తులకు మరిన్ని విలువ ఆధారిత సేవలు అందించేందుకు వీలుగా ఇప్పటికే రాష్ట్రంలో పెద్దఎత్తున ఆహారశుద్ధి పరిశ్రమలను నెలకొల్పుతున్నందున రైతులకు రానున్న రోజుల్లో మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని సిఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.

రాష్ట్రంలో విద్య,ఆరోగ్యం,వ్యవసాయానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇచ్చి అనేక కార్యక్రమాలను అమలు చేస్తూ వేలాది కోట్ల రూ.లను ఖర్చు చేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి పేర్కొన్నారు.ముఖ్యంగా వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులు తేడవం ద్వారా రైతులకు మరిన్ని ప్రయోజనాలు కల్పించేందుకు కృషి జరుగు తోందని అన్నారు.ఇందుకు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే వివిధ పధకాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని సిఎస్ స్పష్టం చేశారు.

ఈసమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ సిహెఎచ్.హరికిరణ్ మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద ప్రభుత్వం 500 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయాలని లక్ష్యం నిర్దేశించిందని చెప్పారు.రైతు ఉత్పత్తి దారుల సంఘాలకు డ్రోన్లను ఇవ్వాలని అనుకుంటున్నామని వాటితో వివిధ పురుగు మందులు స్ప్రే చేయడం,విత్తనాలు,ఎరువులు వెదజల్లేందుకు ఎంతో అనువుగా ఉంటుందని తెలిపారు.

ఉద్యానవన శాఖ కమీషనర్ ఎస్.ఎస్.శ్రీధర్ మాట్లాడుతూ ఉద్యానవన శాఖకు సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలో 100 వరకూ రైతు ఉత్పత్తిదారుల సంఘాలున్నయని చెప్పారు.ఈసంఘాలు వివిధ రకాల పండ్లను,పూలను వ్యాపారం,ఎగుమతులు వంటివి నిర్వహిస్తున్నాయని అన్నారు. 

రాష్ట్ర పుడ్ ప్రోసెసింగ్ సొసైటీ సిఇఓ ఎల్.శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్టంలో పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు అవుతున్నాయని చెప్పారు.అలాగే ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు,సెకండరీ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు అవుతున్నాయని తెలిపారు. 

ఇంకా ఈసమావేశంలో నాబార్డు డిజియం ఎంఎస్ఆర్ మూర్తి,ఎజియం చౌలాస్కర్,ఫుడ్ ప్రాసెసింగ్ స్టేట్ హెడ్ సుభాష్  కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


Comments