వైద్య ఆరోగ్య‌శాఖకు అవార్డుల పంట‌.

 *వైద్య ఆరోగ్య‌శాఖకు అవార్డుల పంట‌


*

*జ‌గ‌న‌న్న చిత్త‌శుద్ధి ఫ‌లిత‌మే ఇదంతా*

*రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని*

విజయవాడ (ప్రజా అమరావతి);

అమరావతి, సెప్టెంబర్ 28: ఆయుష్మాన్‌భార‌త్ కింద అత్య‌ధిక మంది ప్ర‌జ‌ల హెల్త్ అకౌంట్ల‌కు ఆరోగ్య రికార్డుల‌ను లింక్ చేసినందుకు దేశంలో మ‌న రాష్ట్రం మొద‌టి ర్యాంకును కైవ‌సం చేసుకున్న‌ద‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. హెల్త్ అకౌంట్ల‌కు రికార్డుల లింక్‌లో జిల్లా విభాగంలోనూ ఏపీకి అవార్డు ద‌క్కింద‌ని తెలిపారు. విశాఖ జిల్లా దేశంలో రెండో ర్యాంకును, ఏలూరు జిల్లా మూడో ర్యాంకును ద‌క్కించుకున్నాయ‌ని తెలిపారు. ఏబీ-పీఎంజేఏవై నిధులు వంద శాతం వినియోగంలోనూ మ‌రో అవార్డు ఏపీకి ద‌క్కింద‌ని వివ‌రించారు. ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ప‌నిచేస్తున్నందునే ఈ రికార్డులు, అవార్డులు సాధ్య‌మ‌వుతున్నాయ‌ని తెలిపారు. ఆయా అవార్డుల‌ను గురువారం మంత్రి చేతుల మీదుగా అధికారులు ఏపీఐఐసీ ట‌వ‌ర్స్‌లోని వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌ధాన కార్యాల‌యంలో అందుకున్నారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్‌, ఆరోగ్య శ్రీ సీఈవో హ‌రీంద్ర‌ప్ర‌సాద్, 

ఎన్ హెచ్ ఎం

 స్టేట్  ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ వెంకటరవికృష్ణ త‌దిత‌రులు ఉన్నారు.

Comments