రైతాంగన్నీ నాశనం చేసే విధంగా జగన్ పాలన ఉన్నది.

 తెనాలి (ప్రజా అమరావతి);


 తెనాలి లో ఉన్న నీటిపారుదలశాఖ ఈఈని కలిసిన మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనంద్ బాబు – కృష్ణా డెల్టాలో నీరు సరిపడా లేక పంటలు ఎండిపోతున్నాయన్న నేతలు – పంటలకు సరిపడా నీరు విడుదల చేయాలని నిరసన తెలిపి,వినతిపత్రం ఇచ్చిన నేతలు – పట్టిసీమ ద్వారా నీరు తెచ్చి రైతులకు ఇవ్వాలని కోరిన టీడీపీ నేతలు-పాల్గొన్న తెనాలి,వేమూరు నియోజకవర్గం రైతులు,నాయకులు


కృష్ణ పశ్చిమ భాగం, 

జలవనరుల శాఖ, 

ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయం వద్ద 

మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు ఆలపాటి రాజేంద్రప్రసాద్ రైతులతో కలిసి నిరసన


తెనాలి,వేమూరు నియోజకవర్గాలలో కాలవల్లో నీరు సరిగ్గా వదల పోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని కాల్వల్లో నీరు సరిగ్గా విడుదల చేయకపోవడంతో పంటలు పండే స్థితి లేకుండా పోతుందని రైతులతో కలిసి ఆందోళన 


ఇరిగేషన్ EE మల్లికార్జునరావు నీ కలిసి నీటి సమస్య పై వివరాలు తెలిపి నీటిని సక్రమంగా విడుదల చేయాలని వినతి పత్రం అందజేసిన మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు బాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్


మాజీ మంత్రులు నక్కా ఆనంద బాబు గ మాట్లాడుతూ -


సాగునీటి పంపిణీపై సర్కార్ కు కనీస ప్రణాళిక లేదు – కృష్ణా జలాలపై హక్కులు వదిలేసేందుకు సిద్ధమయ్యారు – జగన్ అసమర్థతతోనే ఏపీకి తీవ్ర అన్యాయం – జగన్ సర్కార్ వెంటనే డెల్టా ఆయకట్టుకు నీరు ఇవ్వాలి – 2 రోజుల్లో నీరు ఇవ్వకపోతే ఉద్యమిస్తాం : మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు


కృష్ణ డెల్టా రైతాంగం నారుమళ్లు అయిపోయి నీరు కోసం ఎదురుచూడటం దారుణం.


ఏ నీరు ఎప్పుడు వాడలో లో కూడా కనీస పరిజ్ఞానం లేని ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది.


ఏదన్నా సమస్యపై మంత్రులు మాట్లాడమంటే బూతులు తప్ప ఏమి మాట్లాడారు.


5లక్షల70వేల ఎకరాలు సాగులోకి ఉన్నాయి.


ఇరిగేషన్ కోసం ఏమి చేశారు అంటే మీనమేషాలు లెక్కిస్తున్న పరిస్థితి.


వైసిపి నాయకులు ఇళ్ల వెంట తిరగటం కాదు రైతు దగ్గరకు పొలాల వెంట తిరగాలి.


వైసిపి ప్రభుత్వం వచ్చాక నాలుగు సంవత్సరాలనుండి పట్టి సీమకు తాళం వేశారు.


నీళ్లు ఇష్టానుసారంగా వదిలేసి ఇప్పుడు నీళ్లు కోసం ఏమి చెయ్యాలి తెలియని పరిస్థితిలో జగన్ ప్రభుత్వం ఉంది.


నీటి విషయంలో జగన్ ప్రభుత్వం చేతులు ఎత్తేసిన పరిస్తితి.


ఇరిగేషన్లు కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు చేతులు ఎతేసిన పరిస్థితి.

కృష్ణ జలాల పై ఆంధ్రప్రదేశ్ హక్కులు కోల్పోయే పరిస్థితి జగన్ తెచ్చారు.

జగన్ ప్రభుత్వం చర్యల వల్ల రాబోయే రోజుల్లో డెల్టా ప్రాంతం తీవ్ర నష్టం వాటిల్లుతుంది.


రైతాంగన్నీ నాశనం చేసే విధంగా జగన్ పాలన ఉన్నది.
రెండు రోజులు సమయం ఇస్తున్నాము డెల్టా రైతాంగానికి నీరు ఇవ్వాలి లేని పరిస్థితుల్లో అధికారులు ఉద్యోగం ఎలా చేస్తారో చూస్తాము.

మాజీ మంత్రి ఆలపాటి రాజా  మాట్లాడుతూ -

సీఎం జగన్ కు వ్యవసాయంపై కనీస అవగాహన లేదు – రైతుల సంక్షేమంపై సమీక్షలు కూడా లేవు – ఏపీలో ప్రజా సమస్యలపై దృష్టిమరల్చేందుకే చంద్రబాబును అక్రమ అరెస్ట్ చేశారు : మాజీ మంత్రి ఆలపాటి రాజా

వ్యవసాయం అంటే పూర్తిగా అవగాహన లేని పాలన జగన్ పాలనలో చూస్తున్నాము.ఒక్క ఎకరానికి కూడా సరిగ్గా నీరు పెట్టుకొలేని పరిస్థితిల్లో రైతాంగం ఉంది.

ప్రభుత్వం వ్యవసాయం పట్ల గాని రైతుల పట్ల గాని ఒక్క చర్చ అన్న పెట్టరా?

జగన్ పాలనలో రైతాంగం పూర్తిగా నాశనం అవుతున్న పరిస్థితి.రైతుల విషయంలో ఏదో ఒక రకంగా కాలయాపన వైసిపి ప్రభుత్వం చేస్తుంది.కాల్వలు బాగుచెయ్యకుండ బాగు చేసుకున్నట్టు వైసిపి నాయకులు వాటాలు పంచుకుంటున్నారు.

కృష్ణ నీరు హక్కులను పూర్తిగా కలారాస్తున్న పరిస్థితి.

ఢిల్లీ వెళ్లి మోడీ నుంచి కేంద్ర మంత్రుల వరకు అందరినీ కలిసి వచ్చి కృష్ణా జలాల విషయం అక్కడ చెప్పకుండా ఇక్కడికి వచ్చి లెటర్ రాస్తున్నాను అని చెబుతున్నారు.

సహజ వనరులు దోచుకుంటున్నారు ఇప్పుడు నీళ్లను కూడా కాపాడుకొలేకపోతున్నారు.డెల్టా ప్రాంతం కి అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు.ఇరిగేషన్ మంత్రి ఎక్కడ ఉన్నారు పొలాలు ఎండిపోతుంటే కనపడటంలేదు.రెండు రోజుల్లో 7వేల క్యూసెక్కల ఇవ్వని పక్షంలో అధికారులు ఇళ్లకు పరిమతమవుతరని హెచ్చరించారు.

Comments