దాడి ఘటనలో గాయపడిన ప్రభుత్వ ఉద్యోగి ఆర్టీసీ డ్రైవర్ ను పరామర్శించిన ఆర్టీసీ ఛైర్మన్ శ్రీ ఏ.మల్లిఖార్జున రెడ్డి.

 విజయవాడ (ప్రజా అమరావతి),




దాడి ఘటనలో గాయపడిన ప్రభుత్వ ఉద్యోగి ఆర్టీసీ డ్రైవర్ ను

పరామర్శించిన ఆర్టీసీ ఛైర్మన్ శ్రీ ఏ.మల్లిఖార్జున రెడ్డి




ఈ నెల 26న తేదీన కావలి బైపాస్ రోడ్డులో ప్రభుత్వ ఉద్యోగి అయిన ఏపీఎస్ ఆర్టీసీ  ఆటో నగర్ డిపో డ్రైవర్ శ్రీరామ్ సింగ్ పై జరిగిన దాడి సంబంధించి ఈరోజు గౌరవ ఛైర్మన్ శ్రీ ఏ.మల్లిఖార్జున రెడ్డి గారు ఏపీఎస్ ఆర్టీసీ సెంట్రల్ ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్న డ్రైవర్ ను పరామర్శించారు. 

దాడి జరిగిన సంఘటన గురించి, ఎదురైన సమస్యల గురించి  అడిగి తెలుసుకుని విచారం వ్యక్తం చేశారు. ఆందోళన పడకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. అతనికి పండ్లు అందజేసి, త్వరగా కొలుకోవాలని ఆకాంక్షించారు.  

బాధితునికి భరోసా కల్పించి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డాక్టర్ డి.వి.ఎస్.అప్పారావు (ఛీఫ్ మెడికల్ ఆఫఫీసర్), సంబంధిత వైద్య అధికారులకు ఛైర్మన్ శ్రీ ఏ.మల్లిఖార్జున రెడ్డి గారు సూచించడం జరిగింది.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనునిత్యం ప్రయాణీకుల సేవలో నిమగ్నమై అంకిత భావంతో ప్రయాణీకులకు సేవలు అందిస్తూ, ఎంతో క్రమశిక్షణ తో విధులు నిర్వర్తిస్తున్న, డ్యూటీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దుర్మార్గంగా దాడి చేయడం చట్ట విరుద్దమని, అలా చేసిన వారిపై  పోలీసు డిపార్ట్మెంట్ తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దాడికి యత్నించిన దుండగులపై ఇప్పటికే పలు సెక్షన్లతో కూడిన కేసులు నమోదయ్యాయని, వారికి తగిన శిక్ష పడుతుందని తెలిపారు.    

ఈ కార్యక్రమంలో శ్రీ కె.ఎస్ బ్రహ్మానందం రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్), డాక్టర్ డి.వి. ఎస్.  అప్పారావు (ఛీఫ్ మెడికల్ ఆఫఫీసర్), జనరల్ సర్జన్ శ్రీ డా. పి. శ్రీనివాస్  మరియు ఇతర ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. 


Comments