విశాఖపట్నం, జగదాంబ సెంటర్ రిజిస్ట్రార్ కార్యాలయం (R.O.) పై ACB అధికారులు దాడులు .


డిజిపి కార్యాలయం, 

మంగళగిరి.  (ప్రజా అమరావతి);


 డిజిపి శ్రీ కె. వి. రాజేంద్రనాథ్ రెడ్డి  ఆదేశాల మేరకు అవినీతి అధికారులపై  వచ్చిన ఫిర్యాదులతో  విశాఖపట్నం, జగదాంబ సెంటర్ రిజిస్ట్రార్ కార్యాలయం (R.O.) పై ACB అధికారులు దాడులు


నిర్వహించారు.


విశాఖపట్నం,  దొండపర్తి చెందిన వాగోలు గోపీకృష్ణ,  తన బంధువు యొక్క భూమి రిజిస్ట్రేషన్ చేసినందుకు మరియు ఆ భూమి మార్టిగేజ్ డీడ్ రిలీజ్ చేయుట కొరకు విశాఖపట్నం, జగదాంబ సెంటర్ జాయింట్ సబ్ రిజిస్ట్రార్-2  శ్రీ. కె. శ్రీనివాసులు రూ.15,000/- లంచం డిమాండ్ చేయడం తో బాదితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.  


దీనిపైన కేసు నమోదు చేసుకున్న అధికారులు ఈ రోజు విశాఖపట్నం రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద  జాయింట్ సబ్ రిజిస్ట్రార్-2  శ్రీ. కె. శ్రీనివాసులు ఆదేశాలు మేరకు అసిస్టెంట్ డాక్యుమెంట్ రైటర్ ఎస్.లక్ష్మి రూ.15000/- లంచం తీసుకొనగా, డాక్యుమెంట్ రైటర్ పి.వెంకటరావు వద్ద  నుండి సదరు సొమ్మును ఏసిం‌బి అదికారులు స్వాదీనం చేసుకున్నారు.   నిందిత అదికారిని మరియు మిగిలిన ఇద్దరు ముద్దాయిలను అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరుస్తారు. 


అవినీతి అధికారులపై ప్రజల ఫిర్యాదు కోసం 14400: అవినీతి నిరోధక శాఖ ప్రజల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉంచిన 14400 నెంబరును ప్రతీ ఒక్కరు సద్వినియోగం  చేసుకోవాలని, ఎవరైనా అధికారులు వేధింపులకు పాల్పడితే  ప్రజలు ఈ నెంబర్ ద్వారా  అవినీతి నిరోధక శాఖ అధికారులను  సంప్రదించ వచ్చని డిజిపి రాజేంద్రనాధ్ రెడ్డి  పేర్కొన్నారు.

Comments