మహిళలను లక్షాధికారులు చేయాలన్నదే ప్రధానమంత్రి ముఖ్య ఉద్దేశం.

 మహిళలను లక్షాధికారులు చేయాలన్నదే ప్రధానమంత్రి ముఖ్య ఉద్దేశం


కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు నిర్మల సీతారామన్


గోరంట్ల, నవంబర్ 30 (ప్రజా అమరావతి): మహిళలను లక్షాధికారులు చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య ఉద్దేశమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మల సీతారామన్ పేర్కొన్నారు. గురువారం శ్రీ సత్య సాయి జిల్లాలోని గోరంట్ల మండలంలోని బాలుర హై స్కూల్ నందు ఆవరణలోవికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానం ద్వారావికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాల్లో దేశంలోని వివిధ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల లబ్ధిదారుల తో ప్రధానమంత్రి మాట్లాడారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు గోరంట్ల నందు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుమునుపు కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించిన స్టాల్స్ ను కేంద్ర మంత్రివర్యులు తిలకించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులు బుగ్గన రాజేంద్రనాథ్,  ఫైనాన్స్ కార్యదర్శి ఎస్ఎస్ రావత్, రాష్ట్ర గృహ నిర్మాణ కార్యదర్శి అజయ్ జైన్, జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ, ఎమ్మెల్సీ మంగమ్మ, ఉమ్మడి జిల్లాలో జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు మాట్లాడుతూ.విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్రను ప్రధాని మోదీ 15 నవంబర్ 2023 (జనజాతీయ గౌరవ్ దివస్ నాడు జార్ఖండ్ లోని ఖుంటి నుండి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నింపడానికి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన పథకాల గురించి పౌరులకు తెలియజేయడం మరియు సాధికారత కల్పించడం లక్ష్యంగా దేశవ్యాప్త ఔట్రీచ్ చొరవ ఉంది. కేంద్ర ప్రభుత్వంప్రభుత్వ ప్రధాన పథకాలలో 100% సంతృప్త మైలురాళ్లు అధిగమించాలని పేర్కొన్నారు

చేరుకోని వారిని చేరుకోవడం -  వివిధ పథకాల కింద అర్హులైనప్పటికీ ఇప్పటివరకు ప్రయోజనం పొందని బలహీన వర్గాలను చేరుకోవడం.విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

ఆయుష్మాన్ భారత్-PMJAY, PM గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY), PM ఆవాస్ యోజన (PMAY), PM ఉజ్వల యోజన, PM విశ్వకర్మ, PM కిసాన్, కిసాన్ క్రెడిట్ కార్డ్, పోషణ్ అభియాన్, జల్ సహా 10 ప్రభుత్వ పథకాలు ఈ చొరవలో అంతర్భాగంగా ఉన్నాయి పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించడానికి సంకల్పించి విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్రను ప్రారంభించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం 60 రోజుల పాటు నిర్దేశించిన ఈ యాత్ర ఈ నెల 27 నుండి దేశంలోని అన్ని నియోజకవర్గాలలో

నియోజకవర్గానికి 2 చొప్పున తిరుగుతాయని, విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర వాహనాలు రోజుకు రెండు పంచాయతీల చొప్పున పకడ్భందీగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.


మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లను అందించడానికి కేంద్ర రంగ పథకం


* 15,000 మంది మహిళలకు డ్రోన్లను అందించే సెంట్రల్ సెక్టార్ స్కీమ్కు 28 నవంబర్ 2023 న కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. స్వయం సహాయక బృందాలు (SHGలు), రూ. మహిళా ఎస్ హెచ్వాలను బలోపేతం చేయడానికి మరియు వ్యవసాయ రంగంలో కొత్త సాంకేతికతలను తీసుకురావడానికి వ్యవసాయ ప్రయోజనం కోసం రైతులకు అద్దె సేవలను అందించడానికి 2024-25 నుండి 2025-26 వరకు 1261 కోట్లు.


* డ్రోన్ల కొనుగోలు కోసం మహిళా ఎసెహెచిలకు డ్రోన్ ఖర్చులో 80% మరియు ఉపకరణాలు /అనుబంధ ఛార్జీలు (రూ. 8 లక్షల వరకు) కేంద్ర ఆర్థిక సహాయం అందించబడుతుంది.


O. SHGల క్లస్టర్ లెవల్ ఫెడరేషన్ (CLFలు) బ్యాలెన్స్ మొత్తాన్ని నేషనల్ అగ్రికల్చర్ ఇన్ఫ్రా ఫైనాన్సింగ్ ఫెసిలిటీ (AIF) కింద రుణంగా పెంచవచ్చు (3% వడ్డీ రాయితీతో).


. డ్రోన్లను ఎగరడానికి మరియు ఉపయోగించడానికి అవసరమైన శిక్షణ కూడా మహిళలకు అందించబడుతుంది:


0. ఎంపిక చేసిన 1 మహిళా SHG సభ్యులు అందించబడతారు 5 రోజుల తప్పనిసరి శిక్షణతో కూడిన 15 రోజుల శిక్షణ డ్రోన్ పైలట్ శిక్షణ మరియు అదనపు 10-రోజులు పోషకాలు మరియు పురుగుమందుల అప్లికేషన్ యొక్క వ్యవసాయ ప్రయోజనం కోసం శిక్షణ.

ఎలక్ట్రికల్ వస్తువుల మరమ్మతులు, ఫిట్టింగ్ మరియు మెకానికల్ పనులు చేపట్టాలనే ఆసక్తి ఉన్న మరొకరికి డ్రోన్ టెక్నీషియన్/అసిస్టెంట్ గా శిక్షణ ఇవ్వబడుతుంది.


O. డ్రోన్ కంపెనీల ద్వారా డ్రోన్లను కొనుగోలు చేయడం, డ్రోన్ల మరమ్మతులు మరియు నిర్వహణలో ఎస్ఏహెచ్ఐలు ఎదుర్కొనే ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుంటే, లీడ్ ఫర్టిలైజర్ కంపెనీలు డ్రోన్ సరఫరా చేసే కంపెనీలు మరియు ఎస్ హెచ్ఎల మధ్య వారధిగా పనిచేస్తాయి తెలిపారు.


శ్రీ సత్య సాయి జిల్లాలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద 1.57 లక్షల ఇళ్ళు నిర్మాణాలు జరిగింది స్వచ్ఛభారత్ కార్యక్రమం ద్వారా 1.53 పనులు పూర్తి చేయడం జరిగిందని ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా జిల్లాలో 27 వేల మంది లబ్ధి పొందారని పేర్కొన్నారు. పీఎం గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద జిల్లాలో

15,500 మంచి లబ్ధిదారులు ఉన్నారు. ప్రధానమంత్రి మోదీ జెన్ ఔషధ కేంద్రాల ద్వారా తక్కువ ధరలకే మందుల లభిస్తాయని పేర్కొన్నారు. అనంతరం ఉజ్వల 2.0 పథకం ద్వారా  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చేతుల మీదుగా గ్యాస్ మరియు స్టౌ పంపిణీ లబ్ధిదారులకు సాయి లీల, సౌందర్య పంపిణీ చేశారు. లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో స్వయం సహాయక మహిళా సంఘాలకు రెండు కోట్ల రూపాయలు విలువ చేసే అనంతరం పట్టణంలోని మోడీ ప్రచార రథాన్ని తిలకించారు. చౌకు ధర దుకాణాన్ని 1248003 కే సుగుణమ్మ తనిఖీ చేశారు. గుమ్మయగారిపల్లి క్రాస్ నందు చౌక ధర దుకాణాన్ని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments