మంగళగిరి (ప్రజా అమరావతి);
ఖరీఫ్ e- క్రాప్ ముగిసినందున రైతులకు వారి పంట వివరముల నమోదుకు సంబంధించి భౌతిక రసీదులను అందించాల
ని, శ్రీ చేవూరి హరికిరణ్ I.A.S., ప్రత్యేక వ్యవసాయకమీషనర్ వారు రాష్ట్రములోని 26 జిల్లాల వ్యవసాయ అధికారులు, సహాయవ్యవసాయ సంచాలకులు మరియు మండల వ్యవసాయ అధికారులకు ఆదేశించారు.
రబీ కార్యాచరణ ప్రణాళిక లో వ్యవసాయ సలహా మండళ్ళు, సాగు నీటి సలహా మండళ్ళ సభ్యుల సమన్వయముతో నీటి సరఫరాను నిర్ధారించుకోవాలని, వరి పంటకు ప్రత్యామ్నాయంగా తక్కువ నీటి వసతితో సాగయ్యే మొక్కజొన్న, అపరాలు మరియు ఇతర ఆరుతడి పంటలు రైతులు సాగు చేసేవిధంగా అవగాహన కల్పించాలని సూచించారు.
ఆర్బీకే లలో వ్యవసాయ యంత్ర సేవా కేంద్రాలు (కస్టమ్ హైరింగ్ సెంటర్ల) అమలు మెరుగు పడిందని, దాదాపుగా 500 మందికి కిసాన్ డ్రోన్ పైలట్ శిక్షణ అందచేసామని తెలిపారు. ప్రతి ఒక మండలానికి ఒక శిక్షణ పొందిన కిసాన్ డ్రోన్ పైలట్ ఉండాలని సూచించారు. అత్యంత ఖరీదుతో కూడుకున్న ఈ శిక్షణను మన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చును భరించి ఎంపికైన శిక్షకులకు ఉచితంగా అందచేస్తోందన్నారు.
రాష్ట్రము లో 20 జిల్లాలలో ఎ పి ఎస్ ఓ పి సి ఎ ద్వారా గ్యాప్ సర్టిఫికేషన్ పూర్తి చేపడుతున్నామని, అందులోనుండి 12, 13 మంది రైతులకు ఒక నమూనా సేకరించి దానికి నాణ్యతా నిర్ధారణ సర్టిఫికేట్ అందించటం జరుగుతుందని తెలిపారు. నంద్యాల జిల్లాలో గ్యాప్ పద్దతి లో సాగయిన కొర్ర పంటకు నాణ్యతా నిర్ధారణ సర్టిఫికేట్ లభించిందని తెలియచేస్తూ వాటి మార్కెటింగ్ పై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. చిరుధాన్యాల సాగును గురించి ప్రస్తావిస్తూ జొన్న మరియు రాగి పంటను మద్దతు ధర ప్రకారము పౌరసరఫరా శాఖ కొనుగోలు చేస్తుందని తెలియచేసారు.
రైతు భరోసా కేంద్రాల ద్వారా ముందుగా పరీక్షిoచబడిన సస్యరక్షణ రసాయనాలైన జింక్ సల్ఫేట్, జిప్సం, నీటిలో కరిగే ఎరువులు, సూక్ష్మపోషకాలు మరియు సస్యరక్షణ మందులు ఈరబీ నుండి అందిస్తున్నoదున వ్యవసాయ అధికారులు వాటి లభ్యత పై రైతులకు ముమ్మర ప్రచారం చేసి తెలియచేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ది సంస్థ వారు దీనికి నోడల్ సంస్థగా వ్యవహరిస్తారని తెలియచేసారు.
భారత ప్రధాని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 15 వ విడత పిఎం కిసాన్ నగదు పంపిణీ తో పాటు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే కార్యక్రమాన్ని జార్ఖండ్ రాష్ట్రం రాంచి నుండి ప్రారంభిస్తారని తెలిపారు. మన రాష్ట్రంలో ముందుగా రేపు 15-11-23 మన్యం , అల్లూరి సీతారామరాజు జిల్లాలలో మరియు నవంబర్ 3 వ వారం లో మిగిలిన 24 జిల్లాలలో ఈ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ యాత్ర లో ప్రధానంగా భారత ప్రభుత్వ పధకాలైన పిఎం కిసాన్, కిసాన్ క్రెడిట్ కార్డులపై ఆచరణాత్మక కార్యాచరణను చేపడతారని తెలిపారు. పిఎం ప్రణామ్, మట్టి నమూనాల యాజమాన్యం, సాయిల్ హెల్త్ కార్డు, నానో యూరియా వాడకం పైన అవగాహన కల్పించాలని ఆదేశించారు.
addComments
Post a Comment