*ఈ చవట దద్దమ్మలకు కరెంటు సక్కగ ఇయ్యొస్తలేదా?: మాజీ సీఎం కేసీఆర్
*కరీంనగర్ జిల్లా:మార్చి 12 (ప్రజా అమరావతి);
బీఆర్‌ఎస్ అధినేత, తెలం గాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ కదనభేరి సభలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగా రు.
మంచినీటి, సాగునీటి సర ఫరాలో, కరెంటు సప్లయ్ లో, ప్రజా సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభు త్వం ఘోరంగా విఫలమైం దని ఆయన మండిపడ్డారు.
ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టకపోతే వాళ్లలో నిర్లక్ష్యం, అహంకారం మరింత పెరుగుతుందని ఓటర్లను హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో గులాబీ జెండా ఎంత బలంగా ఎగిరితే.. బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల పక్షాన అంత బలంగా, కాపలాదారుగా కొట్లాడు తుందని భరోసా ఇచ్చారు.
కరీంనగర్ కదనభేరి సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మంచి నీళ్లకు, కరెంటుకు ఎందుకు సమ స్యలు వస్తున్నయో నాకు అర్థం కావడం లేదు. మేం ఎంతో శ్రమించి ఇంటింటికి మంచి నీళ్లు ఇవ్వడం కోసం మిషన్ భగీరత పథకం తీసుకొచ్చినం.
ఆదిలాబాద్ గోండు గూడెం నుంచి నల్ల గొండ లంబాడీ తండా దాకా అందరికీ మంచినీళ్లు అందేలా చూసి నం. బ్రహ్మాండంగా మంచినీ టి సరఫరా చేసినం. ఇప్పు డున్న ప్రభుత్వానికి ఆ పథా కాన్ని నడిపే తెలివి లేదా..? ఎందుకు మిషన్ భగీరథలో సమస్యలు వస్తున్నయ్..?’ అని ప్రశ్నించారు.
‘నేను ముఖ్యమంత్రి అయిన ప్పుడు ఏడాదినర్థం తిరగ కుండానే కరెంటు పరిస్థితిని చక్కదిద్దినం. ఒక రెప్పపా టు కూడా కరెంటు పోకుండా రాష్ట్రంలో అన్ని వర్గాలకు కరెంటు ఇచ్చినం. దాంతో 24 గంటలు రైతులకు ఉచితంగా కరెంటువచ్చిం ది.
రైతు బంధు ఇచ్చినం. కరోనా వచ్చి కాటేసినా రైతు బంధు ఆపలే. ఇయ్యాల ఆ రైతు బంధు ఏసుడు చేత నైత లేదా..? కేసీఆర్ జర్ర ముఖం మల్పంగనే కట్క బంద్‌జేసి నట్టు కరెంటు బందైతదా..? మేం తొమ్మి దేళ్లు ఇచ్చింది ఇయ్యాల ఈ చవట దద్దమ్మలకు ఇయ్యొస్త లేదా..?’ అని కేసీఆర్ నిప్పులు చెరిగారు.
ఇయ్యాల మళ్ల మీరు ఆళ్లకే ఓటేస్తే నష్టపోతరు. మేం రైతుబంధు ఎయ్యకపో యినా.. కరెంటు సక్కగ ఇయ్యకున్నా.. తాగునీటి, సాగునీటి సరఫరా సక్కగ లేకున్నా.. మోటర్లు కాలబెట్టినా.. పొలాలు ఎండబెట్టినా..జనం మళ్లీ మనకే ఓటేసిండ్రని ఆరు గ్యారంటీలకు ఎగనామం పెడ్తరు.
ఈ టైమ్‌లో మీరు కర్రు కాల్చి వాతపెట్టకపోతే వాళ్లలో నిర్లక్ష్యం వస్తది. అహంకారం పెరుగుతది. ఇయ్యాల చెప్పుతో కొడుత అన్నోడు రేపు నిజంగనే కొడుతడు. ఇట్ల మోసపో దామా..? లేదంటే గులాబీ జెండా ఎగరేసి మన ఎంపీల ను గెలిపించి ముందుకు పోదామా..? ఇది మన తెలంగాణ సమాజం బాగా ఆలోచించాలె.
ఈ లోక్‌సభ ఎన్నికల్లో గులాబీ జెండా ఎంత బలంగా ఎగిరి తే ప్రజల పక్షాన కాపలాదా రులుగా అంత బ్రహ్మాండంగా ముందుకు పోతం’ అని కేసీఆర్ భరోసా ఇచ్చారు...
addComments
Post a Comment