రిటైర్ కాబోయే ఉద్యోగుల కోసం పోస్ట్ రిటైర్మెంట్ ప్రోగ్రామ్ –

 విజయవాడ (ప్రజా అమరావతి);



రిటైర్ కాబోయే ఉద్యోగుల కోసం పోస్ట్ రిటైర్మెంట్ ప్రోగ్రామ్ –

దిశానిర్దేశం చేసిన సంస్థ ఎం. డి. శ్రీ సిహెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ. పి. ఎస్. 

ది 21.03.2024 న APSRTC/APPTD  నందు మార్చి 2024 నుండి డిసెంబర్ 2024 వరకు రిటైర్మెంట్  కాబోయే ఫ్రంట్  లైన్   సూపర్ వైజర్  లకు " పోస్ట్ రిటైర్మెంట్ ప్లానింగ్" ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించారు.   ఈ కార్యక్రమలో VC & MD శ్రీ సిహెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్., ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మిన్) శ్రీ కె.ఎస్.బ్రహ్మానంద రెడ్డి , ట్రాన్స్పోర్ట్ అకాడెమీ ప్రిన్సిపల్ కుమారి.డి. సాంబ్రాజ్యం  మరియు ZSTC ప్రిన్సిపల్ శ్రీమతి కె. శ్రీలక్ష్మి , పాల్గొన్నారు.  

ఈ కార్యక్రమంలో VC&MD గారు మాట్లాడుతూ రిటైర్మెంట్ తదుపరి ఆరోగ్యం పట్ల, ఆర్దిక భద్రత మరియు ప్రశాంత జీవితం గడపడానికి కావలసిన అన్ని జాగ్రత్తలు తీసుకోవలసినదిగా తెలియజేశారు. 

ED(Admin) 


మాట్లాడుతూ RTC  ఉద్యోగుల శ్రేయస్సు గురించి VC&MD  ఎంతో ప్రాముఖ్యతను ఇస్తూన్నారని తెలియజేస్తూ ఉదాహరణగా  అత్త్యుత్తమమైన కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్, హెల్త్ స్కీమ్ మరియు ఐ‌డి కార్డులు లాంటి విషయాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్ వారు, ఎస్‌బి‌ఐ వారు, శ్రేయాస్ హాస్పిటల్ వారు రిటైర్మెంట్ తరువాత ఆరోగ్యం, ఆహారం, మానసిక  మరియు ఆర్ధిక పరంగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి విశదీకరించారు. 

Comments