మంగళగిరి 27వ వార్డులోని సుమారు 100 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక....

 *మంగళగిరి 27వ వార్డులోని సుమారు 100 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...*


 

మంగళగిరి (ప్రజా అమరావతి);

*వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన వైఎస్ఆర్సిపి మంగళగిరి శాసనసభ అభ్యర్థిని మురుగుడు లావణ్య, పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్కే..*


*మంగళగిరి నగరంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లబ్ధి జరిగింది - ఎమ్మెల్యే ఆర్కే...*


*నగరంలో నిషేధిత జాబితాలో (22 A ) ఉన్న ఇళ్లను ఆ జాబితా నుండి తొలగించిన ఘనత జగనన్న ప్రభుత్వానిది...*


*అప్పటి నిషేధిత జాబితా (22 A) లో నివసించిన తెలుగుదేశం పార్టీ నాయకులు వారి మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలంటూ ప్రశ్న*


ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ : 


వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కులమాత వర్గ ప్రాంత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని అన్నారు....


ఇదే మంగళగిరి నగరంలో ఎన్నో సంవత్సరాలుగా నిషేధిత జాబితా ( 22 A) న్యూస్ చూస్తున్న వారి గృహాలను ఆ జాబితా నుండి తొలగించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని ఆయన పేర్కొన్నారు...


తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులను చెప్పుకునే వారు సైతం అప్పటినుంచి జాబితాలో నివసించారని, తమ ప్రభుత్వం వచ్చాక వారికి కూడా మంచి చేశామని ఆయన ప్రకటించారు...


బలహీన వర్గాల ప్రజలలో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తున్నారని...


అందులో భాగంగానే మంగళగిరిలో అతి సామాన్యురాలు అయిన బీసీ చేనేత సామాజిక వర్గానికి చెందిన మహిళ మురుగుడు లావణ్య మంగళగిరి నియోజకవర్గ అభ్యర్ధినిగా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చారని...


ప్రత్యేకించి మంగళగిరిలో పెత్తందారుడికి సామాన్యురాలికి మధ్య యుద్ధం జరగబోతోంది అని ఈ యుద్ధంలో నియోజకవర్గ ప్రజలందరూ సామాన్యురాలికే మద్దతు తెలుపుతారంటూ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు..

స్థానిక వైఎస్ఆర్సిపి నాయకులు కుంచాల కిషోర్ మరియు పల్లపు వెంకట్రావు ఆధ్వర్యంలో షేక్ ఆశ, షేక్ కైరాన్, షేక్ రహీమా, దామర్ల సులోచన, మౌనిక, వెంకటేశ్వర్లు, సుజాత, వేముల సుధా, షేక్ శారీఫన్, గంగా, బత్తుల సరళ, బూరుసు సీతారావమ్మ, పల్లపు సంతోషం, ఏర్ల వెంకటేశ్వర్లమ్మ, నందిని, జ్యోతి, తమ్మిశెట్టి కుమారి, తన్నీరు మల్లీశ్వరి, డేరంగుల వెంకటేశ్వర్లు, తదితర కుటుంబాల వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.


ఈ కార్యక్రమంలో మంగళగిరి నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments