మాజీ సైనికుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్!.

 *మాజీ సైనికుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్!**దేశం కోసం పనిచేసిన వారిని అన్ని విధాల ఆదుకుంటాం*


*ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ ప్రతినిధులతో నారా లోకేష్*


అమరావతి  (ప్రజా అమరావతి );దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించిన మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటుచేసి, అన్ని విధాల ఆదుకుంటామని నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లిలోని నివాసంలో ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ ప్రతినిధులతో యువనేత ముఖాముఖి నిర్వహించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... యువగళం పాదయాత్రలో మాజీ సైనిక ఉద్యోగులు పడుతున్న కష్టాలు  స్వయంగా గమనించా. నేను ఢిల్లీకి వెళ్లినప్పుడు సెక్యూరిటీ విభాగంలో మన రాష్ట్రానికి చెందినవారే ఎక్కువగా ఉన్నారు. దేశరక్షణ కోసం అహర్నిశలు కృషిచేసిన మాజీ సైనికులను అన్నివిధాల ఆదుకుంటాం. మాజీ సైనిక ఉద్యోగులు క్రమశిక్షణ, పట్టుదలకు నిదర్శనం. మంగళగిరి అభివృద్ధిలో ఎక్స్ సర్వీస్ మెన్ కీలక బాధ్యతలు వహించాలని లోకేష్ కోరారు. 


*యువనేత దృష్టికి మాజీ సైనికుల సమస్యలు*


మాజీ సైనిక ఉద్యోగులు తమ సమస్యలను లోకేష్ దృష్టికి వస్తూ... మాజీ సైనిక కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలుచేయాలని కోరారు. మాజీ సైనిక ఉద్యోగులకు హక్కుగా ఇవ్వాల్సిన 175 గజాల ఇంటి స్థలం కేటాయింపు అమలుకావడం లేదన్నారు. ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు నియోజకవర్గ స్థాయిలో సైనిక కాలనీలు ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు. మంగళగిరిలో మాజీ సైనిక ఉద్యోగులకు కమ్యూనిటీ భవనం నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మాజీ సైనికులకు ఇచ్చే భూమి విషయంలో మూడేళ్ల నిబంధన సడలించాలని, ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించాలన్నారు. చనిపోయిన మాజీ సైనికుల కుటుంబానికి ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలన్నారు. ఉద్యోగాల్లో వయస్సు పరిమితిని పెంచాలని కోరారు. పొరుగు రాష్ట్రంలో అమలవుతున్న కార్యక్రమాలను అధ్యయనం చేసి మాజీ సైనికులను ఆదుకుంటామని లోకేష్ భరోసా ఇచ్చారు. 


*పన్నుల భారం తగ్గించి వ్యాపారులకు అండగా ఉంటాం*


జగన్ పాలనలో పన్నుల భారంతో వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెంచిన పన్నులను తగ్గిస్తామని లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి మండల పరిషత్ కాంప్లెక్స్ లీజు దారులు యువనేతను కలిసి తమ సమస్యలను విన్నవించారు. కాంప్లెక్స్ లో 40 ఏళ్లుగా దుకాణాలు నిర్వహిస్తున్నామని, తమ లీజును కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. 58 షాపుల్లో 24 షాపులు మాత్రమే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయన్నారు. తమపై పన్నుల భారం తగ్గించాలని కోరారు. కాంప్లెక్స్ లీజుదారులు భయపడాల్సిన పనిలేదని, వారికి అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 

Comments