టీడీపీలో చేరిన బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సుధాకర్, వైసీపీ కార్పొరేటర్లు.*టీడీపీలో చేరిన బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సుధాకర్, వైసీపీ కార్పొరేటర్లు


*


*పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన చంద్రబాబు నాయుడు*


అమరావతి (ప్రజా అమరావతి):- విశాఖ దక్షణ నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నేతలు మంగళవారం టీడీపీలో చేరారు. మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్, 35వ డివిజన్ కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు, 29వ డివిజన్ కార్పొరేటర్ ఉరుకూటి నారాయణరావు, దుర్గాలమ్మ దేవస్థానం ధర్మకర్త బత్తి మంగరాజు, గరుడ సత్రం ధర్మకర్త చరకం మణమ్మ, కంటిపిల్లి వరలక్ష్మి, 35వ డివిజన్ వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరీ శంకర్, వర్తక సంఘం జిల్లా సభ్యులు రామిరెడ్డి, నిమ్మ శ్రీనివాస్, ముక్కు శ్రీనివాస్, తదితరులు చేరారు. వీరికి చంద్రబాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Comments