రైతులను ఆదుకోవడంలో వైసీపీ పూర్తిగా విఫలం.



•  *రైతులను నట్టేట ముంచిన వైసీసీ.. ఏపీలో 6000 మంది రైతులు ఆత్మహత్య*

•  *రైతుల ఆత్మహత్యల్లో దేశంలో 3వ స్థానం... కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండవ స్థానం* 

•  *రైతులను ఆదుకోవడంలో వైసీపీ పూర్తిగా విఫలం


•  *వైసీపీ పాలనలో క్రాప్ హాలిడేలు ప్రకటిస్తున్న రైతులు*

•  *కొత్త చట్టం తీసుకు వచ్చి రైతులు, పేదల భూములు కొట్టేయాలని జగన్ మరో ప్లాన్* 

•  *వ్యతిరేకిస్తున్న జనం... వైసీపికి బుద్ధి చెప్పాలని నిర్ణయం*

 *కూటమి నేతలు: మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, శ్రీ పాతూరి నాగభూషణం, శివశంకర్*


అమరావతి (ప్రజా అమరావతి);

జగన్ రెడ్డి రాక్షస పాలనలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని.. జగన్ రెడ్డి ప్రభుత్వం ఆదుకోక అప్పులు తీర్చలేక రైతులు ఉరికొయ్యల పాలవుతున్నారని కూటమి నేతలు మండిపడ్డారు. దేశంలోనే కౌలు రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం రెండోవ స్థానంలో ఉండటం బాధాకరం అన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... 

 

*తెలుగు రైతు సంఘం అధ్యక్షులు శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ...* 


విత్తనం నుండి విక్రయం వరకు రైతులను ఆదుకోవడంలో వైసీపీ చేతులెత్తేసింది. సూక్ష్మ సేద్యంలో రాష్ట్రవాట చెల్లిచడం చేతగాక కేంద్ర వాటాను వదులకున్న చేతగాని చెత్త ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం. సబ్సీడీ ధరలు, మైక్రో ఇరిగేషన్ ను నిండా ముంచారు. సబ్సీడీలు ఇచ్చి కేంద్రం ఆదుకుంటున్నా రాష్ట్రం చేతగాని తనంతో పామాయిల్ సాగును గాలికొదిలేశారు. ఆక్వారంగంలో జోన్ నాన్ జోన్ సిస్టంను తీసుకు వచ్చి  విద్యుత్ ఛార్జీలు, ఫీడ్ రెట్లు పెంచి ఆక్వా రంగాన్నికుదేలు చేశారు.  ప్రకృతి వైపరిత్యాల్లో ఇన్పుట్ సబ్సీడీని అందించాల్సిన ప్రభుత్వం బాధ్యత విస్మరించింది. ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రీమియం చెల్లించకుండా అబద్దాలు చెప్పారు. చంద్రబాబు 70 ఏళ్ల వయసులో అసెంబ్లీలో నెలపై కూర్చుని ఆందోళన చేస్తే  అర్థరాత్రి ప్రీమియం చెల్లించారు.


ధాన్యం కొనుగోళ్ల పేరుతో రైతులను నిలువునా దగా చేశారు. ప్రైవేట్ వ్యాపారులను  కొనకుండా చేశారు. తప్పక వైసీపీ బ్రోకర్లకు రైతులు ధాన్యాన్ని అమ్ముకునేలా చేసి డబ్బులు దండుకున్నారు. వైసీపీ పాలనలో వ్యవసాయం కుదేలైంది. వరిసాగు తగ్గిపోయింది. వైసీపీ విధానాలతో రైతులు క్రాప్ హాలిడేలు ప్రకటిస్తున్నారు. ఏపీలో రూ.225  మద్దతు ధర రైతులు కోల్పోతున్నారని కేంద్ర నివేధికలు స్పష్టం చేస్తున్నాయి. వైసీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోష్ కూడా మీడియా ముందుకు వచ్చి రైతులు నష్టపోతున్నారంటూ గతంలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. జగన్ పాలనలో వాస్తవానికి రైతులు క్వింటాకు రూ.500 వరకు నష్టపోతున్న పరిస్థితి ఉంది. బతకలేక, తలెత్తుకుని తిరగలేక, వ్యవసాయం గిట్టుబాటు కాక, ప్రభుత్వం ఆదుకోక వైసీపీ పాలనలో 6000 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండోవ స్థానంలో ఉంది.


సముద్రం పాలవుతున్న నీటిని వాడుకునేందుకు ప్రాజెక్టులు చేపట్టి రైతులకు టీడీపీ సాగునీరు అందిస్తే. ఆ  ప్రాజెక్టులను గాలికొదిలేసి రాష్ట్ర రైతాంగాన్ని జగన్ రెడ్డి ఎండబెట్టాడు. అసలు రైతులను గిట్టు బాటు ధర ఇవ్వకుండా రైతులను నీరు గార్చి వారి భూములను కొట్టేసేందుకు జగన్ రెడ్డి కుట్ర చేశాడు. ఉత్తరాంధ్రలో కొబ్బరి, జీడి మామిడి రైతులను ఏడిపించారు. రాయలసీమలో పెద్దిరెడ్డికోసం మామిడి రైతులను ఇబ్బంది పెట్టారు. వేరుశన రైతులను పట్టించుకోలేదు. కోస్తాలో మిరప రైతులు తెగుళ్లతో నష్టపోతుంటే వారిని కాపాడేందుకు వైసీపీ ప్రభుత్వం ఒక్క చర్య చేపట్టలేదు. 


నేడు మళ్లీ గుట్టుచప్పుడు కాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకు వచ్చి పేదల భూములను కొట్టేసేందుకు జగన్ రెడ్డి, జే గ్యాంగ్ చుస్తున్నారు. దీనిపై బొత్స, ధర్మాన, సజ్జల, అజయ్ కళ్లంలు ప్రజల్లోకి వచ్చి పచ్చి అబద్దాలు చెతున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా ప్రమాధకరమైంది. అధికారులను చెప్పుచేతుల్లో పెట్టుకుని ప్రజల ఆస్తులను కాజేసేందుకు యత్నిస్తున్నారు. జగన్ రెడ్డి అధికారం శాశ్వతం చేసుకుని ప్రజల హక్కులను తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటున్నారు. రైతు ద్రోహి జగ్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెప్పాలి. 


*జనసేన నాయకులు శ్రీ శివశంకర్ మాట్లాడుతూ...*


రైతు వ్యతిరేక చర్యలతో వైసీపీ రైతులను రోడ్ల పాలు చేసింది. రైతులు ఆత్మహత్యలపై వైసీపీ ఒక్క నివారణ చర్య చేపట్టలేదు. కోరు రంగారావు సిఫార్సులను పెడచెవిన పెట్టి.. రైతులకు కొత్త సమస్యలు సృష్టించారు. కౌలు రైతులకు లోన్లు అందకుండా చేశారు. కౌలు రైతుల ప్రాణాలు తీశారు. ధరల స్థిరీకరణ పథకం అని చెప్పి రైలును దగా చేశారు. రైతు పండించిన పంటను అమ్ముకోలేని స్థితిలో ఉన్నారు. రైతు భరోసా కేంద్రాలు ఉత్సవ విగ్రహాలుగా ఉన్నాయి. ధాన్యం కొనుగోళ్లలో వైసీపీ నేతలు కోట్లు దండుకున్నారు. ఈక్రాప్ ను వైసీపీ కార్యకర్తలకు అనుకూలంగా మార్చుకుని దోచుకున్నారు. 


రైతులకు జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన సాయం ఒక్కటి కూడా లేదు. డ్రైన్ల మరమ్మత్తులకు ఒక్క రూపాయి ఇవ్వలేదు. తుపాన్ తో నష్టపోయిన రైతులకు కేంద్రం ఇచ్చిన సాయంతో కలిపి మొత్తం తానే ఇచ్చినట్లు వైసీపీ అబద్దాలు చెప్పుకుంది. ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ పెద్ద భూటకం. మీటర్ల బిగింపును తెలంగాణలో తీవ్రంగా వ్యతిరేకించారు. మీటర్లతో రైతులకు నష్టం జరుగుతుందని తెలిసినా అప్పులకోసం జగన్ రెడ్డి మీటర్ల బిగింపుకు ఒప్పుకున్నారు. రైతులపై అప్పుల భారాన్ని మోపారు. జాతీయ సర్వేల ప్రకారం ఏపీలో ఒక్క రైతుపై రూ. 2,40,000 వరకు అప్పు భారం ఉంది. టీడీపీ ఇచ్చే రుణాలను రద్దు చేశాడు. సున్నా వడ్డీ పేరుతో ముందే వడ్డీలు దోచేశాడు. డ్రిప్ ఇరిగేషన్, సోలార్ పంపు సెట్లను లేకుండా చేశాడు, వ్యవసాయ యాంత్రీకరణను తుంగలో తొక్కాడు. పాడి రైతులను ఆదుకుంటానని  ఇస్తానన్న బోనస్ లు ఇవ్వకుండా వంచించాడు. ఏపీలో ఉన్న డైరీలను అమూల్ కు ధారాదత్తం చేశాడు. 403 మండలాల్లో కరువు ఉంటే 106 మండలాల్లో మాత్రమే  కరువు ఉందని దగా చేశాడు. సాయిల్ హెల్త్ కార్డులు ఇస్తానని గొప్పచెప్పుకుని రైతులను మోసం చేశాడు. 


ఏవిధంగా చూసినా వైసీపీ ప్రభుత్వ  రైతు కంఠక ప్రభుత్వం. దీన్ని రైతులు గమనించాలి. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులను మోసం చేసి దోచుకుందే కాని మేలు చేయలేదు.  రైతులు ఆలోచించి వైసీపీని గద్దె దించాల్సిన అవసరం ఉంది.         



*బిజెపి నాయకులు శ్రీ పాతూరి నాగభూషణం మాట్లాడుతూ..*


స్వతంత్రం వచ్చిన తరువాత మొట్టమొదటి సారి జగన్ రెడ్డి పాలనలో నాగార్జున సాగర్ రైట్  కెనాల్ నుండి సాగునీరు రాక దర్శి నియోజకవర్గం తాళ్లూరులో పంటలు ఎండిపోయిన పరిస్థితి నెలకొంది. జగన్ పాలనలో రైతులు సాగునీరు లేదు. రాష్ట్ర ప్రజలకు తాగునీరు లేని పరిస్తితి వచ్చింది. అబద్దాలు చెప్పడంలో జగన్ దిట్ట. వంద అబద్దాలను నిజం చేస్తాడు. ఒక నిజాన్ని వందసార్లు చెప్పి అబద్దం చేస్తాడు. ఈనాడు, జోతి పేపర్లు పిచ్చి రాతలు రాస్తున్నాయని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ రెడ్డి పార్టీ తరుఫున పేపర్ నడుపుతూ ప్రజలను ఏమారుస్తూ మభ్య పెడుతున్న విషయం గుర్తించాలి. జూన్ 4 తరువాత అవినీతి చేసిన వారు జైలుకు వెళ్లాసిందే అని మోదీ చెప్పారు. ఆయన చెప్పినట్లు జగన్  జైలుకు వెళ్లడం ఖాయం.


ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజల ఆస్తులను కొట్టేయడానికి కుట్ర చేస్తున్నారు. ఈ టైటిలింగ్ యాక్ట్ ను కేంద్రం తీసుకు వచ్చిందని మళ్లీ పచ్చి అబద్దాలు చెతున్నారు. మీటర్లు పెట్టమని  కేంద్రం చెప్పిందని మోసం చేస్తున్నారు. జగన్ రెడ్డి అప్పులు తెచ్చుకోవడానికి మీటర్లు పెట్టి దోచుకుంటున్నాడు. జగన్ రెడ్డి రైతులను తాకట్టు పెట్టి అప్పులు చేస్తున్నాడు. వైసీపీ నేతలు దోపిడే ధ్యేయంగా వెళ్తున్నారు. విశాఖలో విజయసాయిరెడ్డి దోపిడీని చూసి అక్కడి జనం భయపడుతున్నారు.


దేశానికి అన్నపూర్ణ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ను నిర్వీర్యం చేశారు. జగ్ రెడ్డి చర్యలతో కేంద్రం నుండి సబ్సీడీల రూపంలో రావాల్సిన రూ. 10 వేల కోట్లు ఏపీ ప్రజలు నష్ట పోయారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో పనికిమాలిన డాక్యూమెంట్ లు ఇచ్చి జనాలను మోసం చేయాలని చూస్తున్నారు. అవి చెత్త బుట్టలో వేయడానికి కూడా పనికి రావు. టీఆర్వో చేతిలో అధికారం పెట్టి పేదల భూములను దండుకోవాలని చూస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను  మూడు సార్లు కేంద్రం తిప్పి పంపినా రాష్ట్రం ఆమోదించుకోవడం వెనుక ఉన్న కుట్ర ఏమిటి?  వివాదాలు సృష్టించి పేదల భూములు వివాదాస్పద రిస్టర్ లోకి ఎక్కిస్తే పేద ప్రజలు హైకోర్టులు చూట్టూ తిరగగలరా. ? 


 ఓటమి భయంతో వైసీపీ నేతలు ఏది పడితే అది మట్లాడుతున్నారు.  అవినితితో కూడబెట్టిన డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల్లో వైసీపీ నేతలు గెలవాలనుకుంటున్నారు. వైసీపీ ఎన్ని కుయుక్తులు చేసినా నేడు రాష్ట్ర ప్రజలు నమ్మడంలేదు. రైతులను ముందుకు తీసుకు వెళ్లడమే ఏన్టీఏ కూటమి ముఖ్య ఉద్దేశం. కూటమి అధికారంలోకి రాగానే వైసీపీకి తీసుకు వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తాం, గిట్టుబాటు ధర కల్పిస్తాం, రైతులను ఆదుకుంటాం. ప్రజలు దీన్ని గమనించి రైతు ద్రోహిగా ఉన్న వైసీపీని చిత్తు చిత్తుగా ఓండించాలి.

Comments