చెదురుమదురు సంఘటనల మినహా రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతం.

 *చెదురుమదురు సంఘటనల మినహా  రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతం*               


                                                             *•సా.5 గం.కు 68.04 % పోలింగ్ నమోదు,మంగళవారం తుది % ప్రకటన*

*•ఇప్పటి వరకూ రీపోలింగ్ కు సంబందించి ఎటు వంటి ఫిర్యాదులు లేవు*

*•మెరుగైన ఓటర్ల జాబితాలో ఓటు మిస్పింగ్ అనే ఫిర్యాదులు రాలేదు*

*•అదిగ సంఖ్యలో యువ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు*

*•స్ట్రాంగ్ రూమ్ లలో నిరంతర నిఘా మద్య  ఓటింగ్ యంత్రాలు సురక్షితం*

*రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా*

                                                                                                                                                                                 అమరావతి మే 13 (ప్రజా అమరావతి):    చెదురుమదురు సంఘటనల మినహా రాష్ట్రంలో ఎన్నికలు ఎంతో ప్రశాంతంగా జరిగాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. సాయంత్రం 5.00 గంటలకు 68.04 % పోలింగ్ నమోదు అయిందని, మంగళవారం తుది పోలింగ్ శాతాన్ని  ప్రకటిస్తామని తెలిపారు. ఇప్పటి వరకూ రీపోలింగ్ కు సంబందించి ఎటు వంటి ఫిర్యాదులు లేదని, మెరుగైన ఓటర్ల జాబితాలో ఓటు మిస్పింగ్ అనే ఫిర్యాదులు కూడా రాకపోవడం ఎంతో శుభపరిణామం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అదిగ సంఖ్యలో యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, రిసెప్షన్ సెంటర్లకు చేసే పోలింగ్ ఈవీఎం లను స్ట్రాంగ్ రూమ్ లలో నిరంతర నిఘా మద్య  సురక్షింతంగా భద్రపర్చడం జరుగుతుందని ఆయన తెలిపారు. 


సోమవారం రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ముగింపు సందర్బంగా సాయంత్రం తమను కలిసి పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల సరళిని వివరించారు.   ఉదయం 7.00 గంటలకే  రాష్ట్రంలోని 46,389 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా మొదలైందని, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు  ఉదయం నుండే  క్యూలైన్లో పెద్ద ఎత్తున బారులు తీరారన్నారు.   రాష్ట్రంలో నమోదు అయిన పోలింగ్ శాతం గురించి ఆయన మాట్లాడుతూ ఉదయం 9.00 గంటలకు 9.05 శాతం,  11.00 గంటలకు 23.10 శాతం, మద్యాహ్నం 1.00 గంటకు 40.26  శాతం,  3.00 గంటలకు 55.49 శాతం మరియు సాయంత్రం 5.00 గంటలకు  68.04 శాతం నమోదు అయినట్లు ఆయన తెలిపారు. 17సి రిజిష్టరులను పరిశీలించిన తదుపరి తుది పోలింగ్ శాతం ప్రకటించడం జరుగుతుందన్నారు.  ఈ సారి యువ ఓటర్లు అదిక సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగిందన్నారు .


పోలింగ్  ప్రారంభంలో  275 బ్యాలెట్  యూనిట్లు, 270 కంట్రోల్ యూనిట్లు, 600 వివిప్యాట్లలో చిన్న చిన్న సమస్యలు తలెత్తగా, వాటిని వెంటనే రెక్టిఫై చేయడం జరిగిందన్నారు.  20 శాతం అదనంగా ఈవీఎం లను రిజర్వులో ఉంచుకోవడం వల్ల ఈవిఎం ల సమస్యలను అన్నింటినీ సులభంగా  అదిగమించి పోలింగ్ ప్రారంభించడం జరిగిందన్నారు. అక్కడక్కడా బి.యూ.లు, సి.యూ.లలో కొద్ది పాది సమస్యలు తలెత్తినప్పటికీ, వాటిని వెంటనే సరిదిద్ది  పోలింగ్ ను సక్రమంగా నిర్వహించడం జరిగిందన్నారు. 


పల్నాడు జిల్లాలకు అదిక సంఖ్యలో సి.ఏ.పి.ఎఫ్. బలగాలను ఇచ్చినప్పటికీ దాదాపు ఎనిమిది పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎం లను ద్వంశం చేయడం జరిగిందన్నారు. అయినప్పటికీ ఆయా ఈవిఎంలలోని డాటా చిప్ లలో  స్టోర్ అయిఉన్నందున ఎటు వంటి సమస్యలు తలెత్తలేదని,  రీపోలింగ్ కు అవకాశం ఉండే పరిస్థితులు ఇప్పటి వరకూ తలెత్తలేదని ఆయన తెలిపారు.  మంగళవారం ఉదయం 10.30 గంటల్లోపు రిటర్నింగ్ అధికారి, పరిశీలకుల సమక్షంలో రాజకీయ పార్టీల అభ్యర్థులతో సమావేశం నిర్వహించి, బ్యాలెట్ యూనిట్ లో పోల్ అయిన  ఓట్లు మరియు  17ఎ రిజిష్టరులో నమోదైన ఓటర్ల వివరాలను సరిపోల్చుకోవడం జరుగుతుందన్నారు. ఈ విషయంలో ఏమన్నా తేడాలు ఉంటే, వారి నివేదిక ప్రకారం రీపోల్ విషయాన్ని పరిశీలించడం జరుగుతుందన్నారు. ఈ సారి మెరుగైన ఓటర్ల జాబితాను  రూపొందించడం వల్ల  ఓటర్ల జాబితా తమ పేరు లేదనే విమర్శలు ఎక్కడా రాలేదన్నారు. సాయంత్రం 6.00 గంటల తదుపరి కూడా దాదాపు  3,500 పోలింగ్ కేంద్రాల్లో 100 నుండి 200 మందికి పైగా క్యూలైన్లో ఉన్నారన్నారు.  క్యూలైన్లో ఉన్నవారందికీ వారి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించ  బడిందన్నారు.   


తమకు అందిన సమాచారం ప్రకారం దాదాపు 12 వేల కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియను పూర్తి చేసుకుని ఎలక్షన్ టీమ్ లు  రిసెప్షన్  సెంటర్ కు బయలు దేరాయన్నారు.   మిగిన పోలింగ్ బృందాలు అన్నీ రాత్రి 10.00 గంటల్లా పోలింగ్ ప్రక్రియను పూర్తి చేసుకుని రిసెప్షన్ సెంటర్ కు బయలు దేరతాయన్నారు.  రిసెప్షన్ సెంటర్ కు చేరిన ఈవీఎమ్ లు అన్నింటినీ రాజకీయ పార్టీల  ఏజంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్  లో పెట్టి సీల్ చేయడం జరుగుతుందన్నారు.   సి.ఏ.పి.ఎఫ్. బలగాలకు ఆ స్ట్రాంగుల భద్రతను అప్పచెప్పడం తో పాటు 24x7 సీసీ కెమేరాల నిఘాతో పటిష్టమైన భద్రతను కల్పించడం జరుగుతుందన్నారు. పోటీలోనున్న అభ్యర్థుల తరుపున ఏజంట్లు కూడా  స్ట్రాంగ్ రూముల వద్ద 24x7 ఉండేందుకు అవకాశం కల్పించడం జరిగిందన్నారు. 



Comments