సెప్టెంబర్ 18, 2024న NPS వాత్సల్య పథకాన్ని ప్రారంభించనున్న కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీలో ప్రధాన ప్రారంభోత్సవ కార్యక్రమంలో దాదాపు 75 ప్రాంతాలు వర్చువల్‌గా చేరాయి
PRAN కార్డులతో NPS వాత్సల్యలోకి బాల చందాదారులు ప్రవేశించాలి
NPS వాత్సల్య పిల్లల ఆర్థిక భవిష్యత్తుని సురక్షితం చేయడంలో ముందస్తు ప్రారంభాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వ నిబద్ధతను హైలైట్ చేస్తుంది
2024-25 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటనను అనుసరించి, కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి. నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 18, 2024న న్యూఢిల్లీలో NPS వాత్సల్య పథకాన్ని ప్రారంభించనున్నారు. పాఠశాల పిల్లలు కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.
కేంద్ర ఆర్థిక మంత్రి NPS వాత్సల్యకు సభ్యత్వం పొందడం, స్కీమ్ బ్రోచర్‌ను విడుదల చేయడం మరియు కొత్త మైనర్ సబ్‌స్క్రబైర్‌లకు శాశ్వత పదవీ విరమణ ఖాతా సంఖ్య (PRAN) కార్డులను పంపిణీ చేయడం కోసం ఆన్‌లైన్ వేదికను కూడా ప్రారంభిస్తారు.
న్యూఢిల్లీలో జరగనున్న ప్రారంభోత్సవంలో భాగంగా, దేశవ్యాప్తంగా దాదాపు 75 ప్రాంతాలలో NPS వాత్సల్య ఈవెంట్‌లు ఏకకాలంలో నిర్వహించబడతాయి. ఇతర ప్రాంతాలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో చేరతాయి మరియు ఆ ప్రాంతంలో ఉన్న కొత్త మైనర్ సబ్‌స్క్రైబర్‌లకు కూడా PRAN సభ్యత్వాన్ని పంపిణీ చేస్తుంది.
తల్లిదండ్రులు పెన్షన్ ఖాతాలో పెట్టుబడి పెట్టడం ద్వారా పిల్లల భవిష్యత్తు కోసం ఆదా చేయడానికి మరియు సమ్మేళనం యొక్క శక్తితో దీర్ఘకాలిక సంపదను నిర్ధారించడానికి NPS వాత్సల్య అనుమతిస్తుంది. NPS వాత్సల్య పిల్లల పేరు మీద తల్లిదండ్రులు సంవత్సరానికి రూ.1000 పెట్టుబడి పెట్టేందుకు అనువుగా సహకరించడం ద్వారా అన్ని ఆర్థిక నేపథ్యాల కుటుంబాలకు ఈ పథకం అందుబాటులో ఉండేలా చేస్తుంది.
భారతదేశపు పెన్షన్ వ్యవస్థలో ఒక ముఖ్యమైన దశను సూచిస్తూ, పిల్లల ఆర్థిక భవిష్యత్తుని భద్రపరచడంలో ముందుగా ప్రారంభించేందుకు ఈ కొత్త చొరవ రూపొందించడం జరిగింది. ఈ పథకం పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) కింద అమలు చేయడం జరుగుతుంది.
NPS వాత్సల్య ప్రారంభ కార్యక్రమం, అందరికీ దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక మరియు భద్రతను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం యొక్క నిబద్ధతను హైలైట్ చేస్తుంది. భారతదేశ భవిష్యత్ తరాలను ఆర్థికంగా మరింత సురక్షితంగా మరియు స్వతంత్రంగా మార్చడానికి ఇది ఒక పెద్ద అడుగు అని చెప్పవచ్చు.
addComments
Post a Comment