ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్), మంగళగిరి మరో మైలురాయిని సాధించింది.

మంగళగిరి (ప్రజా అమరావతి);

*AIIMS మంగళగిరి నందు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా ప్రారంభించబడినది, 03 ప్రత్యక్ష సంబంధిత కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తయ్యాయి!*

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్), మంగళగిరి మరో మైలురాయిని సాధించింది.


30.08.2024న విజయవంతంగా మొదటి కిడ్నీ మార్పిడి చేసిన నెల వ్యవధిలోనే మరొక 02 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలను పూర్తి చేసినట్లు సగర్వంగా ప్రకటించింది.

మొదటి కిడ్నీ మార్పిడిని 2024 ఆగస్టు 30న విజయవాడకు చెందిన 29 ఏళ్ల మద్దెల.శ్రీరామ్,వృత్తి రీత్యా మెడికల్ రిప్రజెంటేటివ్‌గా ఉన్న వ్యక్తికి నిర్వహించారు. అతను తన తల్లి శ్రీమతి మద్దెల శ్యామలా దేవి (46 సంవత్సరాల) నుండి ఒక కిడ్నీని పొందాడు. ఇన్‌స్టిట్యూట్‌లోని నైపుణ్యం గల సర్జన్‌లు, యూరాలజిస్టులు మరియు నెఫ్రాలజిస్టుల, సహాయక బృందంతో పాటు AIIMS న్యూ ఢిల్లీ నుండి నిపుణులైన సర్జన్లు డాక్టర్.వి.సీను & డాక్టర్.ఎ.కృష్ణ గారు కిడ్నీ మార్పిడి కార్యక్రమానికి మార్గదర్శకత్వం వహించారు. గ్రహీత మరియు దాత పూర్తిగా కోలుకొని ఆరోగ్యంగా ఉన్నారు.


సెప్టెంబరులొ, ట్రాన్స్‌ప్లాంట్ బృందం మరో రెండు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించింది. డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు సమీపంలోని గ్రామానికి చెందిన కళ్యాణం.గౌరీ ప్రసాద్ అనే ప్రైవేట్ ఉద్యోగి అతని తల్లి కె. దుర్గమ్మ (47 ఏళ్లు) నుండి  కిడ్నీని పొందారు. త్రాసుల సాయి సూర్య ప్రకాష్ అనే మరో రోగి, దాదాపు 30 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, అతని తల్లి శ్రీమతి T. గోవర్ధని (51 ఏళ్ల) నుండి కిడ్నీ పొందాడు. ఈ విజయం, ప్రాంత ప్రజలకు అధునాతన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించాలనే మా నిబద్ధతలొ కీలకమైన ముందడుగును సూచిస్తుంది.

*సంక్లిష్ట వ్యాధుల చికిత్స & సంక్లిష్ట శస్త్రచికిత్సలు*

పైన పేర్కొన్న కిడ్నీ మార్పిడికి అదనంగా, AIIMS మంగళగిరిలొ వివిధ సంక్లిష్ట వ్యాధులకు చికిత్స అందిస్తుంది మరియు సర్జికల్ ఆంకాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్స్, బర్న్స్ & ప్లాస్టిక్ సర్జరీ, మెడికల్ ఆంకాలజీ మొదలైన విభాగాల ద్వారా క్లిష్టమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ శస్త్రచికిత్సను బహుళ 

విభాగాలకు చెందిన బృందం నిర్వహించి, క్లిష్టమైన వైద్య మరియు శస్త్రచికిత్సా విధానాలను నిర్వహించడంలో ఇన్‌స్టిట్యూట్ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. వివిధ క్లిష్టమైన ఇంటర్వెన్షనల్ రేడియాలజీ సేవలు మరియు యాంజియోగ్రామ్ సేవలు కూడా ఇటీవలే ప్రారంభించబడ్డాయి


*పాలియేటివ్ కేర్ అవుట్ రీచ్ టీమ్*

గత ఏడాది కాలంగా, ప్రత్యేకమైన పాలియేటివ్ కేర్ టీమ్ మంగళగిరి మరియు నూతక్కి   ప్రాంతాలలొ  తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు వారి ఇంటి వద్దే సమగ్రమైన సహాయాన్ని అందిస్తోంది, ఇక్కడ ఎయిమ్స్ యొక్క అర్బన్ & రూరల్ శిక్షణా కేంద్రాలు ఉన్నాయి. ఈ బృందం రోగలక్షణ నిర్వహణ, భావోద్వేగ మద్దతు మరియు సమన్వయంతో కూడిన సంరక్షణ ద్వారా రోగులు మరియు వారి కుటుంబాల జీవన నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి సారించి సమయానుకూలంగా గృహానికి వచ్చి సేవలు అందిస్తుంది.


*AIIMS మంగళగిరి గురించి*

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) మంగళగిరి, 2018లో స్థాపించబడింది. మన గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ. నరేంద్ర మోదీ 25 ఫిబ్రవరి, 2024న AIIMS మంగళగిరిని జాతికి అంకితం చేశారు. AIIMS మంగళగిరికి శంకుస్థాపన చేసిన కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి శ్రీ. జగత్ ప్రకాష్ నడ్డా డిసెంబర్ 19, 2015 న ప్రారంభించారు. ఔట్ పేషెంట్ విభాగం 12 మార్చి 2019 న ప్రారంభించబడింది. 5 సంవత్సరాల కంటే తక్కువ వ్యవధిలో దినదినాభివృద్ధి చెందింది. ఇన్‌పేషెంట్, ఐసియు సేవలు, ల్యాబ్ & డయాగ్నొస్టిక్ సేవలు, OT సేవలు, ట్రామా & అత్యవసర సేవలు వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులొకి తీసుకుని రావటం జరిగింది. 


సరసమైన ధరల్లో నాణ్యమైన రోగి సంరక్షణ సేవలను అందించడానికి ఆసుపత్రి సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తూ, రోగి సంరక్షణ గణాంకాలు క్రింద ఇవ్వబడ్డాయి

1. opd సంప్రదింపులు 19,32,329

2. IPD అడ్మిషన్స్ 33,495

3. అత్యవసర అడ్మిషన్స్ 24,682

4. శస్త్రచికిత్సలు 11,197

5. చిన్న శస్త్రచికిత్సలు 27,715

6. ప్రసవాలు 964

7. డయాలసిస్ 5,172

8. ప్రయోగశాల మరియు రేడియోలాజికల్ పరీక్షలు 30,25,509


దీనికి సంబంధించి, ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబడింది, ఇందులో పై చికిత్స మరియు శస్త్రచికిత్సలు చేయించుకున్న రోగులు తమ అనుభవాన్ని పంచుకున్నారు మరియు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో తమ తమ  అభిప్రాయాన్ని అందించారు. సంస్థ డైరెక్టర్ & CEO డాక్టర్. మధబానంద కర్ రాష్ట్ర ప్రభుత్వం మరియు గౌరవనీయ ముఖ్యమంత్రి, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అవసరమైన మౌలిక సదుపాయాలు అందిస్తామని మరియు ఇన్‌స్టిట్యూట్ పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి వీలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. పేషెంట్ కేర్‌లో శ్రేష్ఠత కోసం అచంచలమైన నిబద్ధతతో ఉన్నందుకు ట్రాన్స్‌ప్లాంట్ టీమ్‌తో పాటు వైద్య అధ్యాపకులందరినీ ఆయన అభినందించారు. మెడికల్ ఇన్నోవేషన్‌ను ముందుకు తీసుకెళ్లడం, రోగుల ఫలితాలను మెరుగుపరచడం మరియు హెల్త్‌కేర్ డెలివరీలో కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేయడం కోసం ఇన్స్టిట్యూట్ తన లక్ష్యంలో స్థిరంగా ఉందని ఆయన పునరుద్ఘాటించారు.





Comments