తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ఇక్కడ ప్రతిఒక్కరూ పనిచేయాలి.

   తిరుమల,  అక్టోబ‌రు 05  (ప్రజా అమరావతి);


టీటీడీ అధికారులతో పద్మావతి అతిథి గృహంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సమీక్ష


- సమీక్షకు హాజరైన మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, టీటీడీ ఈవో, అదనపు ఈవో, వివిధ విభాగాల అధికారులు


సమీక్షలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూచనలు:-


తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ఇక్కడ ప్రతిఒక్కరూ పనిచేయాలి.



కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదు.


ప్రశాతంతకు ఎక్కడా భంగం కలగకూడదు...ఏ విషయంలోనూ రాజీ పడొద్దు.


భవిష్యత్ నీటి అవసరాలకు తగ్గట్లు నీటి లభ్యత ఉండేలా చూసుకోండి...ముందస్తు ప్రణాళిక చాలా అవసరం.


అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80 శాతంపైగా పెంచాలని అధికారులకు ముఖ్యమంత్రివర్యులు సూచించారు.


అటవీ సంరక్షణతో పాటు అడవుల విస్తరణ కోసం వచ్చే 5 ఏళ్లకు ప్రణాళికతో పనిచేయాలన్న సిఎం.


బయోడైవర్సీటీ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగిన సిఎం.


టీటీడీ సేవలపై భక్తుల నుంచి స్పందన తీసుకునే విధానంపై అడిగిన సిఎం.


వచ్చిన ప్రతి భక్తుడు తమ అనుభవాలపై అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించాలన్న సిఎం.


భక్తుల సూచనలు, సలహాల ఆధారంగా సేవలపై టీటీడీ పనిచేయాలన్న సిఎం.


ఒక్క టీటీడీలోనే కాకుండా అన్ని దేవాలయాల్లో భక్తుల అభిప్రాయాలు తీసుకునే విధానం తీసుకురావాలని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి సూచించిన ముఖ్యమంత్రి.


లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం నాణ్యత పెరిగింది అని భక్తులు చెపుతున్నారు....ఇది ఎల్లప్పుడూ, పూర్తిగా కొనసాగాలి...మరింత మెరుగుపడాలి.


ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యత బాగుండేలా చూడండి....అత్యుత్తమ పదార్థాలు మాత్రమే వాడాలి.


తిరుమలలో విఐపీ సంస్కృతి తగ్గాలి...ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదు. సింపుల్ గా, ఆధ్యాత్మిక ఉట్టిపడేలా అలంకరణ ఉండాలి....ఆర్భాటం, అనవసర వ్యయం వద్దు.


టీటీడీ సిబ్బంది భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించాలి. దేశ విదేశాలనుంచి వచ్చేవారిని గౌరవించుకోవాలి. దురుసు ప్రవర్తన అనేది ఎక్కడా ఉండకూడదు. భక్తులు సంతృప్తితో, అనుభూతితో కొండ నుంచి తిరిగి వెళ్లాలి.


తిరుమల పేరు తలిస్తే....ఏడుకొండల వాడి వైభవం, ఆధ్యాత్మిక మాత్రమే చర్చకు రావాలి.


స్విమ్స్ సేవలు కూడా మెరుగుపరచాలి....ఇదొక ప్రత్యేకమైన క్షేత్రం. తిరుమల పవిత్రత కాపాడడం, ఆధ్యాత్మిక విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలి అని ముఖ్యమంత్రి సూచించారు.


*ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థల సహకారంతో శ్రీవారి సేవ  (స్వచ్చంద సేవను )మరింత బలోపేతం చేయాలి. తద్వారా భక్తులకు సేవకుల ద్వారా చక్కటి సేవలు అందించాలి.



Comments