ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి వేడుకలు..

 ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి వేడుకలు.


గాజువాక, అక్టోబర్ 30  (ప్రజా అమరావతి);.ప్రతీ ఒక్కరూ భద్రతా ప్రమాణాలు పాటిస్తూ సురక్షితంగా దీపాలు పండుగను జరుపుకోవాలని విశాఖ నగర (సౌత్) శాంతిభద్రతలు విభాగం ఏసిపి టి త్రినాథ్ అన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ గాజువాక యూనిట్ అధ్యక్షుడు పితాని సూర్యప్రసాద్ అధ్యక్షతన బుధవారం గాజువాక లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన దీపావళి వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని జర్నలిస్టులకు దీపావళి బాణాసంచాను అందజేసి అనంతరం ప్రసంగించారు. ప్రతి ఒక్కరి జీవితంలో దీపావళి వెలుగును నింపాలని ఆయన ఆకాంక్షించారు. జర్నలిస్టులు సామాజిక బాధ్యతతో పనిచేస్తున్నారని ఆయన అన్నారు. జర్నలిస్టు మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. గౌరవ అతిథి రైజ్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ అవినాష్ మాట్లాడుతూ నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే జర్నలిస్టులందరూ కలసి దీపావళి వేడుకలను నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు. జర్నలిస్టులకు ఆరోగ్యపరంగా ఏ సమస్య వచ్చినా తమ ఆసుపత్రిలో వైద్యం అందించేందుకు తాము సిద్ధమని ఆయన జర్నలిస్టుల హర్షద్వానాల మధ్య ప్రకటించారు. ఒక కుటుంబ సభ్యుడిగా తాను జర్నలిస్టులకు ఎల్లవేళలా అండగా ఉంటానని డాక్టర్ అవినాష్ పేర్కొన్నారు. డాక్టర్ అవినాష్ చేతుల మీదుగా జర్నలిస్టులకు దీపావళి బాణాసంచాను అందజేశారు. యూనియన్ గౌరవాధ్యక్షుడు డి. నారాయణరావు మాట్లాడుతూ ధనుష్ లంతా ఐకమత్యంతో ఉండాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తుందని అన్నారు. యూనియన్ అధ్యక్షుడు పితాని సూర్యప్రసాద్ మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని, జర్నలిస్టులకు తమ యూనియన్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. యూనియన్ గౌరవ సలహాదారులు ఎల్.రాజు, ఎం కామేశ్వరరావు, సీనియర్ జర్నలిస్టులు ఐ. కృష్ణమూర్తి,

కే. పీ. నాయుడు, యూనియన్ కార్యదర్శి ఎన్. నాయుడు బాబు, ఉపాధ్యక్షుడు ఎం. గిరిబాబు, 

టి. రమణారావు,  కార్యనిర్వాహక కార్యదర్శి బి శిరీష, లక్ష్మీనారాయణ బాలు, కోశాధికారి 

జి. రాంబాబు, సహాయ కార్యదర్శులు జి రాజు, సంతోష్, సిద్ధిక్, బ్రాడ్కాస్టింగ్ నాయకులు శశిభూషణరావు, 

ఏ. సురేష్, కార్యవర్గ సభ్యులు సిహెచ్ శ్రీనివాస్, ఆనంద్, గణేష్, సుధాకర్, పలువురు సీనియర్ జర్నలిస్టులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు  పాల్గొన్నారు.

Comments