పాస్టర్స్ గౌరవ వేతనం కొరకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ ఇప్పించిన చంద్రబాబు .

 పాస్టర్స్ గౌరవ వేతనం కొరకు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ ఇప్పించిన చంద్రబాబు


.

 గుంటూరు (ప్రజా అమరావతి);

జీసస్ బిలీవర్స్ అసోసియేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటి, గుంటూరులోని చేబ్రోలులో ఒక ప్రకటన చేస్తూ, మూడు నెలల పాస్టర్స్ గౌరవ వేతనం కొరకు సుమారు 13 కోట్ల బడ్జెట్ని బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ ఇప్పించినందుకు ముఖ్యమంత్రి కి ఆంధ్ర రాష్ట్ర క్రైస్తవ సమాజం తరపున ప్రొఫెసర్ జోసెఫ్ మోసిగంటి కృతజ్ఞతలు తెలియజేశారు, జగన్మోహన్ రెడ్డి  పాస్టర్ల గౌరవ వేతనం ఇస్తానని మేనిఫెస్టోలో పెట్టినప్పటికిని అధికారంలోకి వచ్చిన మూడు సంవత్సరాల తర్వాత అనేకసార్లు  నియమ నిబంధనలు మార్చి పాస్టర్స్ ని అనేక ఇబ్బందులకు గురిచేసిన తర్వాత కేవలం 8,419 మంది పాస్టర్స్ ని అర్హులుగా చేశారని, అయితే టిడిపి పార్టీ పాస్టర్స్ గౌరవ వేతనం మేనిఫెస్టోలో పెట్టినప్పటికిని, నారా లోకేష్  ఇచ్చిన మాటను బట్టి అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలలు 8 నెలల లోపు లోనే, పథకం యొక్క పేరు కూడా మార్చుకుండనే పాస్టర్ స్ అకౌంట్స్ లో వేయబోతున్నందుకు నారా లోకేష్ కి మరియు ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ సహాయపడిన వరల రామయ్య కి, కొడాలి విజయ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు, 

క్రైస్తవ సమాజం కూడా ఆలోచించాలని మావోడు మావోడు అని అనుకున్న జగన్ మోహన్ రెడ్డి  క్రైస్తవులకు ఎంత అన్యాయం చేశారో, కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో గ్రహించాలని కోరారు, జగన్మోహన్ రెడ్డి  జీవిత కాలం ఉండే పాస్టర్స్ వివాహ లైసెన్స్ ని మూడు సంవత్సరాల కుదించారని, కూటమి ప్రభుత్వం దానిని పది సంవత్సరాల కాల పరిమితికి పెంచిందని, క్రైస్తవ సమాధులకు స్థలాల సేకరణ కోసం ఉత్తర్వులు జారీ చేశారని, జగన్మోహన్ రెడ్డి  12 వేల సుమారు ఎయిడెడ్ స్కూల్స్ క్లోజ్ చేస్తే వాటిని మరల నారా లోకేష్  పరిశీలన చేస్తున్నారని డాక్టర్ జోసఫ్ వివరించారు, జగన్మోహన్ రెడ్డి  యొక్క ఆలోచన విధానాన్ని ముందే గ్రహించి జీసస్ బిలీవర్స్ అసోసియేషన్ కౌన్సిల్, టిడిపి కూటమికి ఎన్నికలలో మద్దతు తెలుపుతూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా, డిబేట్ ల ద్వారాను, వెబ్సైట్ ల ద్వారాను, వీడియోలు ద్వారాను, కాల్స్ ద్వారాను, 175 నియోజకవర్గాలకు ప్రచారం చేశామని డాక్టర్ జోసఫ్ మోసిగంటి అన్నారు, జగన్  ప్రభుత్వంలో క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని, కమ్యూనిటీకి ఏమీ సేవ చేయని వ్యక్తికి ఇచ్చారని, కూటమి ప్రభుత్వం క్రైస్తవ సమాజానికి సేవ చేసే వారికి ఇస్తే, అటు క్రైస్తవ సమాజం మేలు పొంది, కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, వచ్చేనెల మార్చిలో వచ్చే గుడ్ ఫ్రైడే ముందే చైర్మన్ పదవిని ప్రకటిస్తే బాగుంటుందని ప్రొఫెసర్ జోసెఫ్ సూచించారు.

Comments