అమరావతి వేంకటపాలెంలో మార్చి 15వ తేదీన శ్రీనివాస కళ్యాణోత్సవం.

 అమరావతి వేంకటపాలెంలో మార్చి 15వ తేదీన శ్రీనివాస కళ్యాణోత్సవం


తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో  వేంకటపాలెంలో శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం అవరణలో నిర్వహణ

కళ్యాణోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

కళ్యాణోత్సవానికి దాదాపు 20 వేల మంది భక్తులు హాజరయ్యే అవకాశం

కళ్యాణోత్సవం వైభవంగా  నిర్వహించేందుకు విస్తృత స్థాయిలో  ఏర్పాట్లు

తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి జె శ్యామలరావు, సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు , జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి , రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ వినయ్ చంద్,  జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తో కలసి విలేకరుల సమావేశంలో వెల్లడి


గుంటూరు, 07 మార్చి 2025 (ప్రజా అమరావతి):   లోక కళ్యాణార్థం  శ్రీనివాస కళ్యాణోత్సవం మార్చి 15వ తేదీ గుంటూరు జిల్లా, అమరావతి వెంకటపాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి                       జె శ్యామలరావు తెలిపారు. 

  శుక్రవారం అమరావతి, గుంటూరు జిల్లా వేంకటపాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి జె శ్యామలరావు, సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు, జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ వినయ్ చంద్,  జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ్  తేజ తో కలసి మాట్లాడుతూ   రాజధాని ప్రాంతంలో                  శ్రీ వెంకటేశ్వర స్వామి వారి  దేవస్థానం ఏర్పాటుకు 2018లో ప్రభుత్వం వేంకటపాలెంలో 25 ఎకరాల భూమిని కేటాయించిందన్నారు. దేవస్థానం నిర్మాణానికి 2019లో  ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారని 2019 ఫిబ్రవరి 10 నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. దేవస్థానం నిర్మాణ పూర్తి  అయ్యి 2022  నుండి స్వామివారు పూజలు అందుకుంటున్నారన్నారు. శ్రీవారి వైభవాన్ని దేశం నలుమూలల అంతర్జాతీయ స్థాయిలో వ్యాప్తి చేసేలా లోకకళ్యాణార్థం స్వామివారి కల్యాణోత్సవాలను అనేక ప్రాంతాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తుందన్నారు.  ఇక్కడ శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహించాలని ప్రజలు పెద్ద ఎత్తున    విజ్ఞప్తులు చేస్తూండటంతో విస్తృత స్థాయిలో వైభవంగా మార్చి 15వ తేదీన శ్రీనివాస కళ్యాణోత్సవం వేంకటపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆవరణలో నిర్వహించటానికి నిర్ణయించామన్నారు. కళ్యాణోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు ప్రారంభించడం జరిగిందని, సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు,  జిల్లా కలెక్టర్                         ఎస్ నాగలక్ష్మి, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ లను సమన్వయం చేసుకుంటూ కళ్యాణోత్సవానికి పటిష్టంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కళ్యాణోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాల్గొననున్నారని తెలిపారు. కళ్యాణోత్సవం తిలకించడానికి దాదాపు 20 వేల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున భక్తులు ఇబ్బందులు లేకుండా సంతృప్తిగా కూర్చొని కళ్యాణాన్ని వీక్షించేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. బారికేటింగ్, గ్యాలరీలు క్యూ లైన్లు, తదితరులు ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులకు మంచినీరు, అన్నప్రసాదాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కళ్యాణోత్సవ ప్రాంగణంలో ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి దూరంగా కూర్చున్న వారి సైతం కళ్యాణం  వీక్షించేలా ఏర్పాటులు చేస్తున్నామన్నారు. కళ్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరవుతారు అన్నారు. రాజధాని పరిసర ప్రాంతాల గ్రామాల్లో శ్రీవారి బ్రహ్మరథం ద్వారా కల్యాణోత్సవం సంబంధించి ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. కళ్యాణోత్సవంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్,  అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.  కల్యాణోత్సవాన్ని ఎస్వీబీసీ ఛానల్ లోనూ ప్రత్యక్ష  ప్రసారం చేయనున్నమన్నారు.  శ్రీనివాస కళ్యాణం మార్చి 15వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు జరుగుతుందని , సంప్రదాయ వస్త్రాలతో పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి భక్తిశ్రద్దాలతో కళ్యాణోత్సవం తిలకించి స్వామి వారి కృపాకటాక్షాలను పొందాలన్నారు. 

  తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి జె శ్యామలరావు, సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు , జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి , రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ వినయ్ చంద్,  జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ,  సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ్  తేజ                  “ శ్రీనివాస కళ్యాణోత్సవం ” ప్రచార పోస్టర్లు ఆవిష్కరించారు. 

తొలుత తిరుమల తిరుపతి దేవస్థానం  కార్యనిర్వాహణాధికారి జె శ్యామలరావు, సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు , జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ వినయ్ చంద్,  జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ,  సంయుక్త కలెక్టర్ ఏ భార్గవ్  తేజ దేవస్థానం ఆవరణలో శ్రీనివాస కళ్యాణోత్సవం నిర్వహించే సభా వేదిక వద్ద గ్యాలరీలు క్యూలైన్ల ఏర్పాట్లు, భక్తులకు ప్రసాద వితరణ కేంద్రం వద్ద ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, బందోబస్తు తదితర అంశాలను పరిశీలించి చేపట్టాల్సిన ఏర్పాట్లుపై  చర్చించారు.

కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు, తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.

Comments